Sunday 12 May 2013

ధ్యానం అంటే .... జిడ్డు కృష్ణ మూర్తి


  • ధ్యానించే మనసు ఆధ్యాత్మికత గల మనసు. ఆధ్యాత్మికత చర్చీలుఆలయాలు,భజనలు,తాకలేని మతం.విస్పోటం చెంది ప్రేమ జ్వలిం టమే ఆధ్యాత్మిక మైన మనసు అంటే . 
  • జీవితం లోని అత్యుత్తమమైన కళల్లో ధ్యానం ఒకటి.బహుశా ఇదే అత్యు త్తమమైనదేమో!ఒకరు మరొకరి వద్ద నుంచి దీన్నినేర్చుకోలేరు.అదే దీని లోని సౌందర్యం.మిమ్మల్నిగురించి మీరు తెలుసుకుంటుంటే అదే ధ్యానం 
  • ధ్యానానికి అంతమనేది లేదు.ఒక ఆరంభము లేదు.ఒక వర్షపు చినుకు వంటిది.ధ్యానంలేని హృదయం ఎడారిగా మారిపోతుంది.బంజరు భూమి అయిపోతుంది.
  • మస్తిష్కం తన కార్యకలాపాలన్నింటిని తన అనుభవాలనన్నింటిని కట్టి పెట్టి అచంచలమైన ప్రశాంతితో ఉండగలదా అని కనిపెట్టడమే ధ్యానం.
  • ధ్యానానికి అత్యుత్తమమైన క్రమశిక్షణ ఎంతో అవసరం.అసూయ నుండి అత్యాశ నుండి,అధికారదాహాన్నుండి విముక్తి పొందాలి.
  • ధ్యానం మేధకు సంబంధించిన వ్యవహారం కాదు.హృదయం మనసు లోకి ప్రవహించినప్పుడు మనసు తత్వం భిన్నంగా ఉంటుంది.ప్రేమ కదులుతూ ప్రవహించడమే ధ్యానం.
  • ధ్యానం ఒక గమ్యానికి చేర్చే సాధనం కాదు.ధ్యానమే మార్గం.ధ్యానమే గమ్యం.రెండూ అదే. 
  • తెలిసిన విషయాలనుండి విముక్తి చెందడమే ధ్యానంలోని పరిపక్వత ధ్యానం అంటే జ్ఞాన ప్రపంచంలో సంచరిస్తూనే దాని నుంచి విముక్తి చెంది అజ్ఞేయం లోనికి ప్రవేశించడం.
  • మీకు నిజంగానే ధ్యానం అంటే ఏమిటో కనిపెట్టాలని కనుక ఉంటె అప్పు డు ఆధిపత్యాలను అన్నింటినీ పూర్తిగా సమిష్టిగా ప్రక్కకి తోసి వేయాలి 
  • సంతోషాన్ని,సుఖాన్నికొనవచ్చు.నిశ్చలానందాన్నికొనలేరు.పరిపూర్ణ స్వేచ్చ కలిగిన మనోస్థితికి మాత్రమే  నిశ్చలానందం కలుగుతుంది.  నిశ్చలానందము యొక్క స్వేచ్చలో మనసు ప్రవహించడమే ధ్యానం  విస్పోటంలోకన్నులు నిర్మలమై అమాయకత్వంతో నిండి పోతాయి అప్పుడు ప్రేమ దివ్యానుగ్రహ మవుతుంది. 
  • సావధానతతో స్పృహతో వున్నప్పుడు "నేను" అనే కేంద్రం ఉండదు. సావధానమే మౌనమే ధ్యానంలోఉన్న స్థితి.
  • విడదీసుకోవడాన్ని,వేరుపరచుకోవడాన్నిఅంతం చేయడమే ధ్యానం.  ధ్యానం జీవితాన్నుంచి వేరుగా ఉండే విషయం కాదు.అది జీవితపు అస లు సారం.
  • ధ్యానంలో గొప్ప తన్మయీభావం ప్రవహిస్తూ ఉంటుంది.ఇది కంటికీ మస్తి ష్కానికీ హృదయానికీ నిర్మలమైన అమాయకతత్వాన్ని ప్రసాదించే తన్మయత్వం.
  • ధ్యానం అంటే మనసు,హృదయము పూర్తిగా సమూలంగా మార్పు చెంద డం అనే అర్థం వున్నది.
  • కాలాన్ని ఎరుగని అమాయకత్వంలో ఉండటమే ధ్యానం.
  • ప్రపంచం,దాని తీరుతెన్నుల్నిఆకళింపు చేసుకోవడమే ధ్యానం.
  • అవగాహన వికసించడమే ధ్యానం.అవగాహన ఇప్పుడే జరగాలి మరెప్ప టికీ జరగదు.అది ఒక విద్వంసక ప్రజ్వలనం.ధ్యానం అంటే చేతనను అజ్ఞాతాన్నిబాహ్యమైన దానినంతటినీ అవగాహన చేసుకోవడం.
  • ఏకాంతంగా ఉన్నప్పుడే ధ్యానించాలి.మనసును ఆలోచనలుండి విడిపిం చినపుడు  ఏకాంతం కలుగుతుంది.ప్రశాంతమైన ఏకాంతంలో నిశ్శ బ్దంగా,రహస్యంగా ధ్యానం సంభవిస్తుంది.
  • ఆలోచనలు,మనోభావాలు పూర్తిగా ఎదిగి నశించి పోయినప్పుడు ధ్యానం కాలానికి అతీతమైన వాహినిగా ప్రకాశిస్తుంది. కదలికలో తన్మయత్వం ఉంటుంది.
  • మనసులోని వెలుగే ధ్యానం.నేనును అంతం చేయడమే ధ్యానం.
  • ప్రతి నిముషము మరణించడమే ప్రేమ.ప్రేమ పూవులుగా వికసించడమే ధ్యానం.
  • తెలిసిన దాని నుంచి విముక్తి చెందడమే ధ్యానంలో మనం చేయవల సినది.
  • ఒంటరిగా ఉండటానికి భయపడనప్పుడు, ప్రపంచానికి చెందకుండా అసలు దేనితోను మమకార బంధంలేకుండా ఉన్నప్పుడు ఏకాంతంలో ని తన్మయత్వం మీకు లభిస్తుంది.
  • మనసు సమస్తం పూర్తిగా మౌనంగా అయినప్పుడు జరిగే ధ్యానమే మానవుడు చిరకాలంగా అన్వేషిస్తున్న దివ్యానుగ్రహం.
  • ధ్యాన మంటే అసలు సారాంశానికి తలుపులు తెరవడం,సర్వస్వాన్ని దగ్ధంచేసి బూడిద కూడా మిగల్చని ఒక అగ్నిగుండాన్ని దాని తలు పులు తెరిచి ఆహ్వానించడం.
  • నిజమైన ధ్యానానికి పునాది అనాసక్త మైన ఎరుక.అంటే ఆదిపత్యాల నుండి,ఆకాంక్షలనుండి,అసూయనుండి భయాలనుండి విముక్తిని కలిగించే సంపూర్ణ స్వేచ్చ.
  • ఆలోచనలనుండి విముక్తి పొంది సత్యం అనే తన్మయానందంలో ప్రవ హించడమే ధ్యానం.
  • ధ్యానంలో సమస్త ఆలోచనలు ఆగిపోవాలి.ధ్యానానికి ఇదే పునాది.
  • మనలో నుండి కాలాన్ని తీసివేసి మనసును ఖాళీ చేయడమే సత్యం అనే మౌనం.
          (నేడు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డుకృష్ణ మూర్తి జయంతి. ఆయన  వివిధ ఉపన్యాసాలలో ధ్యానం గురించి వ్యక్త పరిచిన విషయాలను తెలుగులో పి సదాశివరావు గారు అనువాదం చేయగా ధ్యానం అనే పుస్తక రూపం లో వెలువడింది.అందులోని కొన్ని అంశాలను ఇక్కడ  వ్రాసాను .వారికి ధన్యవాదాలు.) 

www.jkrishnamurti.org  నందు ఆయన గురించి సమగ్రంగా తెలుసుకొనగరు.

Thursday 25 April 2013

ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ----కె.బాలకృష్ణా రెడ్డి గారి దీర్ఘ కవిత పై సమీక్ష

వర్తమాన సమాజంలో మనిషి జీవితం ఎలా ఉన్నది? 
అతను ఎలా జీవిస్తున్నాడు? ఎటువంటి పనులు 
చేస్తున్నాడు? అతని ప్రవర్తన ఎలా ఉంది?అతను చేసే
తప్పులు ఏమిటి? మనిషి ఎందుకిలా తన జీవితాన్ని నిప్పులకుంపటిగాసంఘర్షణల రణంగా
మార్చుకున్నాడు. 
చివరికి తన వెంట ఏమి తీసుకు వెడుతున్నాడు? జీవితాన్ని 
ఎలా జీవించాలి?మనిషన్నవాడు ఎలా ఉండాలి? 
మరణించేంత వరకు ఏమి చెయ్యాలి?వంటి ప్రశ్నలు 
భావ కవిగా ప్రసిద్ధులైనకె.బాలకృష్ణా రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేసాయి.
అది ఇలా "ఆరడుగులనేల ఆహ్వానించిన వేళ "
 అనే దీర్ఘకవితగా మారింది.

      అరవై పేజీల ఈ జీవన కావ్యాన్ని ఒక వ్యాసంలో విశ్లేషించటం సాధ్యం కాదు.
ఇందులోని ముఖ్యమైన విషయాలను, అద్భు
తమైన కవిత్వాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. "ప్రశ్నిస్తున్నా..."
 అని కవితకు ముందు ఆయన వ్రాసిన కవితా నేపధ్యం చదివితే చాలు మొత్తం అంతా అర్థమవుతుంది.
ఇది మనిషి కథ
ప్రతి మనిషి వ్యథ 

నిరంతరం సంపాదించాలనే చూస్తున్న 
మనిషి అర్ధాంతరంగా మాయమైన వేళ
ఆహ్వానిస్తుంది ఆరడుగుల నేల 
అక్కడ అతని ఆత్మను తట్టి లేపి 
కవి అనుసంధించిన ప్రశ్నల పరంపరలే ఈ కావ్యం. 

మనిషివైతే రగిలిపో మనసుంటే పగిలిపో
దానవతను విస్మరించి మానవతను 
ఆవిష్కరించి మానవుడిగా మిగిలిపో 

అంటూ మనిషి గురించి మానవత్వాన్ని
గురించి పూర్తి కవితా వస్తువుగా వచ్చిన కావ్యమిది. 
పుట్టి నప్పటి నుండి వృద్ధాప్య 
వరకు జీవితాన్ని వర్ణిస్తూ

బాల్యం
బంగరు స్వప్నం
అరిషడ్వర్గం దరిచేరని దుర్గం
వృద్ధాప్యం
వేలవేల అనుభవాల
అనునయాల సంకలనం   ----- చాలా సులభంగా అర్థమవుతున్న పదాల పొందిక. 

జీవితం ఒక కమ్మని యోగం   ------- ఒక యోగం లాగా జీవితాన్ని గడిపితే ఎంత బాగుంటుంది.
మరణం తప్పదని తెలిసి
ప్రతిక్షణం రణన్నినాదం
ప్రతి నిముషం మారణ హోమం
పగలు రేయి అసుర కేళీ కలాపం 
 

వర్తమానంలో జరుగుతున్న వాస్తవ దృశ్యానికి ఇది ప్రతిబింబం.
స్మశానాన్ని వర్ణిస్తూ 

జీవన సాఫల్యాన్ని,వైఫల్యాన్ని
దైన్యాన్ని హైన్యాన్ని
తర్కిం చుకునే ఏకైక ప్రదేశం

సమాజం లోని అన్ని వృత్తుల వారు
తమ వృత్తి ధర్మాన్ని 
సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం బాగుపడుతుందని 
కవి భావిస్తాడు.కాని వారు ఆ పని చేస్తున్నారా అన్న 
ఆవేదనతో

దేశం కన్నీరు పెడుతుంది
సమాజం వెక్కి వెక్కి ఏడుస్తుంది

ఒకప్పటి మనిషి తనం మరచి రాక్షత్వాన్ని
మనిషి అలవరచుకున్నాడు అని కవి బాధపడతాడు.
మరణించిన 
మనిషిని శ్మశానం లోకాసేపు ఆపి అతని ఆత్మతో సంభాషిస్తాడు 
కవి.అతను జీవితం లో ఏమేమి చేసాడో ఏమి కోల్పోయాడో 
ప్రశ్నిస్తూ ఈ దీర్ఘ కవితను కోన సాగిస్తాడు.


జీవితం ఒక వరం
'జీవించు' వాళ్ళెందరు

ప్రేమించటం ఒక తపస్సు
'ప్రేమించే' వాళ్ళెందరు
  
ఎంత లోతయిన ప్రశ్న వేసారో గమనించండి.తన జీవిత కాలంలో అర్థాంగిని
ఏ  మేరకు అర్థం చేసుకున్నావు అమ్మా నాన్నలను ఏ  విధంగా  అర్థం ఎలా చేసుకున్నావు
 అని ప్రశ్నిస్తూ

అర్థం కాలేదా అమ్మ మనసు
వ్యర్థం అయింది కదా నాన్న తపస్సు

నీ ఎదుగుదల కోసం ఎంతో మందిని 
నాశనం చేసావు,
వారి ఉసురు నీకు తగిలిందేమో అంటూ

నువ్వు  మనిషితనం కోల్పోయావు  
మానవతకు దూరంగా జరిగావు.
సంగీతం సాహిత్యం లాంటి కళలంటే 
తెలీకుండాజీవించావు
జీవిత మంటే ఓ ఆహ్లాదం

మందారాలు, మకరందాలు
సింధూరాలు, సిరిచందన గంధాలు
మధు వనాలు, మలయానిలాలు
హరివిల్లులు, విరిజల్లులు
పూల పుప్పొళ్ళు, పున్నమి చప్పుళ్ళు

లాంటి తన భావ కవితా విభ్రమాన్ని
మన కళ్ళ 
ముందు౦చుతాడు. ఇంత అందమయిన జీవితాన్ని నరక ప్రాయం 
చేసుకున్నావెందుకని కవి మనిషిని ప్రశ్నిస్తున్నాడు. 

నువ్వు మాత్రం మనిషి తనం కోల్పోయావు?

మన నాగరికత, భాష సంస్కృతి 
అంతరిస్తున్నాయని   కవి ఆవేదన


ఎంత ఖేదం నలుగురికీ పంచావో 
ఎంత మోదం బూడిద పాలు చేసావో    ------- మనిషి చేస్తున్న
దిదే కదా!

నవ్వడం మరిచి పోయావు
నడవడం మరిచి పోయావు
నయాగరాలు మరచిపోయావు
నయగారాలు మరచి పోయావు
ఎన్ని అద్బుతాలు కోల్పోయావు
ఎన్ని జీవన సత్యాలు విస్మరించావు

అని కోల్పోయిన జీవితాన్ని గురించి చెబుతున్నాడు.

గుట్టలుగా కలిమి పోగుచేసుకున్న వ్యామోహం
కట్టెలతో చెలిమి చేస్తున్న దృశ్యం
  

అంటూ నీ వెంట ఏమీ రావు అనే సందేశం వినిపిస్తున్నాడు. మనిషికున్న భయాలకు మూల కారణం

అజ్ఞానం,అవివేకం
అక్కర లేని ,అవసరం లేని
కలిమితో బాంధవ్యం      ------ అని ఒక్క మాటతో 
తేల్చేస్తారు కవి.


మనిషికి డబ్బు చేసింది
నయం కాని మాయదారి జబ్బు చేసింది    --------

 అన్నకఠిన సత్యాన్ని ఆవిష్కరించారు. 


ప్రతి వ్యక్తిలో నైతిక విలువల పతనం
కుట్రలు,కుయుక్తుల చెలగాటం
మానవత శిధిల మై పోతున్న ఆనవాళ్ళు
దానవత రొద చేస్తున్న కీచురాళ్ళు     --------- 

అంటూ మనిషి తత్వాన్ని x-రే తీసాడు.


ప్రేమంటే ఒక ఉన్మాదం
ప్రేమించకుంటే ఉగ్రవాదం
ఏ ఉదాత్త సంస్కృతికి చిహ్నాలు
ఏ గొప్ప నాగరికతకు ఆనవాళ్ళు       ---------

 అంటూ ప్రేమ పేరుతో జరుగుతున్న
 ఆకృత్యాలను ప్రశ్నిస్తున్నాడు.


మానవత్వం కోల్పోయిన మనిషి
మృదుత్వం ఆర్ద్రత ఆవిరయిన మనిషి    ------

మనిషి ఇలా ఉన్నాడు ప్రస్తుతం.


ఒకటే జీవితం
ఇంత ఉలికి పాటెందుకు
ఒకటే దేహం
ఇంత రాద్దాంతమెందుకు     ------- 

నాలుగు మాటల్లో జీవిత సారం చెప్పారు.

ఒక ఒప్పందం చేసుకుందాం
చితి మంటల సాక్షిగా
చివరి వీలునామా వ్రాసుకుందాం 
కనీసం వచ్చే జన్మ లోనయినా మనిషిగా నడయాడాలని
శపథం చేసుకుందాం       ------- 

 అంటూ
 మనిషికి వీడ్కోలు ఇస్తున్నాడు.

ఈ భూమిపై మనజీవితం
విహారానికొచ్చినట్లుండాలి .
వచ్చిన పని కాగానే మృత్యువు సడి వినగానే
హాయిగా నిష్క్రమించాలి
ఒక చరిత్రను లిఖించి
ప్రతి ఒక్కరూ మహాత్ముడయి
నిర్గమనం చేయాలి.
అదే నిజమైన మరణం.
మహాభినిష్క్రమణం 

మనిషిని గురించి ఇంత వేదన చెంది, 
జీవితం ఎలా ఉండాలో, 
ఎలా ఉండకూడదోఇంత సరళంగా ఇంత అంద మైన 
పదాలతోచెప్పిన కావ్యం మనకు కనిపించదు. 
సామాన్య పాఠకుడిని కూడా చివరి వరకు చదివిస్తూ తీసుకువెడుతుందిప్రతి ఒక్కరికి తన జీవితం లోని 
అనేక సంఘటనలను గుర్తుకుతెస్తుంది.

మనిషి తరపున వారికి ధన్యవాదాలు. 

ఈ జీవన కావ్యం ప్రతి ఒక్కరు చదవతగ్గది. కె. బాలకృష్ణా రెడ్డి గారి కవితల కొరకు వారి "కవితాంధ్ర "
బ్లాగ్ చూడగలరు.


                         

                          

Tuesday 23 April 2013

పుస్తకాలే మన నేస్తాలయితే !



            తల్లి  సుద్దులు  చెబుతుంది .తండ్రి మార్గం చూపిస్తాడు.గురువు ఇంగితం బోధిస్తాడు.ఏక కాలంలో ఈమూడు ధర్మాలను స్నేహనిష్టతో నిర్వర్తించేది మాత్రం లోకంలో పుస్తకాలు ఒక్కటే!-------డా సర్వేపల్లి రాధాకృష్ణన్
            కల్పతరువు,గురువు,పురాతన,ప్రస్తుత భవిష్యత్కాల సంపద ,కరదీపిక,ఆశారేఖ పుస్తకమే ----మహాత్మా గాంధీ.
            మంచి మిత్రులు,మంచి పుస్తకాలు,మంచి నిద్ర..... వీటికి మించిన మంచి ప్రపంచం మరొకటి ఏముంటుంది.--------మార్క్ ట్వైన్
         షేక్స్పియర్ ,గర్సిలసో లవేగా వంటి విశ్వ విఖ్యాత సాహిత్య వేత్తల జన్మదినం ఏప్రిల్ 23 .ఈ రోజును UNESCO ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించింది.
           పుస్తకం మనిషి మస్తకం లోని భావాల ఆలోచనల అనుభవాల అనుభూతుల వ్యక్తీకరణ. విశ్వావి ర్భావం భూమి చరిత్ర,జీవ పరిణామ క్రమం చారిత్రక విశేషాలు,మనిషి సృష్టించిన విభిన్నతత్వాలు కను గొన్న జ్ఞానము ,సృజించిన కళలు,సృష్టించిన సాహిత్యం మొత్తం అంతా అక్షరబద్ధం గావించటం అవి పుస్త కాల రూపంలోమనిషి జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యంలా మనకు దర్శనమిస్తున్నాయి.
           ఒక పుస్తకం చదువుతున్నామంటే ఆ రచయిత అనుభవాన్ని లేదా అతని జ్ఞానాన్ని మనం కొద్ది సమయం లోనే తెలుసుకుంటున్నాము.ఆ రచయిత దాన్ని పుస్తక రూపంలో మలచటానికి అహోరాత్రాలు కష్టించి ఉంటాడు అతని కష్టాన్ని మనం ఎంతో తేలికగా చదివేసి తెలుసుకుని ఆనందిస్తున్నాము.జ్ఞానం అనుభవం ద్వారా,తనకు కలిగి న ఆలోచన ద్వారా,పుస్తకాల ద్వారా,ఎవరో ఒకరు నేర్పటం ద్వారా లభిస్తుం ది.దానిని ఇతరులకు పంచటం అతని ప్రాధమిక కర్తవ్యం.అందుకే మనిషి సృష్టించిన ప్రతి విషయం ఈ రోజు పుస్తకాల రూపంలో ప్రపంచ మంతా అందుబాటులో ఉంది.
        మంచి పుస్తకాలు చిరకాల స్నేహితుల్లాంటివి.మంచి స్నేహితులు దొరికిన వారు చాలా అదృష్ట వంతులు .కాని మంచి పుస్తకాన్ని నమ్ముకుంటే వారు మరింత అదృష్ట వంతులు.
           కాని ప్రస్తుతం T.V,COMPUTER,CELLPHONE వచ్చిన తర్వాత చదవటం కంటే చూడటం ఎక్కువయిం ది.కాలాన్ని ఎక్కువగా సినిమాలు,సీరియల్లు,క్రికెట్ ,ఫోన్ సంభాషణలు,బాతాఖానీలు,వంటి వ్యాపకాలతో చద వటం తగ్గిపోతుంది.
           విద్యార్ధి దశలోనే పిల్లలకు పుస్తకాలు(తరగతి పుస్తకాలే కాదు) చదివించటం నేర్పిస్తే ఆ అలవాటు  జీవిత మంతా  ఉంటుంది.మంచి కథల పుస్తకాలు చదివిస్తే వారిలో ఊహా శక్తి పెరుగుతుంది.ఇక యువత తమ జీవితానికి పనికి వచ్చే వ్యక్తిత్వాన్ని వికసింప జేసుకునే  పుస్తకాలు చదివితే మంచిది.అలాగే మలి  వయసులో మెల్లిగా తత్వం ,సాహిత్యం,ఆధ్యాత్మికం వంటి విషయాల వైపు దృష్టి మళ్లిస్తే బాధ్యతల నుండి విరమించిన తర్వాత ఆ అలవాటు మంచి నేస్తమవుతుంది.
      ఇలా ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ,తాము మెచ్చిన ఏదో ఒక పుస్తకాన్ని రెండు నెలలకు ఒకటి అయినా చదవ గలిగితే ఎంతో  బాగుంటుంది.సమయం ఉన్నవారు ఎంత చదివితే అంత జ్ఞానం.
               జ్ఞానం తేనె లాంటిది.దాన్ని మరణించే లోపు ఎంత సేవిస్తే అంత మంచిది.
 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకాలను మన స్నేహితులుగా మార్చుకుందాం.మన జీవితాలను ఉన్నతంగా మార్చుకుందాం

Thursday 11 April 2013

విజయనామ ఉగాది ---తెలుగు వైభవం


       
                          ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు ప్రజలందరికి విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.తెలుగు వారి మొట్ట మొదటి పండుగ ఇది.చైత్ర శుద్ధ పాడ్యమిన ఈ పండుగ వస్తుంది..ఇది ఉగాది అనే సంస్కృత పదానికి వికృతం.యుగానికి  ఆది కాబట్టి యుగాది అయింది.
       ఉగాది=ఉక్+ఆది ,ఇందులో ఉక్ అనగా నక్షత్రము అని అర్థం.మనిషి ఆది నక్షత్రాన్ని కనుగొన్న రోజు ఆదిమ దశ నుండి వైజ్ఞానిక దశకు ఎదిగే క్రమంలో జరుపుకున్న తొలి ఉత్సవం అని అంటారు.
      నూతన సంవత్సరం లో కలుగబోయే సుఖ దుఖాలకు,తీపి గుర్తులకు చెడు అనుభవాలకి ప్రతీక ఈ షడ్రుచులుగల ఉగాది పచ్చడి.పచ్చడిలో వాడిన ప్రతి వస్తువు ఒక్కోఔషధం.వేప పూత(చేదు),మామిడి ముక్కలు(వగరు ),చింత పండు పులుసు(పులుపు),చెరకు ముక్కలు,మిరియాలు(కారం
) జీల కర్ర,బెల్లం(తీపి),లవణం(ఉప్పు) శనగలు,పాలు,కొబ్బెర ముక్కలను కలుపుతారు. ఇంకా అరటిపళ్ళు,ఎండు ద్రాక్ష,జీడిపప్పు,బాదం పప్పు కూడా రుచి కోసం వేసుకుంటారు.ఈ పచ్చడి తినటం శరీరానికి మంచిది.బంధు మిత్రులకు కూడా పంచాలి.
             చై త్రం,వైశాఖం ఈ రెండు నెలల్ని కలిపి వసంత రుతువు అంటారు.ఈ కాలంలో గాలి మెల్లగా వీస్తుంది.చెట్లు పాత ఆకులు రాల్చి కొత్త చివుళ్ళు చిగురిస్తాయి.ఇది వసంతోదయానికి స్పష్ట మైన లక్షణం.కోయిలలు మదురం గా కూస్తుంటాయి.ఈ రుతువులో కోయిల మామిడి చిగురు తింటూ ఉత్సాహంగా గానం చేస్తుంటే ప్రకృతి పరవశించి పోతుంది.సృష్టిలో జరిగే ఈ రమణీయ మైన మార్పు మనకు ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని కలిగిస్తుంది.
         ఈ సందర్భంగా తెలుగు భాష గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
                                            మంచి గుమ్మడి కన్నా దంచిన
                                         కొవ్వడ్ల బియ్యము కూడు కన్నా
                                       మేల్ జహంగీర్ మామిడి పండు కన్నా సుం
                                            కారిన లే సజ్జకంకి కన్నా
                                   కమియ పండిన ద్రాక్ష కన్న,చక్కర తగ
                                        బోసి వండిన పాలబువ్వ కన్న
                                      రస దాడి కన్నా పనసతోన కన్న,క
                                        జూరము కన్నను జున్నుకన్న
                                  అలతి పెర తేనియల కన్న,నామని తరి
                                     కొసరి కోసిన కోయిల కూత కన్న
                                    ముద్దులోలికెడి జవరాతిమోవి కన్న
                                    తీయ నైన దెయ్యది? అదే తెలుగు బాస    __ముదిగొండ వీర భద్ర మూర్తి.
                                  ఎంత కమ్మగా ఆ కవి వర్ణించాడో చూడండి.
         శాత వాహనుల కాకతీయుల ,కృష్నదేవరాయల పాలనలో తెలుగు భాష వృద్ది చెందింది.కృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో దేశ భాష లందు తెలుగు లెస్స అన్నాడు.ఇటలీ దేశస్థుడైన నికొలా య్ కామ్తే1420 లోమన భారత దేశం వచ్చినప్పుడు మన  తెలుగు భాష గురించి Italiyan of the east అన్నాడు.ఇటలీ భాష కూడా మన భాష లాగే అజంత భాష. అనగా పదము చివర అచ్చుతో అంత మయ్యె భాష.ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి సుందర తెలుంగు అన్నాడు.
        శాతవాహనులలో ప్రముఖుడైన హాలుడి ఆస్థానం లో గునాడ్యుడు ఆస్థాన కవిగా ఉండే వాడు.ఆ యన పైశాచీ భాషలో వ్రాసిన  బృహుత్కథ ప్రపంచం లోని ప్రముఖ భాష  లన్నింటిలోకి అనువాదం అయింది.ఇది  తెలంగాణాలో పుట్టింది.దీనిని సోమ దేవుడు తెలుగు లో కథా సరిత్సాగరం గా అనువదించారు.
        తెలుగు మొట్ట మొదటి పద్యం తరువోజ ఇది అద్దంకి లో పుట్టింది.కందం కరీంనగర్ లో పుట్టింది.వేమన ఆట వెలది లో అద్భుత మైన పద్యాలు వ్రాసారు.ఆది కవి నన్నయ,తిక్కన ఎర్రన కవిత్రయం మహా భారతాన్ని ఆంధ్రీకరిం చారు.ఆధునిక కాలం లో గురజాడ,వ్యవహారిక భాశోద్యం సారధి గిడుగు రామమూర్తి తెలుగును సుసంపన్నం చేసారు.తన జీవితాన్ని తెలుగు భాష కోసం వెచ్చించిన మహనీయులు బ్రౌన్.వీరు ఎన్నో తెలుగు గ్రంధాలను వెలికి తీసారు.అలాగే కద్వెల్,గిన్,హాల్డేన్ మొదలైన వారు ఎంతో సేవ చేసారు.డా డేనియల్ నేజర్స్ తెలుగు వారి బుర్ర కథలపై పరిశోధన చేసి పారిస్ లో సిద్దాంత వ్యాసం సమర్పించాడు.
            కర్నాటక సంగీత వాగ్గేయ కారుల్లో త్రిమూర్తు లైన శ్యామ శాస్త్రి,త్యాగ రాజు,ముత్తు స్వామి మన తెలుగు వారే .వస్తుత ఇది తెలుగు సంగీతమే.
          ప్రపంచం లో లిపి ఉన్న భాషల్లో అత్యుత్త మైన దాని ఎంపిక చేయగా మన తెలుగుకు ద్వితీయ స్థానంవచ్చింది కొరియాకు ప్రధమ స్థానం ,ఆంగ్లానికి తృతీయ స్థానం వచ్చాయి.దీనికి విశేష కృషి చేసి అచ్చ తెనుగు సొగసును సొబ గును ప్రపంచానికి చాటిన వారు మాడ భాషి సంపత్కుమార్.
          ఎదుటివారికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఆ మాటల భావం వారి మెదల్లలోకి వెడుతుంది.అదే వారి మాతృ భాషలో మాట్లాడితే నేరుగా వారి హృదయాలను తాకుతుంది--------నెల్సన్ మండేలా    ఇది అక్షర సత్యం కదా!
        ప్రతి ఒక్కరు తమ మాతృ భూమిని ,సంస్కృతిని,మాతృ భాషను గౌరవించాలి.ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని కలిగించేవి.--------------ఋగ్వేదం
        600 సంవత్సరాల క్రిందట భరతుని నాట్య శాస్త్రం నుండి సిద్ద్డెంద్ర యోగి కూచి పూడి  నాట్యాన్ని సృష్టించారు చక్కర తేనెల ఊట,మధురామ్రుతాల తోట ,నవరస నాట్య దీపిక మన కూచిపూడి
        బాపు బొమ్మలు,బాపు అక్షర శైలి మన భాషకే సొంతం.అన్నమయ్య ,త్యాగయ్య,క్షేత్రయ్య ప్రముఖ వాగ్గేయ కారులు.
          మల్లె పూవు కంటే----- మంచి గంధము కంటే
          పంచదార కంటే----పాల కంటే
          తెలుగు భాష లెస్స!దేశభాషలకు,సం
          గీతభాష తెలుగు జాతి భాష ----------రసరాజు
   ఒక సంగీత మేదో పాడినట్లు ,భాసించు నపుడు వినిపించు భాష అన్నారు విశ్వనాద.
   అవధానం తెలుగు భాషలో మాత్రమే ఉంది కొండవీటి వెంకట కవులు,గరికపాటి,నాగ ఫనిశర్మ ప్రసిద్ధులు.
చలం,శ్రీశ్రీ,శేషేంద్ర శర్మ,డా సి.నారె, దాశరథి ఇలాంటి ఎంతో మంది ఆధునిక కవుల వలన కూడా తెలుగు భాష పరిమళిస్తుంది.
(పై సమాచారం తెలుగు వెలుగు మాస పత్రిక, మరికొన్ని ఇతర పుస్తకాలనుండి సేకరించినది.వారికి ధన్య వాదాలు.)

Sunday 7 April 2013

ఆరోగ్యమే మన లక్ష్యమైతే !


                మనం ఎన్నో లక్ష్యాలను సాధించాలని అనుకుంటాం.మానవ జీవన పురోగమనానికి ఈ వైఖరే  కారణం కానీ మనం అనుకున్న లక్ష్యాలను సాధించటానికి మన ఆరోగ్యం సహకరించాలి కదా!లక్ష్యాల సాధనకు ఓ లక్ష్యం పెట్టుకోవాలి.అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం.మన పెద్దలు ఎన్నో ఆరోగ్య సూత్రాలను పాటించేవారు.ప్రశాంత మైన, ఆరోగ్యకరమైన జీవనం సాగించారు.వేగవంత మైన ఆధునిక జీవన శైలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంది.చివరికి ఆరోగ్యం పాడవగానే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా,శారీరకంగా మానసికంగా క్రుంగి పోతుంటారు.కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకుంటే ఎవరికి  వారు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.
       వివిధ రకాలయిన ఆహార పదార్ధాలు  ఎటువంటి పోషక విలువలు కలిగి ఉన్నాయో  NIN(National institute of Nutrition) వారు  సమగ్రంగా పరిశోధించి తెలియ జేశారు.ప్రతి రోజు దినపత్రికల్లో,పుస్తకాల రూపేణా ఈ సమాచారం  దొరుకుతుంది.అలాగే ఏ ఆహారం ఎటువంటి నష్టం కలుగ జేస్తుందో కూడా మనం డాక్టర్స్ ద్వారా సమాచార సాధనా ల  ద్వారా తెలుసుకుంటూ ఉంటాం.కానీ ఆచరణ కొచ్చేసరికి విఫల మవుతూ ఉంటాం.రుచి కోసం ఎప్పుడయినా తినటం వేరు,ప్రతి రోజు రుచులకు అలవాటుపడి ఎక్కువ మోతాదులో తినటం వేరు.ఒక పదార్థం మనకు హాని కరమైనది అని తెలిసిన వెంటనే దాన్నుండి క్రమేపీ దూరం కావటం మొదలెట్టాలి.అవసరానికి మించి ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవటం,అధిక కొవ్వును పెంచుకోవటం,ఊబకాయాన్ని పొందటం ఇదంతా ఓ విష వలయం.పోషక విలువలుగల ఆహారాన్ని సరిపోయినంత తీసుకోవటం అవసరం.
    మనం తీసుకునే ఆహారం ద్వారానే పలురకాల రుగ్మతలు వస్తుంటే,ఇక దుర్వ్యసనాలకు అలవాటు  పడ్డ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పూర్వ కాలం మనుషులందరూ శారీరక శ్రమ చేసి జీవనం సాగించేవారు కాబట్టి వారికి ఏ వ్యాయామం అవసరం ఉండేది కాదు.కానీ ప్రస్తుతం పట్టుమని పావుగంట శారీరక శ్రమ లేకుండా జీవిస్తున్నాం.అందుకని ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించటం,యోగా,ప్రాణాయామం,ధ్యానం చెయ్యటం మానవునికి అవసరమైనది.ఉప్పుకారం తగ్గించుకోవటం,మంచినీరు ఎక్కువగా తీసుకోవటం, ప్రశాంతంగా నిద్రించటం ఎంతో అవసరం.కూల్ డ్రింక్స్ కు  బదులు పళ్ళ రసాలు,కొబ్బరినీరు,మజ్జిగ తీసుకోవటం ఉత్తమం.
       ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎవరికి  వారు తమకి తగిన విధానాన్ని ఎన్నుకొని అవలంబిస్తూ  ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని  ఆశిద్దాం.

