Saturday 9 September 2023

తిరిగి ఇద్దాం

 తిరిగి ఇద్దాం.                                                  కాలం పుట్టి ఇప్పటికి 1350 కోట్ల                      సంవత్సరాలయ్యింది.అదేంటి కాలానికి పుట్టుక ఏంటీ అంటారా బిగ్ బాంగ్  సిద్ధాంతం ప్రకారం మహా విస్ఫోటనం తర్వాత విశ్వావిర్భావం జరిగింది.అప్పుడు కాలం, స్థలం పుట్టాయి.దేన్నయినా కొలవాలంటే కొన్ని ప్రమాణాలు అవసరం.కాలాన్ని కొలవడానికి సెకను ప్రమాణం.ఆటల పోటీల్లో సెకనులో వందవ వంతు వరకు కొలుస్తారు.పిటి ఉష ఒలింపిక్స్ లో వందవ వంతులో పతకం కోల్పోయింది..మన భూమిపై కాలం భూభ్రమణం వలన ఏర్పడుతుంది.భూభ్రమణానికి  24 గంటలు సమయం పడుతుంది.దీనిని ఒక రోజుగా మనం పరిగణిస్తాం. భూపరిభ్రమణానికి 365 1/4 రోజులు పడుతుంది.దీనికి మనం ఒక సంవత్సరంగా పేరు పెట్టుకుని దానిని సమీక్షించుకుంటూ వచ్చే సం వత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూఉంటాము.కాలానికి మనం విభజన గీతలు గీసి వేడుకలు చేసుకుంటుంటాము.మనం బహుశా భూమి 70 సార్లు సూర్యునిచుట్టు తిరిగేదాకా ఈ భూమిపై ఉంటాం.(సగటు వయసు 70 సం అనుకుంటే)భూమి మీద ఉండే ఈ సమయం లో మనం జీవిత చక్ర భ్రమణం లో చిక్కుకుని సంసార సాగరంలో ఈదుతూ ఒడ్డుకు చేరుకునే సరికి 3 భాగాల వయసయిపోతుంది.అంటే సుమారు 50 ఏళ్ళు దాటి పోతాయి.చివరి 1 భాగం అయినా మన జీవితాన్ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోకపోతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగలదు. పుట్టినప్పటినుండి మనకు గాలి,నీరు,ఆహారం,వస్త్రాలు,ఇల్లు ఇలా సమస్తం ఇచ్చే ఈ భూమికి మనం ఏం తిరిగి ఇవ్వగలం,అని ఆలోచించుకోవాలి.జీవితమంతా తీసుకోవడమే తిరిగి ఇచ్చేదేమీ లేదా?ఇవ్వడం అంటే ఆర్థికసహాయం మాత్రమే కాదు.కొన్ని మొక్కలు నాటి పెంచి పెద్దజేయడం,ఒక కిమీ బైక్,కార్ నడపకుండా నడవడం లేదా సైకిల్ తొక్కడం,1యూనిట్ విద్యుత్,ఒక లీటర్ నీళ్లు పొదుపు చేయడం ,ప్లాస్టిక్ ను తక్కువగా వాడటం ఇవన్నీ ఇవ్వడంలో భాగమే,పర్యావరణానికి మేలుచేయడమే.ఇలా ఎవరికి తోచిన విధంగా వారు,వీలున్న ప్రతి సందర్భం లో ఈ భూమికి మనం ఏమి ఇవ్వగలమో,ఎలా దీన్ని కాపాడుకోగలమో ఆలోచించాలి.భవిష్యత్ తరాలకు ఆకుపచ్చని పుడమిని అందించడానికి ఏమేం చేయగలమో ఆలోచించి,ప్రతి ఒక్కరూ భూమికి మనం తీసుకున్నవాటికి ప్రతిఫలంగా  తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకుందాం.ఈ నూతన సంవత్సరం సందర్భంగా అలాంటి నిర్ణయాలు తీసుకుందాం....ఒద్దుల రవిశేఖర్.(https://m.facebook.com/story.php?story_fbid=3721138517945461&id=100001480499133)

No comments:

Post a Comment