మనం ఎన్నో పనుల్లో నిమగ్నమవుతుంటాం. ఉద్యోగం,వృత్తి, వ్యాపారం,సేవ, ఇంకా ఎన్నో.నిజంగా ఆయా పనులను సంపూర్ణమైన ఇష్టంతో, ప్రేమతో చేస్తున్నామా ఆలోచించండి.ఎంతో మందిని అభిమానిస్తుంటాం. సినిమాలు, రాజకీయం,ఆటలు వంటి విభాగాల్లో ప్రసిద్దులను అభిమానిస్తుంటాం, ఇష్టపడుతుంటాం.ఒక్కోసారి ఈ ఇష్టం ఎంత వరకు వెడుతుందంటే తమ తల్లిదండ్రులను ఇష్టపడే కంటే,తమనితాము ఇష్టపడే కంటే, తమనితాము ప్రేమించే కంటే ఎక్కువగా ఉంటుంది.ఎవరినైనా అభిమానించవచ్చు. కానీ అది తమ విలువైన కాలాన్ని ఎంత హరిస్తుందోతెలుసుకోరు,పైగా తమ లక్ష్య సాధనకు అడ్డంకి గా కూడా మారొచ్చు. తాము ఎదగాలి అనుకున్న రంగాల్లో కానీ లేదా విభిన్న రంగాల్లో ప్రసిద్దులైన వారి జీవిత చరిత్రలు చదివి లేదా వారి సందేశాలు విని ప్రేరణ పొందవచ్చు. ఆ అభిమానం, ప్రేమ, ఇష్టం తమపై, తాము చేసే పనులపై పెడితే ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఉదాహరణకి తమ పై తమకి ప్రేమ ఉన్నవారు ఆహార అలవాట్లలో, ఆరోగ్యవిషయాల్లో, వ్యాయామం చేయడం లో శ్రద్ద పెడతారు.... ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment