Thursday, 20 September 2012

Life Is Beautiful(అందమైన జీవితం )


       జీవితం ఎంతో అందమైనది,సరళమైనది.మరి దీనిని ఎందుకింత సంక్లిష్టం చేసుకుంటున్నాము.మానవ జన్మతో ఏర్పడిన బంధాలు,సమాజంలోని వ్యక్తులతో ఏర్పడే అనుబంధాలు,వారిపట్ల మన ప్రవర్తన,వారి ప్రతిస్పందన ఇవే కదా జీవితం!ఈ మొత్తం వ్యవహారం ఎంతో అందంగాను,అద్భుతం గాను,ఉండాలి.అటువంటి దీన్ని ఎందుకింత నీర సంగా ,అందవిహీనంగా ,యాంత్రికం గా మార్చుకుంటున్నాము.జీవితం ఉల్లాసంగా,ఉత్సాహంగా,ఆహ్లాదంగా మార కుండా ఏవి అడ్డుపడుతున్నాయి..
       తల్లిదండ్రులు,వారి పిల్లలు వీరి మధ్య సంబంధాల్లోని ఆప్యాయతలు,ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి?అలాగే బంధువులు,స్నేహితులు,సన్నిహితులతో ఎలా సంబంధాలను నెరపుతున్నాము?ఇవన్నీ గమనిస్తే చాల సున్నితం గా ,సరళంగా,అందంగా,ఆనందంగా గడపాల్సిన జీవితం ఎలా ఉంది?       
       శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా Life is Beautiful లో వీటికి కొంత సమాదానమిచ్చే ప్రయత్నం చేసారు .సిని మా ప్రారంభం లోనే చూ పించిన  రంగుల ద్వారా జీవితమెంత అందంగా ఉండాలో చూపించాడు.Happy Days చాయ లు కాస్త ఎక్కువగానే కన్పించినప్పటికీ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అందులో లీనమయ్యేలా నడిపించాడు. అమ్మను ఇంగ్లీష్ లోవర్ణించటానికి మాటలు రావని తెలుగులో ఆ అమ్మాయితో చెప్పించటం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది.అన్నా చెల్లెళ్ళ సంబంధాలను ,కుటుంబ ఆప్యాయతలను,స్నేహితుల సహాయాలను,వాటి మధ్య మొగ్గ తొడిగే ఇష్టాలను,అవి ప్రేమలుగా మారే క్రమం లాంటి  సున్నిత మయిన మానవ సంబంధాలను తన దైన శైలిలో స్పృశిస్తూ ఓ అందమైన జీవితాన్ని మనకు పరిచయం చేసారు.అమ్మ మీద నువ్వు కావాలె అమ్మా! అంటూ సాగే పాట  ఇంకా మిగతావి కూడా మధురంగా ఉన్నాయి.ప్రస్తుత సినిమాలకు విభిన్నంగా,కుటుంబ మంతా కలిసి చూసే విధంగా ఆహ్లాదంగా తీసాడు.ఇటువంటి సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం కూడా కావాలి.కానీ ఏదైనా కొత్త అంశాన్ని ఎన్నుకొని తీసి ఉంటె ఇంకా బాగుండేది.ఇటువంటి ఆరోగ్య కరమయిన సినిమాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది.
           మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన "అందమైన జీవితం" నవల చాల అద్భుతంగా ఉంటుంది.ఇందులో
ప్రణయ్ జీవితంలో డబ్బు ఖర్చు లేకుండా ఆనందంగా ఎలా జీవించాలో చూపిస్తాడు.చదవక పోతే ఓ సారి చదవండి.
        జీవిత మంటే చిన్నచిన్నఆనందాలు,ఆప్యాయతలు,కలబోసిన రంగుల హరివిల్లు.ఉన్న దానితో త్రుప్తి చెందు తూ,రాబడి కంటే ఖర్చు ఎక్కువ పెట్టకుండా  ఉంటె చాలు.కోరికల సాంద్రత తగ్గించుకొని మానవ సంబంధాలను మెరుగు పరుచుకుంటూ ఉంటె ఆ జీవితం అందంగా మారుతుంది.కాలం వెంట పరుగులు తీస్తూ,లక్ష్యాల ఒత్తిడితో చిత్త వుతూ వర్తమానాన్ని త్యాగం చేస్తూ ఎప్పుడో ఆనందిస్తామంటే అప్పటికి అందరినీ కోల్పోతారు.విలువైన కాలం నష్ట పోతారు.గమ్యం ఎంత ముఖ్యమో! గమనం అంతే ముఖ్యం.ఆనందం కోసం బ్రతకడం కాదు,ఆనందంతో బ్రత కాలి.ముఖ్యంగా ఇతరులతో పోలికను తగ్గించుకోవాలి.
          కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం,స్పష్టత,సర్దుబాట్లు,చిన్నచిన్న త్యాగాలు,క్లిష్ట సమయాల్లో పరస్పరం సహకరించుకోవటం,ఉద్వేగాల నియంత్రణ,సమన్వయము నెలకొల్పుకోవటం వంటి వాటి కలబోతే కదా జీవితం .సాధించలేక పోయిన,చేరుకోలేక పోయిన లక్ష్యాల గురించి అసలు చింతించకూడదు.వర్తమానంలో మన సామర్ద్యాల మేరకు,అవకాశాల మేరకు కృషి చేస్తూ పోవటమే!చక్కటి ఆహార నియమాలు,పాటిస్తూ శారీరక మానసిక వ్యాయా మాలైన ఆటలు,exercises ,ప్రాణాయామం,ఆసనాలు,ధ్యానం చేస్తూ చేస్తున్న పనిని అంకిత భావంతో,నిజాయితీ తో నిర్వహిస్తూ భార్యా పిల్లలతో ప్రతిరోజుముచ్చటించటం, సంగీతం వినటం పుస్తకాలు చదవడం,ప్రక్రుతి ఆరాధన లాంటి మంచి అలవాట్లతో జీవితాన్ని అందంగా మలచుకోవటం దాన్ని ఆనందించటం మన చేతుల్లోనే ఉంది.