Friday 29 March 2013

అమ్మా-నాన్న,ఓపెన్ హౌస్ అను సేవా సంస్థలు


            మనం ఎన్నో రకాలయిన ప్రేమలను చూస్తూఉంటాం.తల్లి ప్రేమ,తండ్రి ప్రేమ ,సహోదర ప్రేమ ,సమ వయసు ప్రేమ .మరి  ఏ  బంధము  లేకుండా సేవ చేసే ప్రేమను ఏమంటాము ....పిచ్చి ప్రేమ అంటామేమో .మతిస్థిమితం లేని వారిపై ఇటువంటి ప్రేమనే చూపుతున్నారు "అమ్మా నాన్న"ఆశ్రమం  నిర్వాహకులు శంకర్ ఆయన భార్యపరమేశ్వరి హైదరాబాద్ విజయవాడ రహదారిలోని చౌటుప్పల్ ప్రాంతం లోని ఈ ఆశ్రమంలో పాతిక మంది మతిస్థిమితం కోల్పో యిన వ్యక్తులు కనిపిస్తారు.వారిని కంటికి రెప్పలా చూస్తూ,వారిని మామూలు మనుషులుగా తీర్చి దిద్ది వారి వారి కుటుంబాలకు దగ్గర చేస్తున్నారు.తన అన్న పిచ్చివాడిలా మారి పోయి చాలా కాలం కనిపించక కొన్నేళ్ళకు హైదరా బాద్ ఉస్మానియా ప్రాంతం లో చెత్త కుప్పల్లో చనిపోయి కనిపించాడట.నా అన్నలాగ మరొకరు ప్రాణాలు వదలకూడ దని ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసాము అంటాడు శంకర్.
     పని మీద  హైదరాబాద్   వచ్చి నిలువ నీడ లేక జేబులో డబ్బు లేక  ఉన్నారనుకొండి .అలాంటి వాళ్ళ కోసం డా .వింజమూరి ప్రకాష్ స్థాపించిన "ఓపెన్ హౌస్" సిద్ధంగా ఉంటుంది.సరూర్ నగర్ రిలయన్స్ పెట్రోల్ బంకు ప్రక్కనే ఉన్నఈ హౌస్ లోకి ఎవరైనా రావచ్చు.కాకపోతే అక్కడ వున్న వంట పదార్థాలతో మీరే  వండుకొని తృప్తిగా తిని ఒకటి,రెండు రోజులు బస చేసి వెళ్ళవచ్చు.పేద విద్యార్థులు,నిరుద్యోగులు దీనిని ఉపయోగించు కుంటున్నారు .వంట చేసుకోలేని వారికోసం వాలంటీర్స్ ఉన్నారు.దీనికి సాయం చేయాలనుకునే వారు 040-24046000 కు ఫోన్ చేయవచ్చు.
   పై రెండు సేవా  సంస్థల వివరాలు సాక్షి,ఆంధ్రజ్యోతి నుండి సేకరించినవి.వారికి ధన్యవాదాలు.వారు చేసే ఈ గొప్ప ప్రయత్నాలను అందరికీ తెలియజేయాలనే ఆలోచన.  

Thursday 21 March 2013

తెలుగు సౌరభం


       తెలుగు  సౌరభం  పేరుతో 7 వ రాష్ట్ర స్థాయి రచయితల మహాసభలు 2013 ఫిబ్రవరి 8,9,10 తేదీలలో ఒంగోలు లోని T.T.D కళ్యాణ మండపం నందు ఘనం గా జరిగాయి.3 వ రోజు జరిగిన సమావేశానికి నేను హాజరయ్యాను.ఉదయం జరిగిన సాహిత్య శిక్షణా శిబిరం లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  గ్రహీత కే.శివారెడ్డి ఆధ్వర్యం లో జరిగింది.మొదట ప్రముఖ కవి దర్భ శయనం శ్రీనివాసా చార్య  హాజరయిన కవులకు కవిత్వం పై పలు సూచనలు చేసారు.
       మంచి కవిత్వం వ్రాయటానికి జీవితానుభవం,విస్తృత అధ్యయనం దోహదం చేస్తాయి.మన చింతన లోనుండి పుట్టిన ఆవేశం నుంచి కవిత్వం ఉద్భ విస్తుంది.భావం, భాషల పై మనకున్న మోహం మనల్ని నడిపిస్తాయి.కాని భాష పట్ల నిర్మోహం కూడా అలవర్చుకోవాలి.మన తాత్విక సాధన కవిత్వం లో శబ్దమై కూర్చుంటుంది.
    కవిత్వానికి మూలకాలు భావన,భాష .ఇవి నిరంతరం చదవడం ద్వారా అలవడతాయి.కవిత పాఠకుడు మననం చేసుకుని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించాలి.బాలగంగాధర తిలక్ అంటాడు.కవిత చదివితే ఆనందం లాంటి విచారం కలగాలంటాడు కవిత ఆరంభం ఒక పెద్ద అవస్థ అంటాడు శ్రీ శ్రీ .కవిత అవిచ్చిన్నంగా ఉండాలి.కవిత లో సంక్లిష్టత ,కష్టమైన  మాటలు తగ్గిం చాలి.ఒక పాదానికి ఇంకో పాదానికి మధ్య అన్వయం కుదరాలి.విషాద కవిత నుండి పాఠకుడు DISTURB కావాలి గందర గోళానికి గురికాకూడదు.మృదువైన కవితలో శబ్దానికి,శబ్దానికి మధ్యలో సామరస్యం ఉండాలి.భాషా సంపద విస్తృతం గా ఉంటె వాటిని మన భావనలకు ఎన్నుకోవచ్చు.ఏ కవితయినాపాఠకుడిని తన జీవితం లోకి పునర్దర్శనం చేయగలిగితే అది గొప్ప కవిత.కవిత్వం లో బాధ్యతా రాహిత్యానికి తావు లేదు.కవిత్వానికి శబ్దం కాదు.భావన ప్రధానం.ఒక ఇంగ్లీష్ కవిత పేరు అమెరికా .అందులో ఈ విధంగా ఉంది .WHERE THE LIBERTY IS STATUE.మంచి కవికి క్లుప్తత కావాలి.గరుకైన పదాలు కావాలి.పత్రికల్లో పడటం గీటురాయి కాదు.కవికి నమ్రత కావాలి.కవి గొప్ప భావుకుడు కావాలి.మంచి కవిత్వం చదివిన వెంటనే మనసులో  నిశ్శబ్దం ఆవరించాలి.
       కథలపై డా:వి.చంద్ర శేఖర రావు కవులకు సూచనలు చేసారు.కథా రచనలో సమాజం లోని సంఘటనలు transform కావాలి.కథ, కవిత meditative process లో  పుడతాయి.రాయలేనితనం,తపన ,నుండి  కథ కవిత ఉదయిస్తాయి మన లో గొప్ప కాంక్ష,నిలవనీయని అగ్ని పుట్టాలి.వాతావరణం,పాత్రలు ,పాత్రల  స్వ భావం గురించి  అవగాహన   చేసుకొని కథ మొదలెట్టాలి.కథకు శైలి శిల్పం అవసరం.సమాజం, మనుషుల్లోని ప్రేమ,కథల్లో ప్రస్తావించాలి.కథ వ్రాయాలనే దహించే అగ్ని ఉండాలి.
విమర్శ  పై పాపినేని  శివశంకర్
         వి మర్శకుడికి నిజాయితీ అవసరం.ప్రశంస  కూడా విమర్శ లో ఒక భాగమే విమర్శ అంటే గుణాగుణ  పరామర్శ. విమర్శ గొప్ప అన్వేషణ.కవి జీవితాన్ని ఉన్నతీకరిస్తాడు.కవిత్వాన్ని సాహిత్యాన్ని విమర్శకుడు ఉన్నతీకరిస్తాడు.శివారెడ్డి గారు కవిని ప్రేమించి ప్రోత్సాహించాలి అంటాడు.దాన్ని ప్రేమపూర్వక అభినందన అంటారు.దర్భశయనం కవితలను విశ్లేషణ చేస్తాడు.నేను నిష్కర్షగా విమర్శి స్తుంటాను.విమర్శకుడు కుల మత ప్రాంత రహిత విమర్శ చేయాలి.విమర్శ ఆలోచనా ప్రధాన మైనది.మానవ జీవితానికి,మానవ సంస్కారానికి విరుద్ధమైనది అనవసరం.
        ఘజ ల్స్  గురించి పెన్నా శివరామ కృష్ణ  వివరించారు.దేవీ ప్రియ నిర్వాహకులకు కొన్ని సూచనలు చేసారు.
      సాయంత్రం సభకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి.హనుమారెడ్డి అధ్యక్షత వహింఛి బూచేపల్లి సుబ్బారెడ్డి దంపతుల అన్నదాన దాతృత్వాన్ని ప్రశంసించారు.తరువాత గరికపాటి నరసింహారావు గారిని సభకు పరిచయం చేసారు ఆయన వాగ్ధాటి సభికులను మంత్ర ముగ్ధులను చేసింది.ఆయన మాటలలోనే "తెలుగు భాషకు తల్లి వేర్లు  తెగిపోతు న్నాయి.మనం చివుల్లకు నీళ్ళు పోస్తున్నాము.పాటశాల స్థాయి లోనే పిల్లలకు వేమన పద్యాలు నేర్పించాలని అందులో వున్న  వ్యక్తిత్వ వికాసాన్ని అందించాలని  ఉపాధ్యాయు లను కోరారు.విరాట పర్వాన్ని మానవత్వం కోసం చదవాలి.భారత జాతిలో వున్నా మూఢ నమ్మకాలు పోవాలి.స్వామీజీల వెంట పడే జనాలు శాస్త్రవేత్తల  వెంట నడవాలని  కోరారు. పురాణాలలోని పద్యాలలో వున్నా వ్యక్తిత్వ వికాసాన్ని వివరించారు.మనిషి యొక్క గుప్పెడు గుండెలో ఆనందముందా?  ఎదగాలంటే ఏకాంతం కావాలి.ఉపాధ్యాయుడు జీవితాంతం చదవాలి.కవులు ఎక్కడ మంచి కవిత్వ మున్నా ప్రశంసించాలి వాస్తవాన్ని ఊహ తో సమర్ధించాలి.ఊహను వాస్తవం తో  సమర్ధించాలి.అతనే మహాకవి.అవినీతి తగ్గాలంటే ముగ్గురి వలన  సాధ్యమవుతుంది.వారు తల్లి తండ్రి,ఉపాధ్యాయుడు.ముందు మానవ సంభందాల్లోని అవినీతిని పారద్రోలాలని చెప్పారు.
     సభలు దిగ్విజయంగా  జరగటానికి పొన్నూరి  శ్రీనివాసులు గారు ప్రముఖ కవి బాలకృష్ణారెడ్డి గారు కృషి  చేశారు 

