Sunday, 17 September 2023

15.పాటల పూదోట

 

రామ్ గోపాల్ వర్మ "రంగీలా "చూసారా!సురేష్ వాడ్కర్, కవితా కృష్ణ మూర్తి ల గొంతులో మంద్రంగా సాగే ఈ గీతానికి "రెహమాన్ "సంగీతం". పాట లో చరణాలు ఆగిన తరువాత  రెహమాన్ తన ప్రతిభ ను పతాక స్థాయికి తీసుకు వెడతారు. దాన్ని earphones తోనే వినాలి.(https://youtu.be/w7yE8XOE2vM)

14. పాటల పూదోట

 

థమన్ సంగీతం లో వచ్చిన ఓ మలయ సమీరం ఈ మందారం. శ్రేయా ఘోషల్ స్వరంలో మంద్రంగా పలికిన ఈ గీతం మీ కోసం (https://youtu.be/Zo5kxK4j2qY)

13.పాటల పూదోట

 "సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.

తమిళ్

1)(https://youtu.be/bDorKQg8Uyc?si=XIbfC9h8Pde_XuYt)

తెలుగు 2)https://youtu.be/XvBZx0Hauw0?si=D-K6Gly-3qAmF8yh

12.పాటల పూదోట

 "సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.1)Tamil (https://youtu.be/bDorKQg8Uyc?si=-mpHbIq0d6rX12Hr)

2)Telugu (https://youtu.be/XvBZx0Hauw0?si=g1uadzh_89Ojuh9K)

11. పాటల పూదోట

 ప్రభాస్ "రాధే శ్యామ్ " చూసారా, సినిమా సరిగా ఆడకున్నా అందులోని పాటలన్నీ బాగుంటాయి. మిథున్ సంగీతం ఈ పాటలో మన హృదయవీణ ను కొనగోటితో మీటుతుంది .ఆర్జిత్ సింగ్ ఈ పాటకు ప్రాణం పోసాడు.(https://youtu.be/inwnVerWbJo?si=MCPpCBL-l-2KBfIr)

Saturday, 9 September 2023

తిరిగి ఇద్దాం

 తిరిగి ఇద్దాం.                                                  కాలం పుట్టి ఇప్పటికి 1350 కోట్ల                      సంవత్సరాలయ్యింది.అదేంటి కాలానికి పుట్టుక ఏంటీ అంటారా బిగ్ బాంగ్  సిద్ధాంతం ప్రకారం మహా విస్ఫోటనం తర్వాత విశ్వావిర్భావం జరిగింది.అప్పుడు కాలం, స్థలం పుట్టాయి.దేన్నయినా కొలవాలంటే కొన్ని ప్రమాణాలు అవసరం.కాలాన్ని కొలవడానికి సెకను ప్రమాణం.ఆటల పోటీల్లో సెకనులో వందవ వంతు వరకు కొలుస్తారు.పిటి ఉష ఒలింపిక్స్ లో వందవ వంతులో పతకం కోల్పోయింది..మన భూమిపై కాలం భూభ్రమణం వలన ఏర్పడుతుంది.భూభ్రమణానికి  24 గంటలు సమయం పడుతుంది.దీనిని ఒక రోజుగా మనం పరిగణిస్తాం. భూపరిభ్రమణానికి 365 1/4 రోజులు పడుతుంది.దీనికి మనం ఒక సంవత్సరంగా పేరు పెట్టుకుని దానిని సమీక్షించుకుంటూ వచ్చే సం వత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూఉంటాము.కాలానికి మనం విభజన గీతలు గీసి వేడుకలు చేసుకుంటుంటాము.మనం బహుశా భూమి 70 సార్లు సూర్యునిచుట్టు తిరిగేదాకా ఈ భూమిపై ఉంటాం.(సగటు వయసు 70 సం అనుకుంటే)భూమి మీద ఉండే ఈ సమయం లో మనం జీవిత చక్ర భ్రమణం లో చిక్కుకుని సంసార సాగరంలో ఈదుతూ ఒడ్డుకు చేరుకునే సరికి 3 భాగాల వయసయిపోతుంది.అంటే సుమారు 50 ఏళ్ళు దాటి పోతాయి.చివరి 1 భాగం అయినా మన జీవితాన్ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోకపోతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగలదు. పుట్టినప్పటినుండి మనకు గాలి,నీరు,ఆహారం,వస్త్రాలు,ఇల్లు ఇలా సమస్తం ఇచ్చే ఈ భూమికి మనం ఏం తిరిగి ఇవ్వగలం,అని ఆలోచించుకోవాలి.జీవితమంతా తీసుకోవడమే తిరిగి ఇచ్చేదేమీ లేదా?ఇవ్వడం అంటే ఆర్థికసహాయం మాత్రమే కాదు.కొన్ని మొక్కలు నాటి పెంచి పెద్దజేయడం,ఒక కిమీ బైక్,కార్ నడపకుండా నడవడం లేదా సైకిల్ తొక్కడం,1యూనిట్ విద్యుత్,ఒక లీటర్ నీళ్లు పొదుపు చేయడం ,ప్లాస్టిక్ ను తక్కువగా వాడటం ఇవన్నీ ఇవ్వడంలో భాగమే,పర్యావరణానికి మేలుచేయడమే.ఇలా ఎవరికి తోచిన విధంగా వారు,వీలున్న ప్రతి సందర్భం లో ఈ భూమికి మనం ఏమి ఇవ్వగలమో,ఎలా దీన్ని కాపాడుకోగలమో ఆలోచించాలి.భవిష్యత్ తరాలకు ఆకుపచ్చని పుడమిని అందించడానికి ఏమేం చేయగలమో ఆలోచించి,ప్రతి ఒక్కరూ భూమికి మనం తీసుకున్నవాటికి ప్రతిఫలంగా  తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకుందాం.ఈ నూతన సంవత్సరం సందర్భంగా అలాంటి నిర్ణయాలు తీసుకుందాం....ఒద్దుల రవిశేఖర్.(https://m.facebook.com/story.php?story_fbid=3721138517945461&id=100001480499133)

పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనాలు

 The Benefits of Reading books పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనాలు. 

    1) A book is like a garden carried in the pocket.పుస్తకం జేబులో తీసుకువెళ్లగలిగే అందమైన తోట.                 

2) Exercises your brain.మెదడు కు వ్యాయామం కల్పిస్తుంది.              

 3)Provides knowledge and information.జ్ఞానాన్ని సమాచారాన్ని అందిస్తుంది.                                   

  4)Books are a good topic if conversation. సంభాషించుకోవడానికి పుస్తకాలు మంచి వనరులు.        

  5)Reduces stress,put you in a better mood.ఒత్తిడిని తగ్గించి ,మంచి మానసిక స్థితినిస్తాయి                                       

6)better writing skills .మంచి లేఖనా నైపుణ్యాలనులను కలిగిస్తాయి.          

7)Great and free entertainment.ఉచితంగా గొప్ప ఆహ్లాదాన్నిస్తాయి.                                         8) Improves concentration and focus. దృష్టిని,ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.

9)Develops creativity .సృజనాత్మకతను పెంపొందిస్తాయి.                                        

10) Enriches the language and vocabulary.భాషను,పదజాలాన్ని అభివృద్ధి చేస్తాయి.                                       

  11)Good for memory.మంచి జ్ఞాపకశక్తి నిస్తాయి.                                                  

  12) Books pose questions to stimulate further reflection .పుస్తకాలు ప్రశ్నించడం నేర్పుతాయి.         

  13)Introduces to the unknown fantasy world.అగోచరమైన ఊహా ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.                

 14) Increases your ability to empathize with others .ఇతరుల పట్ల మన సహానుభూతి సామర్ధ్యాన్ని పెంచుతాయి.            సేకరణ ,అనువాదం:ఒద్దుల రవిశేఖర్.

జీవితం... స్టీవ్ జాబ్స్

 మీరు పెద్దయ్యాక, ప్రపంచం అలాగే ఉంటుందని, మీరు చేయాల్సిందల్లా దాని పరిధుల్లోపల జీవితాన్ని గడపడం మాత్రమేనని చెబుతారు. ఆ మాటలు విని ఆ గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించకండి. 


మంచి కుటుంబ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి, ఆనందించండి, డబ్బు ఆదా చేయండి. అయితే అది చాలా పరిమిత జీవితం.


మీరు ఒక సింపుల్ విషయం తెలుసుకున్న తర్వాత జీవితం చాలా విస్తృతంగా ఉంటుందని అర్థమవుతుంది.


అదేంటంటే... మీరు జీవితం అని పిలిచే ప్రతిదీ మీ చుట్టూ ఉన్న మీలాంటి వ్యక్తులే రూపొందించారు. వారు మీకంటే తెలివైన వారేం కాదు. మీరు దానిని మార్చవచ్చు, ప్రభావితం చేయవచ్చు... ఈ విషయం అర్థమైతే, మీరు మళ్లీ అదేలా ఉండరు.


 -స్టీవ్ జాబ్స్


When you grow up, you tend to get told that the world is the way it is and your life is just to live your life inside the world. 


