- ధ్యానించే మనసు ఆధ్యాత్మికత గల మనసు.ఈ ఆధ్యాత్మికత చర్చీలు, ఆలయాలు,భజనలు,తాకలేని మతం.విస్పోటం చెంది ప్రేమ జ్వలించ టమే ఆధ్యాత్మిక మైన మనసు అంటే .
- జీవితం లోని అత్యుత్తమమైన కళల్లో ధ్యానం ఒకటి.బహుశా ఇదే అత్యు త్తమమైనదేమో!ఒకరు మరొకరి వద్ద నుంచి దీన్నినేర్చుకోలేరు.అదే దీని లోని సౌందర్యం.మిమ్మల్నిగురించి మీరు తెలుసుకుంటుంటే అదే ధ్యానం
- ధ్యానానికి అంతమనేది లేదు.ఒక ఆరంభము లేదు.ఒక వర్షపు చినుకు వంటిది.ధ్యానంలేని హృదయం ఎడారిగా మారిపోతుంది.బంజరు భూమి అయిపోతుంది.
- మస్తిష్కం తన కార్యకలాపాలన్నింటిని తన అనుభవాలనన్నింటిని కట్టి పెట్టి అచంచలమైన ప్రశాంతితో ఉండగలదా అని కనిపెట్టడమే ధ్యానం.
- ధ్యానానికి అత్యుత్తమమైన క్రమశిక్షణ ఎంతో అవసరం.అసూయ నుండి అత్యాశ నుండి,అధికారదాహాన్నుండి విముక్తి పొందాలి.
- ధ్యానం మేధకు సంబంధించిన వ్యవహారం కాదు.హృదయం మనసు లోకి ప్రవహించినప్పుడు మనసు తత్వం భిన్నంగా ఉంటుంది.ప్రేమ కదులుతూ ప్రవహించడమే ధ్యానం.
- ధ్యానం ఒక గమ్యానికి చేర్చే సాధనం కాదు.ధ్యానమే మార్గం.ధ్యానమే గమ్యం.రెండూ అదే.
- తెలిసిన విషయాలనుండి విముక్తి చెందడమే ధ్యానంలోని పరిపక్వత ధ్యానం అంటే జ్ఞాన ప్రపంచంలో సంచరిస్తూనే దాని నుంచి విముక్తి చెంది అజ్ఞేయం లోనికి ప్రవేశించడం.
- మీకు నిజంగానే ధ్యానం అంటే ఏమిటో కనిపెట్టాలని కనుక ఉంటె అప్పు డు ఆధిపత్యాలను అన్నింటినీ పూర్తిగా సమిష్టిగా ప్రక్కకి తోసి వేయాలి
- సంతోషాన్ని,సుఖాన్నికొనవచ్చు.నిశ్చలానందాన్నికొనలేరు.పరిపూర్ణ స్వేచ్చ కలిగిన మనోస్థితికి మాత్రమే ఈ నిశ్చలానందం కలుగుతుంది. నిశ్చలానందము యొక్క ఈ స్వేచ్చలో మనసు ప్రవహించడమే ధ్యానం ఈ విస్పోటంలోకన్నులు నిర్మలమై అమాయకత్వంతో నిండి పోతాయి అప్పుడు ప్రేమ దివ్యానుగ్రహ మవుతుంది.
- సావధానతతో స్పృహతో వున్నప్పుడు "నేను" అనే కేంద్రం ఉండదు.ఆ సావధానమే ఆ మౌనమే ధ్యానంలోఉన్న స్థితి.
- విడదీసుకోవడాన్ని,వేరుపరచుకోవడాన్నిఅంతం చేయడమే ధ్యానం. ధ్యానం జీవితాన్నుంచి వేరుగా ఉండే విషయం కాదు.అది జీవితపు అస లు సారం.
- ధ్యానంలో గొప్ప తన్మయీభావం ప్రవహిస్తూ ఉంటుంది.ఇది కంటికీ మస్తి ష్కానికీ హృదయానికీ నిర్మలమైన అమాయకతత్వాన్ని ప్రసాదించే తన్మయత్వం.
- ధ్యానం అంటే మనసు,హృదయము పూర్తిగా సమూలంగా మార్పు చెంద డం అనే అర్థం వున్నది.
- కాలాన్ని ఎరుగని అమాయకత్వంలో ఉండటమే ధ్యానం.
- ఈ ప్రపంచం,దాని తీరుతెన్నుల్నిఆకళింపు చేసుకోవడమే ధ్యానం.
- అవగాహన వికసించడమే ధ్యానం.అవగాహన ఇప్పుడే జరగాలి మరెప్ప టికీ జరగదు.అది ఒక విద్వంసక ప్రజ్వలనం.ధ్యానం అంటే చేతనను అజ్ఞాతాన్నిబాహ్యమైన దానినంతటినీ అవగాహన చేసుకోవడం.
- ఏకాంతంగా ఉన్నప్పుడే ధ్యానించాలి.మనసును ఆలోచనలుండి విడిపిం చినపుడు ఈ ఏకాంతం కలుగుతుంది.ప్రశాంతమైన ఏకాంతంలో నిశ్శ బ్దంగా,రహస్యంగా ధ్యానం సంభవిస్తుంది.
- ఆలోచనలు,మనోభావాలు పూర్తిగా ఎదిగి నశించి పోయినప్పుడు ధ్యానం కాలానికి అతీతమైన వాహినిగా ప్రకాశిస్తుంది.ఆ కదలికలో తన్మయత్వం ఉంటుంది.
- మనసులోని వెలుగే ధ్యానం.నేనును అంతం చేయడమే ధ్యానం.
- ప్రతి నిముషము మరణించడమే ప్రేమ.ప్రేమ పూవులుగా వికసించడమే ధ్యానం.
- తెలిసిన దాని నుంచి విముక్తి చెందడమే ధ్యానంలో మనం చేయవల సినది.
- ఒంటరిగా ఉండటానికి భయపడనప్పుడు,ఈ ప్రపంచానికి చెందకుండా అసలు దేనితోను మమకార బంధంలేకుండా ఉన్నప్పుడు ఏకాంతంలో ని ఆ తన్మయత్వం మీకు లభిస్తుంది.
- మనసు సమస్తం పూర్తిగా మౌనంగా అయినప్పుడు జరిగే ధ్యానమే మానవుడు చిరకాలంగా అన్వేషిస్తున్న దివ్యానుగ్రహం.
- ధ్యాన మంటే అసలు సారాంశానికి తలుపులు తెరవడం,సర్వస్వాన్ని దగ్ధంచేసి బూడిద కూడా మిగల్చని ఒక అగ్నిగుండాన్ని దాని తలు పులు తెరిచి ఆహ్వానించడం.
- నిజమైన ధ్యానానికి పునాది అనాసక్త మైన ఎరుక.అంటే ఆదిపత్యాల నుండి,ఆకాంక్షలనుండి,అసూయనుండి భయాలనుండి విముక్తిని కలిగించే సంపూర్ణ స్వేచ్చ.
- ఆలోచనలనుండి విముక్తి పొంది సత్యం అనే తన్మయానందంలో ప్రవ హించడమే ధ్యానం.
- ధ్యానంలో సమస్త ఆలోచనలు ఆగిపోవాలి.ధ్యానానికి ఇదే పునాది.
- మనలో నుండి కాలాన్ని తీసివేసి మనసును ఖాళీ చేయడమే సత్యం అనే మౌనం.
www.jkrishnamurti.org నందు ఆయన గురించి సమగ్రంగా తెలుసుకొనగరు.