Sunday 17 February 2013

"నిరంతర సత్యాన్వేషి " జిడ్డు కృష్ణమూర్తి


               ఈ రోజు జిడ్డు కృష్ణమూర్తి  వర్దంతి.1895 మే 11 న  జనించిన ఆయన  1986 february 17 న పరమ పదిం చారు.1910 నుంచి 1985 వరకూ ప్రపంచ మంతా పర్యటనలు చేసి ప్రసంగాలు చేసారు.జీవితాన్ని అద్భుతంగా పరిశీ లించి దాన్ని సమగ్రంగా ఏకముఖంగా చూడ మని చెప్పాడు.మనుషులందరు ఎవరికీ వారు హృదయాల నిండా ప్రేమను,అనురాగాన్ని నింపుకొని స్వస్వరూప జ్ఞానాన్ని అవగతం చేసుకోవడం అవసరం అని చెప్పారు .సత్యానికి ఓ నిర్దిష్ట మార్గం లేదని ప్రకటించారు.మనిషిని కట్టి పడవేసిన అలవాట్లు,ఆచారాలు,సంప్రదాయాల పరిమిత ప్రయోజ నాలు  గ్రహించి ఆ బంధాల నుంచి ఎవరికీ వారే విముక్తి చెందాలని పిలుపిచ్చారు.
               సత్యాన్ని  వ్యవస్తీ  కరించటం మంచిది కాదని ,సత్యం అనేది pathlessland అని ప్రకటించారు.
   నా ఏకైక లక్ష్యం "మనిషిని  సంపూర్ణంగా ,నిర్నిబంధంగా విముక్తుడిని చేయాలి."
         "to set man absolutely unconditinally free"
 ఆనంద  సామ్రాజ్యానికి  తాతాళపు చెవి   ఎవరి  అధీనం  లోనో  లేదు .ఆ  తాళపు  చెవి  మీరే .మిమ్మల్ని  మీరు  వికాస   పరచుకోవడం ,నిష్కల్మషంగా తయారవడం మీదనే  ఆ భూమిక నిలిచి ఉంది.
   కృష్ణ మూర్తి తన బోధనల సారాంశం(core of teaching) అంటూ అక్టోబర్ 21 1980 న ఒక ప్రకటన చేసారు.దీనిని 7 విభాగాలుగా పరిశీలించాలి.
1)సత్యం అనేది ఒక దుర్గమ క్షేత్రం .దానిని చేరటానికి రహదారులు లేవు.దానికి ఒక సంస్థ ద్వారా ,వ్యవస్థ  ద్వారా సిద్దాంతం ద్వారా చేరలేము.తన సంబంధ బాంధవ్యాల దర్పణం ద్వారా మనస్సు అంతర పరివర్తనల అవగాహన ద్వారా మనస్సును సమగ్రంగా పరిశీలించటం ద్వారా చేరు కోవచ్చు.
2)మనిషి తన మనస్సులో ఎన్నో రూపాలు,అభిప్రాయాలు ,విశ్వాసాలు తయారు చేసుకున్నాడు.వాటి బరువు అతని మానసిక వాతావరణాన్ని క్రుంగ  దీస్తుంది.తన సంబంధాలను భారం చేస్తుంది.ఇదే మన సమస్యలన్నింటికీ మూల  కారణం.
3)మనిషి చిత్తం లో ఉన్నదంతా కలిసి మనిషిని రూపొందిస్తుంది.పేరు,రూపం ,సంప్రదాయం వాతావరణం .పర్యావ రణాల వలన  బాహ్యంగా ఏర్పడిన సంస్కారం ఇదంతా కలిసి మనిషి వ్యక్తిత్వం గా భావించ బడుతుంది.చేతనం లో ఉన్న దాన్నుండి విముక్తుడిగా ఉండడం లోనే ప్రత్యేకత ఉంది.
4)ఎటువంటి  దృక్కోణం  లేకుండా జీవిత పరిశీలన  చేసుకోవడమే స్వేచ్చ.పరిశీలన  చేసుకున్న కొద్దీ తనకు ఎంత స్వేచ్చ లేదో తెలిసివస్తుంది.మన దైనందిన కార్య కలాపాలలో అరమరికలు లేని ఎరుకతో నిండిన స్వేచ్చ అతి ప్రధాన మైనది .
5) కాలం  నుంచి గతం నుంచి పుట్టిందే  అనుభవమూ,జ్ఞానము .మన పనులన్నీ అనుభవం నుంచి,సమయం నుంచీ పుడుతున్నాయి.మనిషి ఎప్పుదూ గతానికి బానిసగా  తయారవుతున్నాడు మనసును ఆలోచనలను మన పనుల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి.ఎప్పటికప్పుడు విముక్తుడిగా పని చేయ గలగడం సహజ ప్రవృత్తి గా  తయారయి పోవాలి.
6)మనిషి  తన ఆలోచనలను భావనలను పరిశీలనాత్మకంగా చూసుకున్నందువల్ల భావకునికి(thinker)
భావన(thought) కు మధ్య వున్నా అంతరం తొలగిపోతుంది.అప్పుడు పరిశీలనా మటుకే మిగులుతుంది.అదే అంతః స్పూర్తి దాని మీద గతం యొక్క సమయం యొక్క నీడలు ప్రభావాలు  పడవు.
7)పరిపూర్ణంగా కాదనడమే(total negation) ఉన్న దాని సారాంశం మనసు తీసుకు వచ్చిన అన్ని రూపాలను ప్రతి రూపాలను తోసి రాజనడం వలన  మానసిక వాతావరణాన్ని సుధ్ధం చేయడం అవుతుంది.అప్పుడే ప్రేమ అంకురిస్తుంది.అదే కారుణ్యం(compassion) అదే  వివేకం (intelligence)
పై అంశాలను సంపూర్ణం గా ఆచరణ లోకి తెస్తే చివరి మెట్టు సాధ్య మవుతుంది.
   చివరి మెట్టు "ప్రేమ"
మనస్సును పూర్తిగా ప్రేమతో నింపుకో.ఆ తరువాత ఏదయినా చేయి. అంటారు కృష్ణ  మూర్తి.మనసు హృదయము ప్రేమతో నిండిన తర్వాత మనిషి చెడు చేయ లేడు .  మంచి చేయడం తప్ప ఇంకేమీ చేయలేడు.

  శ్రీ  విరించి రచించిన "నిరంతర సత్యాన్వేషి " అన్న రచన నుండి పై వ్యాసం సేకరించటం జరిగింది.వారికి కృతజ్ఞతలు . .

Thursday 7 February 2013

అందరూ కుశలమా!


చాలా కాలమయింది బ్లాగు మిత్రులను కలిసి అందరు క్షేమమేనా!మరిన్ని కొత్త విషయాలతో త్వరలో మీ ముందుకు !
మీ రవిశేఖర్

Friday 16 November 2012

ప్రాధమిక విద్యకు బాలల హక్కుల చట్టం - 2009(రెండవ భాగం)


గత వ్యాసం తరువాయి భాగం )
       ఈ తీర్పు ద్వారా 1996 ఆగస్టులో ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా రూపొందించడం లోని సాధ్యాసాధ్యా లను పరిశీలించడానికి సైకియా కమిటీని నియమించింది.ఆదేశిక సూత్రాలలో ఉన్నంతవరకు ఇది కేవలం Nonjusticiable fundamental right గా  ఉంది .దీన్ని  ప్రాధమిక  హక్కుల్లో  చేర్చి  Justiciable fundamental right గా మార్చాలన్న అవసరాన్ని గుర్తించారు.1997 సం :లో అధికారం లో ఉన్న United Front ప్రభుత్వం  రాజ్యాంగానికి  83 వ సవరణను ప్రతిపాదిస్తూ రాజ్య సభలో బిల్లు పెట్టింది. ఈ బిల్లులోని లోపాలతో వచ్చిన ప్రజా ప్రతిఘటనతో బిల్లు అటకెక్కింది.1997 సం : లో సైకియా   నివేదిక ను అధ్యయనం చేసి సూచనలు ఇవ్వటానికి తపస్ మజుందార్ ఆధ్వర్యం లో విద్యా వేత్తల బృందాన్ని నియమించింది.1999 జనవరిలో  ఆ  కమిటీ  నివేదిక  సమర్పించింది ..budjet లో విద్యకు అదనంగా 1,37,000 కోట్లు అదనంగా కేటాయిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించింది.2001 లో NDA ప్రభుత్వం రాజ్యాంగానికి 86 వ సవరణ ప్రతిపాదిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టింది.దీనిలో కూడా లోపాలు ఉన్నాయి.అయినప్పటికీ 86 వ సవరణ రాజ్యంగ సవరణ జరిగింది.
         UPA ప్రభుత్వం కపిల్ సిబాల్ నేతృత్వం లో కమిటీ(2005)ని నియమించింది.ఈ కమిటీ తయారు చేసిన బిల్లును CABE BILL 2005 అంటారు.అప్పటినుండి ఎన్నో మీటింగ్స్ జరిగి చర్చలు అయిన తర్వాత ప్రస్తుత స్థితిలోని ఈ బిల్ 2009 వచ్చింది.20/7/09 న రాజ్య  సభలో ,4/8/09 న  లోక్ సభలో  ఆ  బిల్లు  ఆమోదం  పొందటం  జరిగింది..26/8/09 న  రాష్ట్ర  పతి  సంతకం  పెట్టారు .27/8/09 న gazette notification లో ప్రచురించారు.2010 april 1 నుండి  అమలు చేస్తామని  రాష్ట్రపతి  ప్రకటించారు .
ఈ ప్రాధమిక విద్యా  హక్కు   చట్టం-2009 లోని ముఖ్యాంశాలు.
1)ప్రాధమిక విద్యలో నమోదు చేయించు కొని   లేదా పూర్తీ   చెయ్యని బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు
2)వేరే బడికి బదిలీ హక్కు
3)బడిని స్థాపించడం  సంబంధిత స్థానిక ప్రభుత్వ భాద్యత ,ఆర్ధిక ఇతర బాధ్యతలను పంచుకోవడం
4)తల్లిదండ్రుల సంరక్షకుల బాధ్యతలు
5)పూర్వ పాటశాల విద్యనూ సంబందిత ప్రభుత్వం చూసుకోవాలి.
6)బడి ప్రవేశానికి ఎంపిక విధానం ,capitation రుసుం ఉండకూడదు.
7)అదే తరగతిలో కొనసాగించడం,పేరు తీసివెయ్యటం నిషేధం.
8)రికగ్నిషన్ లేకుండా బడిని ప్రారంభించ కూడదు.
9)బడులకు,నియమాలు,ప్రామాణికాలు
10)బడి యాజమాన్య సంఘం,బడి అభివృద్ధి ప్రణాళిక
11)టీచర్ గా నియామకానికి అర్హతలు,ఉద్యోగ షరతులు,నిబంధనలు,టీచర్ల విధులు,సమస్యల పరిష్కారం
12)విద్యార్ధి టీచర్ల నిష్పత్తి,టీచర్ల ఖాళీలను భర్తీ చెయ్యటం,విద్యే తర పనులకు టీచర్లను పంపటం పై నిషేధం,టీచర్ల private tutions పై నిషేధం
13) పాట్య ప్రణాళిక,మూ ల్యాంకన విధానం
14)విద్యకు బాలల హక్కుల పర్యవేక్షణ,ఫిర్యాదుల పరిష్కారం
15)రాష్ట్ర జాతీయ సలహా సంఘాల ఏర్పాటు
16)ఆదేశాలు జారీ చేసే అధికారం,ప్రాశిక్యూశన్ కు ముందస్తు అనుమతి
పై అంశాలతో పాటు ఉపాధ్యాయులు గ్రహించ వలసిన అంశాలను ఈ క్రింద గుర్తించటం జరిగింది.
1)ఉచిత విద్య
2)నిర్బంధ విద్య అందించటం రాజ్యాంగం యొక్క బాధ్యత
3)రాజ్యంగా విలువలతో కూడిన పాట్య ప్రణాళిక
4)ఉపాధాయుల గునాత్మకత
5)) పాట శాలకు  గుణాత్మక నియమాలు
6)సామాజిక సంస్కరణల తోడ్పాటు
7)పిల్లల సంరక్షణ బాధ్యత
8)అమలులో నియమ నిబంధనలు కుదించడం
9)పౌరుల పాత్ర చట్టబద్దం చేయడం
10)పరీక్షల ఒత్త్జిడులు తొలగించటం
ఈ చట్టం అమలు పరిచే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థలు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాటశాలలు,ఉపాధ్యాయులు కొన్ని బాధ్యతలను నిర్వర్తించటం జరుగుతుంది.ఈ చట్టం పర్యవేక్షణ బాలల హక్కుల రక్షణకు ఒక నిర్దిష్ట యంత్రాంగం ఉంటుంది.గవర్నమెంట్,పంచాయతీరాజ ,మున్సిపల్,ఎయిడెడ్ ప్రైవేటు పాటశాలలు విధిగా పాటించాలి.
విద్యా హక్కు బిల్లు లోని సందేహాలు,వివాదాలు
1)6  ఏళ్ళలోపు,14 సం: పైబడిన వారి పరిస్థితి ఏమిటి
2)ప్రైవేటు పాటశాలలు బలహీన వర్గాల వారికి 25% సీట్లు కేటాయింపు వారి ఖర్చు ప్రభుత్వం భరించుట
3)పర్యవేక్షణ యంత్రాంగం పటిష్టత
4)ఫీజుల పై నియంత్రణ
5)neighbourhood స్కూల్స్
పై విషయాలపై స్పష్టత లేదు.ఏది ఏమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రక మైన బిల్లు వచ్చి వుంటే దేశం ఎంతో ముందడుగు వేసేది.ఇప్పటికయినా ఈ బిల్లు రావటం  దేశం లోని కోట్లాది చిన్నారులకు ఆశా జ్యోతిగా పరిగణించ వచ్చు.

Sunday 11 November 2012

ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం 2009


          {జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా వ్రాసిన ఈ వ్యాసం ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం        తయారు చేసిన కమిటి లో సభ్యులయిన ప్రొఫెసర్ శాంతా సిన్హా (chairman National child rights commission) ప్రోఫెసర్ నళినీ జునేజా,R.వెంకట రెడ్డి(సెక్రెటరీ M.V Foundation) ల Seminars కు హాజరయి రూపొందించినది.వారికి ధన్యవాదాలు.}
   పరిచయం:విద్యా ప్రాధమిక హక్కుపై చర్చ భారత దేశానికి కొత్త గాదు.ఈ అంశాలు గత 130 సంవత్స రాలుగా చర్చించ బడుతున్నాయి.1882 సం:లో మహాత్మా జ్యోతీరావు పూలే indian education commission(hunter commission) కు సమర్పించిన నివేదికలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యా వ్యాప్తికి సమకూర్చే నిధులు అగ్ర వర్ణ విద్యా వ్యాప్తికి మాత్రమే సహకరిస్తూ దళితులకు ,బలహీన వర్గాలకు ఈ విద్య అందకుండా ఎలా దూరం చేస్తున్నయో వివరించారు.1911 సం:లో బొంబాయి assembly లో గోపాల కృష్ణ గోఖలే ప్రాధమిక విద్యా హక్కు బిల్లును లేవనెత్తి నప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్త మయింది.1937 సం :లో  వార్డా జాతీయ  విద్యా  సదస్సులో  గాంధీ ప్రాధమిక విద్యకు అధిక నిధులు కేటాయించాలని కోరినా ఆనాటి మంత్రులంతా నిధులు లేవన్న వాదనతో తోసి పుచ్చడం జరిగింది.
        april 1947 లో వల్లభాయి పటేల్,కృష్న స్వామి కమిటీ విద్య ప్రాధమిక హక్కుగా మార్చటం గురించి చర్చించింది.గోబింద్ వల్లభ పంత్ దీనిని వ్యతిరేకించి Non justiciable fundamental right list లోనికి పంపించమన్నారు.అనగా ఆదేశిక సూత్రాలలో (Directive principles of state policy)చేర్చమన్నారు.
K.TShah దీనిని వ్యతిరేకించారు.ఆదేశిక సూత్రాలలో పెడితే ఒరిగేది ఏమీ లేదు.L.C jain తన రిపోర్ట్ లో బడ్జెట్ లో విద్య గురించి ఆర్దిక మంత్రులు మాట్లాడలేదు అన్నాడు.14 సం:వరకు నిర్బంధ ఉచిత విద్య అందించడానికి ఉద్దేశించిన ముసాయిదాబిల్ article 45  ను 11 సం:కు కుదించాలని 1948-49 లో రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్న ఒక సభ్యుడు అంబేద్కర్ తో వాదించాడు.అంబేద్కర్ వ్యతిరేకిం చక పోతే సవరణ జరిగేది.అలా జరిగి ఉంటె 11 సం:ల వయస్సు పిల్లలు పనులలో చేరి ఉండే వారు.అందులోని  మెజారిటీ  సభ్యులు  article 45 ను రాజ్యాంగపు మూడవ భాగంలో చేర్చకుండా అంబేద్కర్ ను నిరోధించారు.ఫలితంగా ఆధునిక భారత దేశం లో విద్య ప్రాధమిక హక్కు కాలేక పోయింది.1986 సం :కొత్త విద్యా విధానం రూపొందుతున్న సమయానికి 5-14 సం :ల వయస్సు కలిగిన మొత్తం పిల్లలలో సగం మంది ఆడపిల్లలయితే మూడింట రెండు వంతుల మంది బడి బయటే ఉన్నారు.s.c,s.t,మైనారిటీలు వికలాంగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.80-85% s.c బాలికలు ,90%s.t బాలికలు  10 వ  తరగతి  వరకు  చేరటం  లేదు .రిజర్వేషన్ ఫలాలు వారికందటం లేదు.ప్రైవేటీకరణ పెరగడం వలన సమాన నాణ్యత కలిగిన విద్య నందించే విషయం లో సమాజం లోని ఉన్నత వర్గాలకు,పేదలకు మధ్య అంతరాలు మరింత పెరుగుతున్నాయి.
    J.P.unnikrishanan versus A.P Govt మరియు  ఇతరులు (S.C2178,1993) కేసులో సుప్రీం కోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఈ పెడ పోకడలను తీవ్రంగా నిరసించింది.రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులుగా భావ ప్రకటనా స్వేచ్చ జీవించే  హక్కు  (article 21) దేశంలో ఎక్కడయినా నివసించే హక్కు వంటివి కల్పించింది.వీటికి భంగం కలిగితే మనం కోర్టు ను ఆశ్రయించ వచ్చు.ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హక్కులు మనకు కల్పించాలి.అదే విధంగా రాజ్యాంగం లో మనకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ప్రభుత్వా లు వీటిని ఖచ్చితంగా పాటించాల్సిన పని లేదు.వీటిలో పిల్లల గురించి 24,39,45  అధికరణాల్లో వివరిం చారు.
అధికరణం  24:  14 సం : లోబడిన పిల్లలను వారికి ప్రయోజనకరమైయిన వృత్తులలో పరిశ్రమలు,గనులు వంటిచోట నివసిం చకూడదు.
అధికరణం 39: ప్రభుత్వాలు  పిల్లల  పసితనాన్ని  పరిరక్షిస్తూ ,వారు  పరువుగా  స్వేచ్చగా  ఆరోగ్యకర మయిన  వాతావరణంలో  ఎదిగేలా  అవకాసం  కల్పించాలి .
అధికరణం 45: రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి  10 సం :లోపు  పిల్లలందరికీ  14 సం : నిండే వరకు  ఉచితంగా  నిర్భందంగా  విద్య  నందించే  ప్రయత్నం  చేయాలని  ప్రభుత్వానికి  నిర్దేశించ  బడింది .
       45 వ ఆర్టికల్ దృష్ట్యా 21 వ ఆర్టికల్ ను(జీవించే హక్కు)ను పరిశీలిస్తే పిల్లలందరికీ విద్యా ప్రాధమిక హక్కును రాజ్యాంగం కల్పించినట్లు తెలుస్తుంది."అని సుప్రీం కోర్టు తన నిర్ణ యాత్మకమైన తీర్పులో స్పష్టం చేసింది.ఆదేశిక సూత్రాలు(నాలుగవ  భాగం)ప్రభుత్వం సాధించ వలసిన లక్ష్యాల యితే ప్రాధమిక హక్కులు (మూడవ భాగం)అందుకు అనుసరించవలసిన మార్గాలుగా సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. 45 article లో సవరణ జరిగినా ఆరు సం: లోపు పిల్లలకు పూర్వ ప్రాధమిక విద్య 45 article ను అనుసరించి 14  సం:దాటిన  వారు కూడా ప్రభుత్వ ఆర్ధిక సామర్ధ్యాలననుసరించి  విద్యా ప్రాధమిక హక్కును కలిగి ఉంటారని సుప్రీం కోర్టు పేర్కొంది.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

Wednesday 17 October 2012

బంగారు కథలు (గత యాభై ఏళ్లలో వచ్చిన అద్భుత కథలు)


            మన దేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంలో గత ఏభై ఏళ్లలోతెలుగులో వచ్చిన వేల కథల్లో అత్యుత్తమ మయిన అరవై కథలను కేంద్ర సాహిత్య అకాడమీ "బంగారు కథలు" పేరుతో అచ్చు వేసింది దీనికి సంకలన కర్తలు వాకాటి పాండు రంగారావు గారు,వేదగిరి రాంబాబు గారు.ఈ పుస్తకం అన్ని శాఖా గ్రందాలయాలలో దొరుకుతుంది దాదాపు ఆరువందల పేజీల ఈ పుస్తకాన్ని చదవటానికి నాకు ఓ నెల సమయం పట్టింది.ఒక్కో కథ ఆనాటి సామాజి క జీవనాన్ని,అప్పటి వాస్తవ పరిస్థితులను అద్భుతంగా వర్ణించింది.ఇందులోవ్యక్తీ,సమాజం,సంప్రదాయం,విప్లవం అంతరంగ మధనం, బాహ్యజగతి, ప్రేమ,అశాంతి,అయోమయం,సమన్వయము దాకా వీటి పరిధి విశాలంగా విస్తరిం చింది.సమకాలీన సమస్యలకు సంఘటనలకు ఆయా రచయితలు,రచయిత్రులు అద్భుతంగా స్పందించి తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు.తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు కథా బంగారం మెరుస్తూనే ఉంటుం ది.మురిపిస్తునే ఉంటుంది.
       ఈ కథలు చదివి నేను అనిర్వచనీయమైన అనుభూతిని పొందాను.మీరూ చదవటానికి ప్రయత్నించండి.నా వంతు వారికి కృతజ్ఞతగా వారి పేర్లు,కథలు ఈ దిగువ ఇస్తున్నాను.
1)చాగంటి సోమయాజులు (ఎంపు)
2)కొడవటిగంటి కుటుంబరావు (చెడిపోయిన మనిషి)
3)పాలగుమ్మి పద్మ రాజు(పడవ ప్రయాణం)
4)విశ్వనాధ సత్య నారాయణ(కపర్ది )
5)చలం ( ఓ పువ్వు పూసింది)
6)బుచ్చి బాబు (కాగితం ముక్కలు,గాజు పెంకులు)
7)మునిపల్లె రాజు (బిచ్చగాళ్ళ జెండా)
8)మల్లాది రామ క్రిష్ణ శాస్త్రి (మంత్ర పుష్పం)
9)గోపీచంద్ (సంపెంగ పువ్వు)
10)రావిశాస్త్రి(మోక్షం)
11)దేవరకొండ బాల గంగాధరతిలక్(ఊరిచివర ఇల్లు )
12)ముల్లపూడి వెంకట రమణ (కానుక)
13)హితశ్రీ (గులాబి పువ్వు-సిగరెట్టూ)
14)స్మైల్ (ఖాళీ సీసాలు)
15)పెద్దిభొట్ల సుబ్బరామయ్య(నీళ్ళు)
16)ఆదివిష్ణు(కుర్చీలు)
17)బీనాదేవి(డబ్బు)
18)కాళీ పట్నం రామారావు(హింస)
19)కొలకలూరి ఇనాక్(ఊరబావి)
20)నాయని కృష్ణ కుమారి (ఎండు చేపలు)
21)పోతుకూచి సాంబశివరావు(మామ్మ నడిపిన విప్లవం)
22)వి.రాజా రామమోహనరావు(వరద)
23)వాసిరెడ్డి సీతాదేవి(తమసోమా జ్యోతిర్గమయ )
24)డి.కామేశ్వరి (కన్నీటికి విలువెంత)
25)ఇచ్చాపురపు జగన్నాధ రావు (మనిషి-మమత )
26)ఆర్.ఎస్ .సుదర్శనం (ఎరుపు)
27)దేవరాజు మహారాజు .బి.విద్యాసాగర రావు(పాలు ఎర్రబడాయి)
28)వేదగిరి రాంబాబు(సముద్రం)
29) చాగంటి తులసి(యాష్ ట్రే )
30)సదానంద్ శారద (జాడీ)
31)ఆర్.వసుందరాదేవి(గడియారం)
32)కేతు విశ్వనాధరెడ్డి(నమ్ముకున్ననేల )
33)వాకాటి పాండు రంగారావు(ప్లసీబో)
34)రావులపాటి సీతారామారావు(మనసా తుల్లిపడకే)
35)విహారి(గోరంత దీపం)
36)బి.ఎస్.రాములు(అడవిలో వెన్నెల)
37)ఓల్గా (ఆర్తి)
38)పాపినేని శివశంకర్(మట్టి గుండె )
39)స్వామీ(సావుకూడు)
40)శ్రీ పతి (చెట్లు కూలుతున్న దృశ్యం)
41)అల్లం రాజయ్య (మనిషి లోపలి విధ్వంసం )
42)సింగమనేని నారాయణ(అడుసు)
43)తుమ్మేటి రఘోత్తమ రెడ్డి(చావు విందు)
44)ఆర్ .ఎం.ఉమా మహేశ్వర రావు (బిడ్డలు గల తల్లి )
45)భూపాల్(అంబల్ల బండ)
46)పులికంటి కృష్ణారెడ్డి (బంగారు సంకెళ్ళు )
47)అబ్బూరి చాయాదేవి(ఆఖరికి అయిదు నక్షత్రాలు )
48)కలువ కొలను సదానంద(నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు)
49)తురగా జానకి రాణి(యాత్ర)
50)బలివాడ కాంతారావు(చక్రతీర్ధ)
51)తోలేటి జగన్మోహనరావు (మార్పు)
52)మధురాంతకం రాజారావు(రాతిలో తేమ)
53)శ్రీ రమణ(బంగారు మురుగు)
54)మధురాంతకం నరేంద్ర(నాలుగు కాళ్ళ మండపం)
55)ఆవుల మంజులత(నిన్ను ప్రేమించలేదు)
56)కాలువ మల్లయ్య(ఆంబోతు)
57)యర్రం శెట్టి శాయి(సర్కస్
58)పి.సత్యవతి(పెళ్లి ప్రయాణం)
59)బోయ జంగయ్య(చీమలు)
60)అయితా చంద్రయ్య(మంచు ముద్ద  )

Sunday 14 October 2012

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ప్రయత్నం ఎలా ఉంటుంది?


              ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ,జబ్బుల బారిన పడకుండా ఉండటం ఎలా? అన్నవి అత్యంత ప్రధానమైనవని భావించవచ్చు.మనుష్యులకు ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుంది? జబ్బులు ఎందుకు వస్తాయి?వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు,అంటు వ్యాధులు,విభిన్న రకాల కాలుష్యాల వలన వచ్చేవి,పొగాకు,మద్యం  తీసుకోవటం వలన వచ్చే జబ్బులు ఇంకా ఎన్నో రకాలు గా మనిషిని జబ్బులు పట్టి పీడిస్తు న్నాయి.వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు తప్ప మిగతా వాటినన్ని టిని ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ చాలా వరకు సాధ్య మవుతుందని డాక్టర్స్ అంటుంటారు. అలాగే జబ్బులు వచ్చిన తర్వాత విభిన్న వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి.
                ఆరోగ్య పరిరక్షణకు,జబ్బుల నివారణ కొరకు మనకు అందుబాటులో ఉన్న వాటిలో1) ప్రకృతి వైద్యం, యోగ(BNYS) 2)ఆయుర్వేద(BAMS) 3)హోమియోపతి(BHMS),4)అల్లోపతి(MBBS,MD,MS) 5) యునాని ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇంకా ఎన్నో విధానాలు అవలంబిస్తుంటారు.కానీ ప్రతి ఒక్క దానికి దేని పరిధులు దానికున్నాయి.కొన్ని జబ్బులు కొన్ని విధానాల్లో బాగా నయ మవుతాయి.కొన్ని విధానాల్లో side effects వస్తాయి ఒక రంగంలో పనిచేసే వారు మరొక రంగం లో పనిచేసే వైద్యులతో ఏకీభవించరు.ఎవరి విధాన్నాన్ని వారు బలంగా నమ్ముతారు.
         అలా కాకుండా మనిషి సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావటానికి జబ్బులు రాకుండా రక్షింప బడటానికి ,వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకోవటానికి ,ఏ విధానంలో ఏ జబ్బులు బాగా తగ్గుతాయి,.ఏ విదాన్నాన్ని అవలంబిస్తే జబ్బు లు రాకుండా చూసుకోవచ్చు అన్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని వైద్య విధానాలలోని పరిమితు లను వివరిస్తూ ప్రామాణిక మైన పుస్తకాలు వ్రాస్తే ఎలా ఉంటుంది.పై విధానాలు ప్రాక్టీసుచేసే వైద్యులుకొంత మంది కలిసి మానవుడి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఎటువంటి స్వార్ధం లేకుండా ఏ వైద్య విధానం పట్ల పక్షపాత  వైఖరి లేకుండా ఆరోగ్యము అనే సత్యాన్ని దర్శించే విధంగా ఒక ప్రయత్నం చేస్తే ఎలా వుంటుంది?ఈ దిశలో ఈ వ్యాసాన్ని చదివిన వారందరూ ఇంకా ఇంతకంటే మంచి సలహాలు,సూచనలు ఏవైనా ఉంటె తెలియ జేయగలరు అన్ని వైద్య విధానాలు ఒకే గొడుగు క్రిందకు తీసుకు వచ్చి,వచ్చిన రోగికి దేనిలో పరిపూర్ణంగా నివారణ సాధ్య మవుతుందో దాని లో వైద్యం ఇచ్చే విధంగా ఒక హాస్పిటల్ ఉంటె ఎలా ఉంటుంది ?ఆలోచించండి.

Sunday 7 October 2012

Art Of Listening(కళాత్మకంగా వినడం)

          మనం చిన్నప్పుడు అమ్మ,అమ్మమ్మ,తాతయ్య కథలు చెబుతున్నప్పుడు ఎంతో శ్రద్ధగా విన్నాం.ఉపాధ్యా యులు పాఠాలు చెబుతున్నప్పుడు ఇంతే శ్రద్ధగా విన్నామా!అదేవిధంగా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా వింటాం.అమ్మా,నాన్నలు,పెద్దలు మన మేలు కోరి చెబుతున్నప్పుడు ఎలా వింటున్నాము.అలాగే మన సంసారం లో భార్య మాట,మన పిల్లలు చెబుతున్నప్పుడు ,అలాగే ఆఫీసుల్లోసహచరులతో,ఈ వినడం అనే ప్రక్రియ మనలో ఎలా నడుస్తుంది.ఇంతకీ ప్రస్తుతం మనం ఏదైయినా విషయాన్ని ఎలా వింటున్నాం.అలాగే మనం చెబుతున్నప్పుడు ఎదుటి వారు ఎలా ఆలకిస్తున్నారు.ఈ విషయం గురించి ఎప్పుడయినా ఆలోచించారా!
            సహజంగా మనకు ఏ విషయం అయినా వింటున్నప్పుడు  ఏమి జరుగుతుంది.మన మనసు మనకున్న పూర్వ జ్ఞానంతో విన్న ఆ విషయాన్ని విశ్లేషించి వెంటనే మనదయిన  అభిప్రాయాన్ని చెప్పమంటుంది.మనకు తెలి సిన అంశాల ఆధారం గా మనదైన ప్రతిస్పందనను తక్షణం తెలియ జేయాలనిపిస్తుంది.అంటే ఇక్కడ వినడం అనే ప్రక్రియ జరగక మనం చెప్పడం అనే ప్రక్రియలోకి వెళ్ళిపోయాము.ఎప్పుడూ చెప్పటానికి అలవాటు పడ్డ మనసు పూర్తిగా వినడాన్ని నిరాకరిస్తుంది.ప్రకృతి పరంగా కూడా మనకు రెండు చెవులు,ఒక నోరు ఉండటానికి కారణం ఎక్కువ విని తక్కువ మాట్లాడటానికి అంటారు.మనమందరం మనం చెప్పేది అవతలి వారు వినాలని కోరుకునే వారమే!మరి అదే సూత్రం మనకి మనం అన్వయించుకోము. కుటుంబంలో,స్నేహితుల మధ్య నయినా ఆఫీసుల్లో నయినా సమాజంలో ఎక్కడయినా ఇదే జరుగుతుంటుంది.మనం ఎదుటివారి నుండి ఏమి ఆశిస్తామో వారు మననుండి అదే ఆశిస్తారు.
              మరి దీన్ని మనం ఎలా ఆచరణ లోకి తెచ్చుకోవాలి.ఎవరితో మాట్లాడుతున్నాఅవతలి వారి మాటలను ఎంతో శ్రద్ధతో,దయతో,వాత్సల్యం తో వినడం చేస్తే వారు మీకు చెప్పేది తప్పయినా ఒప్పయినా ఆ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది.వింటున్నప్పుడు ఎటువంటి ఖండనలు,విమర్శలు,ఆలోచనలు లేకుండా కేవలం వినడం మాత్రమే జరిగితే అప్పుడు ఎదుటివారికి తాము చెప్పినది విన్నాడు అనే త్రుప్తి కలుగుతుంది. ఆ త్రుప్తితో మీరు చెప్పేది వారు అదేవిధంగా వినడం మొదలు పెడతారు.ఎప్పుడయితే మీరు శ్రద్ధగా విన్నారో వారికి మీ అభిప్రాయం కూడా అంతే సున్నితంగా వ్యక్తం చేస్తారు.ఆ సున్నితత్వంలోని సహ్రుదయతను అవతలి హృదయం గ్రహించి మీ సంభాషణను అంతే స్థాయి అవగాహనతో వింటుంది.
               అప్పుడు రెండు మనసుల మధ్య,రెండు హృదయాల మధ్య ఒక అద్భుతమయిన భావ ప్రసారం జరుగు తుంది.అందులో స్నేహం,ప్రేమ,దయ,అవగాహన,వాత్సల్యం వంటి మాటల కందనిదేదో ఇద్దరి మధ్యా ప్రవహిస్తుంది.                                               

Tuesday 2 October 2012

మహాత్మా గాంధి -సత్యం,అహింస



              ఐక్యరాజ్య సమితి మహాత్మాగాంధీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్వాతంత్ర్యం పొందటానికి ఎంతో రక్తపాతాన్ని చవిచూసాయి.మన దేశంలో మాత్రమే మహాత్మా గాంధి నాయకత్వంలో అహింసాయుతంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించగలిగాము.సత్యం,అహింసలు ఆయుధాలుగా గాంధిజీ సాగించిన ఈ పోరాటం ప్రపంచానికి ఆదర్శం.
             గాంధిజీ తన ఆత్మ కథ చివరిలో సత్యం,అహింస  గురించి ఈ విధంగా వివరిస్తారు.ఆయన మాటల్లోనే
             "సత్యాన్ని నేను ఏవిధంగా చూచానో,ఏ రూపంలో చూచానో ఆ రూపంలో  దాని వివరించడానికి సదా ప్రయ త్నించాను.ఈ ప్రయోగాల వలన  పాఠకుల మనసులో సత్యము,అహింస పై అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం.సత్యం కంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు .సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం.నా అహింస సత్యమయమైనా అది ఇంకా అపూర్ణమే,అపరిపక్వమే.వేలాది సూర్యుల్నిప్రోగు చేసినా,సత్యమనే సూర్యున్ని చూడలేము.అంత తీక్షణ మైనది సత్యం.అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శిం చవచ్చు.అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యం కాదు.ఇప్పటి వరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల ఆధారంగా  చేసుకొని ఈ మాట చెబుతున్నాను.ఇట్టి వ్యాప్తి చెందినా సత్యనారాయణుని సాక్షాత్కారం కోసం ప్రతిజీవి ని ప్రతి ప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం."
   మహాత్మా గాంధీ ప్రవచించిన ఈ సత్యము,అహింస ల గురించి ఆలోచించే ఓపిక,తీరిక ప్రస్తుతం మనకున్నాయా !అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.ప్రపంచమంతా రాజ్యాల మధ్య,జాతుల మధ్య సమూహాల మధ్య వ్యక్తు ల మధ్య హింస రాజ్యమేలుతుంది.దేశాల మధ్య ఆధిపత్య పోరాటాలు యుద్ధాలుగా పరిణమిస్తు మానవ జాతిని అంతులేని హింసకు గురి చేసాయి.మొదటి రెండవ  ప్రపంచ యుద్దాల వలన  కొన్ని కోట్ల మంది మరణించినా కూడా ఇంకా దేశాలు యుద్దాలు చేస్తూ ఉన్నాయి.అలాగే వ్యక్తులు  చేసే హింస కూడా తక్కువేమీ కాదు.హింస ద్వారా రాజ్యాలు అయినా వ్యక్తులయినా చివరకు సాధించేది ఏమీ ఉండదు.
       అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నఈ సందర్భంలో మానవ జాతి తనకు తాను చేసుకునే హింస నుండి కూడా బయట పడాలి.మనుషుల ప్రాణాలను అలవోకగా తీసే ఈ సమాజం లో ఇక వన్య ప్రాణులను ప్రకృతిని మానవుడు నాశనం చేయటంలో ఆశ్చర్యం లేదు.విజ్ఞానం పెరుగుతుందని మనిషి అనుకుంటూ అజ్ఞానంతో ప్రవర్తి స్తున్నాడు.తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు.సాటి మనిషిని ప్రేమించలేని వాడు ప్రకృతిని ఏమి ప్రేమించగలడు ఒకరికి అపకారం చెయ్యకుండా బ్రతకటమే మనిషికి గల ప్రాధమిక కర్త వ్యం.అప్పుడు ప్రకృతిని,ప్రాణులను ప్రేమిం చటం నేర్చుకుంటాడు.ఇందుకు సత్యం,అహింసల పథంలో మనిషి ప్రయాణం చేయాలి.