15 comments:

 1. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలలో తొంభై శాతం సినిమాలను చూడడానికి భయపడుతున్నాం. కుటుంబమంతా కలసి చూసే సినిమా అన్నారుగా. ఆ మాట చాలు ఆ సినిమా చూడడానికి.
  జీవితం గురించి మంచి మాటలు చెప్పారు. అన్నీ మనకు తెలిసినా అప్పుడప్పుడూ ఇలా వింటూ వుంటేనే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. థాంక్యు రావిశేఖర్ గారు.

  ReplyDelete
  Replies
  1. మీ మాట లతో మరింత ఉత్సాహం తో వ్రాయగలను.మీ స్పందనకు ధన్యవాదాలండి !

   Delete
 2. manchi book ravi shekhar gaaroo!
  chadivaanu... baaguntundi...
  manchi vishayaalu chepparu...
  abhinandanalu...
  @sri

  ReplyDelete
  Replies
  1. మీరూ చదివారా!ఓ సారి సాక్షి లో యండమూరి గారు చెబుతారు తనకు చాలా ఇష్టమని రచయితలను కూడా ఆకర్షించిన నవల.మీకు ధన్యవాదాలు.

   Delete
 3. ravi gaaroo mallaadi navala chadivaanu baaguntundi. baaga chepparu,

  ReplyDelete
  Replies
  1. ప్రతి జంట,కాబోయే జంటలు ఆ నవల చదవాలండి.మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 4. అందమైన జీవితం ఎలా మలుచుకోవాలో బాగా చెప్పారండి .

  ReplyDelete
  Replies
  1. మీరు మెచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

   Delete
 5. సినిమా మీరు చెప్పిందాన్ని బట్టి చూడాల్సిన చిత్రమే.
  నేనూ ఆ మంచి నవలను చదివానండి, చాలాబాగుంటుంది.
  అంతకన్నా జీవితం గురించి మీరు చెప్పిన తీరు చాలానచ్చిందండి!

  ReplyDelete
  Replies
  1. మీరు నచ్చినందుకు ధన్యవాదాలు..ఆ పుస్తకం అందరూ చదవాలండి.

   Delete
 6. Anmaina jeevitam naa abhimaana navala. baavuntundi anna maata chaalaa chinna maata.

  ikapote mee review chaalaa baavundi. movie choosenduku try chestaanu.

  Thank you sir!!

  ReplyDelete
  Replies
  1. మీ మెప్పు పొందటం మరిన్ని వ్యాసాలూ వ్రాయటానికి స్పూర్తిదాయకం.మీకు ధన్యవాదాలండి.

   Delete
 7. Replies
  1. స్వాగతం సుభ గారు!మీ ప్రశంస కు ధన్యవాదాలండి.

   Delete
 8. మల్లాది వారి పుస్తకం చదవాలనుకుంటున్నా... ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఏదైనా ఉంటే చెప్పగలరా.. దయచేసి...

  ReplyDelete