Try not to bash into the walls too much. Try to have a nice family life, have fun, save money. That’s a very limited life. 


Life can be much broader once you discover one simple fact. 


That is—everything around you that you call life was made up by people no smarter than you. And you can change it. You can influence it.... Once you learn that, you’ll never be the same again. 


—STEVE JOBS

11.పాటల పూదోట

 నేను ఐష్టంగా వినే పాటలు 

(https://youtu.be/WcYBoOuqG90) తేనియ లాంటి తేట తెనుగు లో సిరివెన్నెల కురిపించిన ఈ కమ్మని గీతాన్ని చిత్ర తన గొంతులో అమృతాన్ని కలిపి పాడింది. శోభా శంకర్ జత కలువగా ప్రకృతి ని తన సంగీతంతో ముడి వేసి రెహమాన్ అందించిన దృశ్య కావ్యం విని తరించండి.

Friday, 8 September 2023

10. పాటల పూదోట

 

మిక్కీ జె మేయర్ versatail composer అనుకున్నంత పేరు రాలేదు కాని. శ్యాం సింగరా య్ ఆయన సృజన. ఈ గీతాన్ని చైత్ర అనురాగ్ కులకర్ణి గానం చేశారు.ప్రకృతి ని సంగీతంలో కలిపి వీనుల విందు చేసిన ఈ గీతాన్ని earphone తో వింటూ చూడండి.(https://youtu.be/rTW7Yb5eRxA)

9. పాటల పూదోట

 సిద్ శ్రీ రామ్ తో ప్రసన్న చేసిన మరో ప్రయోగం ఈ గీతం. శ్రీరామ్ గొంతులో ఎన్ని variations ఉన్నాయో అన్నీ పలికించాడు. అలలై లేచి మెరుపై మెరిసి మన ఎదలో అలజడి లేపుతుంది ఈ సంగీతం. Ear phones పెట్టుకుని, కళ్ళుమూసుకొని వింటే ఎన్ని రకాల instruments వాడారో ఆశ్చర్య మేస్తుంది. చూస్తూ మరోసారి వినండి. జనని కూడా సిద్ తో పోటీ పడింది. ఈ వారం మీ కోసం.(https://youtu.be/t60uDwyxzWQ)

8. పాటల పూదోట

 గోవింద్ సరళ మైన సంగీతానికి ప్రదీప్ గళం మనల్ని ఆలోచింప చేస్తుంది. ఒంటరి తనం నుండి....... ఏకాంతం లోకి ప్రయాణం. సాహిత్యాన్ని అర్ధం చేసుకుంటూ వినండి. ఒంటరి గా వస్తాం ఒంటరిగానే వెడతాం నడుమ జరిగేదంతా మనసుకు పట్టించుకోకుండా ఏకాంత స్థితి లోకి వెళ్ళడానికి ప్రకృతి... సంగీతాన్ని తోడు చేయాలి.(https://youtu.be/2a34XyiZO14)

7. పాటల పూదోట

 

కాలభైరవ అనే singer ఉన్నాడని ఈ పాట విన్నాకే తెలిసింది.ఇంత వరకు వినని అదో ప్రత్యేక స్వరం.భావోద్వేగాలు,ఆవేదన,ఆర్థ్రత తన గళం నుండి జాలువారుతుంటే మనమూ అందులో లీనమౌతాం. సుద్దాల అశోక్ తేజ గీతానికి కీరవాణి సంగీతం మనల్ని కట్టిపడేస్తుంది. పాట చూస్తూ ఒక సారి, చూడకుండా ear phones తో మరో సారి వినండి. నిన్న ప్రకటించిన జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ గాయకుడు అవార్డు కాలభైరవ నే వరించింది.(https://youtu.be/2VmgpHUld8o?si=jjJp1fxdG_WR0L1m)

మంచి -చెడు

 మంచి, చెడులను బుద్ధి విశ్లేషి స్తుంది.కాని ఒక్కోసారి అది చెడును మంచిగా మంచిని చెడుగా పొరబడుతుంది.తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.                                     

