Tuesday 8 February 2022

యాగంటి సందర్శన

 27 ఏండ్ల నుండి నంద్యాల వస్తున్నా, మహానంది చాలా సార్లు చూసినా యాగంటి చూడటం కుదర్లేదు. ఇన్నాళ్ళకి కుదిరింది. నంద్యాల నుండి బనగానపల్లికి ₹35 టికెట్ ఉంటుంది. మధ్యలో పాణ్యం వస్తుంది. బనగానపల్లి నుండి ఆటో లో ₹30 ఛార్జ్.10కిమీ ఉంటుంది. మధ్యలో KC canal వస్తుంది.ప్రఖ్యాతి గాంచిన బేతంచెర్ల బండల గనులు కనపడతాయి. రెండు కొండల నడుమ కోనేరు, శివాలయం ఉన్నాయి.కోనేరు చాలా అద్భుతంగాఉంది.ప్రస్తుతం ప్రవేశం లేదు.కోనేరు చుట్టూ చక్కటి నిర్మాణం తో  గోడ ఉంది.ఆలయం ప్రక్కనే కొండమీద నుండి నిరంతరం వచ్చే నీరు ఈ కోనేటిలోకి వస్తాయి. మహానంది లో కూడా ఇలానే నీళ్లు వస్తుంటాయి. ఈ నీళ్లతోనే 500 ఎకరాల్లో అరటి సాగు చేస్తుంటారు రైతులు.వేసవి లో కూడా తగ్గకుండా వస్తూనే ఉంటాయట. ఇప్పటికీ అర్ధం కానీ రహస్యం ఇది.ఇక యాగంటి లో గుడి ప్రక్కనే ఉన్న కొండలో ఒక గుహ ఉంది. ఇక్కడే అగస్త్యమహాముని  తపస్సు చేశారట.గుహను చూస్తే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాము.సహజంగా ఏర్పడ్డట్లే ఉన్నాయి. మెట్లు ఎక్కి పైకి వెళ్లాలంటే పెద్దవారికి వీలు కాదు. గుహ పైన చీలిక ఉంది. దాని ద్వారా చక్కటి వెలుతురు వస్తుంది. ఈ గుహ ప్రక్కనే ఇంకో గుహలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మహానంది లాగా ఇక్కడ అంతగా అభివృద్ధి జరగ లేదు. చెట్లు ఎక్కువగా కనపడలేదు. కొండల మీద చెట్లే మీ లేవు. కొండల మీద, గుడి ముందు మొక్కలు నాటి పెంచితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.బనగానపల్లి లోనే బ్రహ్మం గారు పశువులను కాస్తూ రవ్వలకొండ లో సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలో కాలజ్ఞానం వ్రాసారట. తాడిపత్రి కి వెళ్ళేదారి లోనే ప్రసిద్ధిచెందిన బెలుం గుహలు ఉంటాయి. మరోసారి వాటిని చూడాలి.

No comments:

Post a Comment