Sunday 23 September 2012

ర్యాగింగ్ అనే విష సంస్కృతి


              రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎట్టకేలకు admissions పూర్తి చేసుకుని తరగతులు ప్రారం భిస్తున్నాయి విద్యార్థులు EAMCET వ్రాసిన 4 నెలలనుండి ర్యాంకుల కొరకు,ప్రవేశాలలోఏర్పడిన ప్రతి ష్టంబనలోని స్పష్టత కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి తాము కోరుకున్న కళాశాలల్లో చేరటంతో విద్యా సం:ప్రారంభమయ్యింది.inter లోఅనుభవించిన ఒత్తిడి తగ్గిపోయి స్వేచ్చా వాతావరణంలోకి సీతాకోక చిలుకల్లా అడుగు పెట్టారు.తల్లిదండ్రులు తమ ఆశలను,ఆకాంక్షలను వారిలో నింపి వారిని కళాశాలలకు పంపారు.ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు విద్యార్థులు యాజమాన్యాలు గుర్తించాల్సిన అంశం గురించి చర్చిద్దాం.
      కళాశాలల్లో అడుగిడగానే అంతకు ముందే చదువుతున్న విద్యార్థులు(వీరిని seniors అంటారు) కొత్త గా చేరిన వారిని (వీరిని juniors అంటారు)పరిచయం చేసుకుంటారు.ఈ పరిచయం స్నేహం పెంపొందటానికి,విద్యార్జనలో సహ కరించుకోవటానికి,కొత్త వారిలో బెరుకు పోగొట్టి స్నేహితులుగా మార్చుకోవడంలో సీనియర్ విద్యార్థులు చొరవచూపి జూనియర్ విద్యార్థులకు మార్గ  దర్శకత్వం వహించటం వరకు అర్థం చేసుకోదగినదే!
        ఇలా ప్రారంభమయిన ఈ కార్యక్రమం ఎన్నివికృత పోకడలు పోయిందో!ఎన్ని జీవితాలు బలి అయ్యాయో మనం ఏటా చూస్తున్నాం.జూనియర్స్ ను సీనియర్స్ ఆట పట్టిస్తూ సాగే ఈ తంతును ర్యాగింగ్ అని పిలుస్తుంటారు.ఇంటర్ నుండే ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్లో చేరిన విద్యార్థుల్లో బిడియస్తులు మొహమా టస్తులు,సిగ్గుపడే తత్వం,బెరుకు మనస్తత్వం,ఇతరులతో కలవలేనివారు,సున్నిత మయిన మనస్కులు ఇలా ఎంతో మంది ఉంటారు.వాస్తవానికి కాల క్రమేణ వీరంతా పరిస్థితులకు తగ్గట్లు మారి అందరిలో కలిసి పోతారు.కానీ వెళ్ళగానే  ర్యాగింగ్ పేరుతో వీరి చేత చేయరాని  పనులు చేయిస్తూ సీనియర్స్ పొందే పైశాచిక ఆనందానికి ఎన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసాయో!ఎంత మంది చదువులు మానేసారో!
        ఈ విష సంస్కృతికి కారణ మేమిటి?ఎందుకు తోటి మనుషుల పట్ల ఇటువంటి అనాగరిక  ప్రవర్తను కనబరుస్తా రు? తమ అన్నలు,అక్కలు,చెల్లెళ్ళు,తమ్ముళ్ళు కూడా ఇతర కాలేజీల్లో ఇదేవిధంగా ఇబ్బంది పడి ఉంటారు కదా !స్వయంగా తామే ఆ ఇబ్బందులకు గురయి బాధలు పడి కూడా ఇలా ఇంకొకరిని ఎలా  బాధించ గలగుతున్నారని  కొంత మంది విద్యార్థులను అడిగితే వారిచ్చిన సమాధానం వింటే తల తిరిగినంత పనయ్యింది.తాము ఇంతకు ముం దు పొందిన బాధకు ప్రతీకారంగా ఇంకొకరిని ఆ విధంగా బాధిస్తే వారికి ఆనందం కలుగుతుందట.దీనిని ఒక రకం గా sadism అంటారు.ఈ మనస్తత్వం పిల్లలకు కాలేజీలకు వెళ్లాకే ఏర్పడుతుందా!
         దీనికి బాల్యం నుండి వారి కేదురైన అనుభవాలు,వారు శిక్షింపబడిన జ్ఞాపకాలు వారిలో ఆ విధ మైన కసి ప్రతీ కారం కలగటానికి ఆస్కారం కలిగించి ఉంటాయి.మరియు పాటశాలలు,కళాశాలలు వారికి ఎటువంటి నైతిక విద్యను అందించకపోవటం ఒక కారణం.అయినా తల్లిదండ్రులు తమ పిల్లకు కాలేజీలకు వెళ్ళేటప్పు డు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు.అయినా ఇలా జరుగుతూనే ఉంది.ప్రస్తుత మైతే ర్యాగింగ్ కు వ్యతిరే కంగా కటినమైన చట్టాలు ఉన్నాయి ఇలాంటి ప్రవర్తన కలిగిన విద్యార్థులను మరల ఎక్కడా చదవకుండా నిషేదించవచ్చు.అలా యాజ మాన్యాలు ధృవీక రణ పత్రాలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ ఇంకా చాలా కాలేజీల్లో ఈ సంస్కృతి ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
       యాజమాన్యాలు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేయాలి.మొదటి సం:విద్యార్థులు చేరగానే వారే college లోని అందరు విద్యార్థులను సమావేశ పరిచి counsilling psychologist లసహాయంతో శిక్షణ ఇప్పించాలి.చట్టంలోని కఠిన నిబంధనలు తెలియజేయాలి.అప్పుడు ఇటువంటి ఆలోచనలు మనసులో నుండి వైదొలుగుతాయి.అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల్లో స్నేహభావన ,పరస్పరం సహకరించుకునే తత్వం,నాయకత్వ లక్షణాల్లాంటి అంశాలను వారి కి ఆ శిక్షణలో నేర్పిస్తే ఈ సంస్కృతి తగ్గిపోతుంది విద్యా ర్థులు కూడా అలా ప్రవర్తించే ముందు తమ తల్లిదండ్రు లను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటే అటువంటి విష సంస్కృతి నుండి బయట పడగలుగుతారు.చక్కటి స్నేహ పూర్వ క వాతావరణంలో ,మంచి  విద్యనూ నేర్చుకొని ఉపాధి సంపాదించుకొని తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా ఇంజి నీరింగ్ విద్యను పూర్తి  చేసుకోగలరు.

Thursday 20 September 2012

Life Is Beautiful(అందమైన జీవితం )


       జీవితం ఎంతో అందమైనది,సరళమైనది.మరి దీనిని ఎందుకింత సంక్లిష్టం చేసుకుంటున్నాము.మానవ జన్మతో ఏర్పడిన బంధాలు,సమాజంలోని వ్యక్తులతో ఏర్పడే అనుబంధాలు,వారిపట్ల మన ప్రవర్తన,వారి ప్రతిస్పందన ఇవే కదా జీవితం!ఈ మొత్తం వ్యవహారం ఎంతో అందంగాను,అద్భుతం గాను,ఉండాలి.అటువంటి దీన్ని ఎందుకింత నీర సంగా ,అందవిహీనంగా ,యాంత్రికం గా మార్చుకుంటున్నాము.జీవితం ఉల్లాసంగా,ఉత్సాహంగా,ఆహ్లాదంగా మార కుండా ఏవి అడ్డుపడుతున్నాయి..
       తల్లిదండ్రులు,వారి పిల్లలు వీరి మధ్య సంబంధాల్లోని ఆప్యాయతలు,ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి?అలాగే బంధువులు,స్నేహితులు,సన్నిహితులతో ఎలా సంబంధాలను నెరపుతున్నాము?ఇవన్నీ గమనిస్తే చాల సున్నితం గా ,సరళంగా,అందంగా,ఆనందంగా గడపాల్సిన జీవితం ఎలా ఉంది?       
       శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా Life is Beautiful లో వీటికి కొంత సమాదానమిచ్చే ప్రయత్నం చేసారు .సిని మా ప్రారంభం లోనే చూ పించిన  రంగుల ద్వారా జీవితమెంత అందంగా ఉండాలో చూపించాడు.Happy Days చాయ లు కాస్త ఎక్కువగానే కన్పించినప్పటికీ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అందులో లీనమయ్యేలా నడిపించాడు. అమ్మను ఇంగ్లీష్ లోవర్ణించటానికి మాటలు రావని తెలుగులో ఆ అమ్మాయితో చెప్పించటం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది.అన్నా చెల్లెళ్ళ సంబంధాలను ,కుటుంబ ఆప్యాయతలను,స్నేహితుల సహాయాలను,వాటి మధ్య మొగ్గ తొడిగే ఇష్టాలను,అవి ప్రేమలుగా మారే క్రమం లాంటి  సున్నిత మయిన మానవ సంబంధాలను తన దైన శైలిలో స్పృశిస్తూ ఓ అందమైన జీవితాన్ని మనకు పరిచయం చేసారు.అమ్మ మీద నువ్వు కావాలె అమ్మా! అంటూ సాగే పాట  ఇంకా మిగతావి కూడా మధురంగా ఉన్నాయి.ప్రస్తుత సినిమాలకు విభిన్నంగా,కుటుంబ మంతా కలిసి చూసే విధంగా ఆహ్లాదంగా తీసాడు.ఇటువంటి సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం కూడా కావాలి.కానీ ఏదైనా కొత్త అంశాన్ని ఎన్నుకొని తీసి ఉంటె ఇంకా బాగుండేది.ఇటువంటి ఆరోగ్య కరమయిన సినిమాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది.
           మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన "అందమైన జీవితం" నవల చాల అద్భుతంగా ఉంటుంది.ఇందులో
ప్రణయ్ జీవితంలో డబ్బు ఖర్చు లేకుండా ఆనందంగా ఎలా జీవించాలో చూపిస్తాడు.చదవక పోతే ఓ సారి చదవండి.
        జీవిత మంటే చిన్నచిన్నఆనందాలు,ఆప్యాయతలు,కలబోసిన రంగుల హరివిల్లు.ఉన్న దానితో త్రుప్తి చెందు తూ,రాబడి కంటే ఖర్చు ఎక్కువ పెట్టకుండా  ఉంటె చాలు.కోరికల సాంద్రత తగ్గించుకొని మానవ సంబంధాలను మెరుగు పరుచుకుంటూ ఉంటె ఆ జీవితం అందంగా మారుతుంది.కాలం వెంట పరుగులు తీస్తూ,లక్ష్యాల ఒత్తిడితో చిత్త వుతూ వర్తమానాన్ని త్యాగం చేస్తూ ఎప్పుడో ఆనందిస్తామంటే అప్పటికి అందరినీ కోల్పోతారు.విలువైన కాలం నష్ట పోతారు.గమ్యం ఎంత ముఖ్యమో! గమనం అంతే ముఖ్యం.ఆనందం కోసం బ్రతకడం కాదు,ఆనందంతో బ్రత కాలి.ముఖ్యంగా ఇతరులతో పోలికను తగ్గించుకోవాలి.
          కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం,స్పష్టత,సర్దుబాట్లు,చిన్నచిన్న త్యాగాలు,క్లిష్ట సమయాల్లో పరస్పరం సహకరించుకోవటం,ఉద్వేగాల నియంత్రణ,సమన్వయము నెలకొల్పుకోవటం వంటి వాటి కలబోతే కదా జీవితం .సాధించలేక పోయిన,చేరుకోలేక పోయిన లక్ష్యాల గురించి అసలు చింతించకూడదు.వర్తమానంలో మన సామర్ద్యాల మేరకు,అవకాశాల మేరకు కృషి చేస్తూ పోవటమే!చక్కటి ఆహార నియమాలు,పాటిస్తూ శారీరక మానసిక వ్యాయా మాలైన ఆటలు,exercises ,ప్రాణాయామం,ఆసనాలు,ధ్యానం చేస్తూ చేస్తున్న పనిని అంకిత భావంతో,నిజాయితీ తో నిర్వహిస్తూ భార్యా పిల్లలతో ప్రతిరోజుముచ్చటించటం, సంగీతం వినటం పుస్తకాలు చదవడం,ప్రక్రుతి ఆరాధన లాంటి మంచి అలవాట్లతో జీవితాన్ని అందంగా మలచుకోవటం దాన్ని ఆనందించటం మన చేతుల్లోనే ఉంది.