చెడును మంచిగా పొరబడినప్పుడు తీవ్ర వేదన నష్టం కలుగుతాయి. మంచిని చెడుగా భావిస్తే మరపురాని గాయమై జీవితాంతం బాధిస్తుంది. ఒద్దుల రవిశేఖర్ 

6.పాటల పూదోట

 

మణిరత్నం "PS 1" సినిమా చూసారా. అందులో రెహమాన్ స్వరపరచిన గీతం "అంతర నంది"గొంతులో నుండి ప్రవహిస్తూ మన హృదయాన్ని తాకుతుంది. ఆ పాటను సముద్రం నేపథ్యంలో ఒక దృశ్య కావ్యం గా మలిచారు మణిరత్నం.(https://youtu.be/bh6et8Ko200)

5)పాటల పూదోట

 

పాట వినడం కూడా ఓ కళే అనేలా చేసిన సంగీత మాంత్రికుడు రెహమాన్. శోభా శంకర్ పాడిన ఈ గీతం headphones పెట్టుకొని వినండి. Background లో రెహమాన్ వాడే instruments మనసు కెంత హాయినిస్తాయో తెలుస్తుంది. ఈ weekend song వినండి మరి.(https://youtu.be/_16dW-ohq54)

4)పాటల పూదోట

 RHTDM సినిమా లోని ఈ Rain theme song ని కరణ్ బీర్ remix చేసిన తీరు superb. Ladies chorus తో పాటు బీట్ mix అవుతూ thrill చేస్తూ ఉంటే flute add అవడం తో మరింత melodious గా మారింది.earphone తో కళ్ళు మూసుకుని వినడం మరువకండి. (https://youtu.be/5maPVXz2Czk?si=y6jGchldzTW-QhD7)

3)పాటల పూదోట

 

ప్రకృతిలో గడపటం, సంగీతం వినడం  మనసుకు ఒత్తిడి తగ్గించే దివ్యఔషధా లు.హృదయం సినిమాలో Hesham స్వరపరచిన ఈ గీతాన్ని విమల్,భద్ర మనల్ని అడవిలో ఉన్నామా అని feel అయ్యేలా పాడారు.మనోజ్ఞ మైన అడవి అందాలు సెలయేటి గలగలలు చూపు తిప్పు కోనివ్వవు. English subtitles చూస్తూ పాటను అర్థం చేసుకోండి.(https://youtu.be/lZL2K3ewRYM)

2) పాటల పూదోట


ప్రపంచ ధరిత్రీ దినోత్సవ సందర్భంగా అత్య ద్భుతమైన జయరాజ్ సాహిత్యం, మోహన్ అందించిన చక్కని సంగీతం,విజయ్ ఏసుదాస్(జేసుదాస్ కుమారుడు) అమృత స్వరంలో జాలువారిన ఈ 23 నిముషాల దీర్ఘ గీతాన్ని save చేసుకుని వినండి. మానవ జీవిత తాత్వికతను రంగరించి మనపై వెదచల్లిన పుప్పొడి పరిమళం ఈ గానం వినండి మరి.(https://youtu.be/j1Z0u4SkdwQ?si=yjOuOSB2CB3xD5XA)

Wednesday, 6 September 2023

1)పాటల పూదోట


మానసిక ప్రశాంతత కు, ఆరోగ్యానికి సంగీతం ఉపకరిస్తుందని తెలిసిందే." నడక " లో మంచి పాటలు వింటుంటే ఆ అనుభూతే వేరు. అలాగే ఒంటరి తనాన్నుండి తప్పించు కోవాలన్నా సంగీతమే దివ్య ఔషధం.విభిన్న మైన పరిమళాలు విరబూసే సంగీతం వినడం అలవాటు చేసుకోండి. దైనందిన జీవిత సమస్యలనుండి కాస్త ఉపశమనం పొందండి

చిత్రం :వందేమాతరం 

పాడటం మొదలెట్టాక stage పై నేను పాడిన మొట్ట మొదటి పాట ఇది.ఈ సినిమా విడుదల కాకముందే Nellore లో శ్రీనివాస్ గారు law చేస్తూ ఉండేవారు. మేము ఆయన ఉండే room పైన ఉండేవాళ్ళం.అప్పుడే ఆయన పాటలు record చేసుకొని practice చేస్తూ ఉండే వాళ్ళు."వందేమాతరం" శ్రీనివాస్ స్వీయ సంగీతం లో ఆయనే పాడిన అర్థవంతమైన గీతం,డా. సినారె రచన.రాజశేఖర్ కి మొదటి సినిమా అనుకుంటా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టినట్లు సినారె వ్రాసిన ఈ పాటను కృష్ణ గారు చక్కగా చిత్రించారు. వందేమాతరం లోని ప్రతి వాక్యానికి అప్పటి పరిస్థితులను అన్వ యించి వ్రాయగా శ్రీనివాస్ తనదైన గంభీరమైన విలక్షణ మైన గొంతుతో అద్భుతం గా పాడారు. అప్పటినుండి ఆయనకు "వందేమాతరం శ్రీనివాస్ అనే పేరు స్థిర పడింది."దర్శకుడు T. కృష్ణ. (https://youtu.be/DICYKmHXbl0?si=Zw5H-RLaolBghS1d)