https://www.fearlessmotivation.com/2019/06/29/go-hunt-your-dream-official-music-video-and-lyrics/. (Thanks to "fearless motivation" William Hollis and Chris's Ross) పై లింక్ లో వీడియో చూడండి.Powerful motivation. *కల ....అది అత్యంతశక్తివంతమైన పదం. *నీ కలలను వేటాడే క్రమంలో నీవు చాలాసార్లు పడిపోయి ఉండవచ్చు. *తిరిగి ప్రయత్నించడానికి నీకు శక్తి లేదని భావించవచ్చు. *తిరిగి లేవడానికి నీకు బలం లేకపోవచ్చు *ఇక వదిలివేయడం ఒక్కటే మార్గం అనిపించవచ్చు *జీవితం కొట్టే ఎదురుదెబ్బలకు నీవు పడిపోవచ్చు *అదే సరైన సమయం తిరిగి కొట్టటానికి. *చాలా మంది జీవితం కొట్టే దెబ్బలకు ఎదురుతిరిగి పోరాడలేరు. *నీవు అలాగే క్రిందనే ఉండిపోతావా లేదా తిరిగిలేచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నావా *నీ మీద ఎవరికీ నమ్మకం లేనప్పుడు తిరిగి పోరాడటానికి ధైర్యం కావాలి.నమ్మకం కావాలి.బలమైన మనస్తత్వం కావాలి. *మనందరిలో ఒక సింహం ఉంటుంది. *కొంతమంది ఆ సింహాన్ని ఎప్పుడూ లేపరు. *చాలా మంది ఆ సింహాన్ని బోనులో పెట్టి తాళం వేస్తారు. *నీ కలను సాధించటానికి ఆకలిగొని ఉన్నావా *ఆ కలను నెరవేర్చుకోవడానికి పోరాటం చేస్తావా *ఆ సింహాన్ని బయటకు రానీయండి.నీ కలను సాధించే ఆకలి గొనండి. *వెళ్ళు వేటాడునీ కలను సాధించడానికి *ఆ కల గురించి మాట్లాడటం నిన్ను ముందుకు తీసుకు వెళ్లదు. *పని చేయడం మాత్రమే నిన్ను ముందుకు తీసుకు వెడుతుంది. *నిన్ను సందేహించేవాళ్ళు వాస్తవికంగా వెళ్లమంటారు. *నిన్ను ద్వేషించేవాళ్ళు వైదొలగమంటారు. *కానీ ముందుకురికి ఆ కలను సాధించగలిగేది నువ్వే *అది నీ కల.దాన్ని ఎవరూ వెంటాడరు *ఎవరు నీ కోసం దాన్ని వేటాడరు *నీ కలకు ఎవ్వరూ మద్దతివ్వరు,నీవు తప్ప. *ఒక సామెత లో ఇలా ఉంది"ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది.కొంతమంది మాత్రమే వేటకు సిద్ధంగా ఉంటారు.ప్రతి ఒక్కరికీ విజయం సాధించాలని ఉంటుంది.కానీ కొంతమందే అందుకవసరమైన పనిలోకి దిగుతారు. *మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు. *మీ కలలను మీరు నిజాలుగా మార్చుకోగలరు. *కానీ అది సాధ్యపడుతుందని ఒక్కరు మాత్రం విశ్వసించాలి.ఒక్కరు మాత్రం పనిలోకి దిగాలి. ఆ వ్యక్తి నువ్వే *నీ కంటే ముందు చాలా మంది,వారు కలగన్న జీవితాలను జీవించారు.పెద్ద పెద్ద విజయాలు సాధించారు. *వారు సాధించారు.అదే సాక్ష్యం నువ్వు సాధించగలగడానికి. *నువ్వు నిజంగా కోరుకుంటే నీ కలను నిజం చేసుకోగలవు. *నీ కలలకు నువ్వే భయంకరమైన శత్రువువి. ఎందుకంటే నీ కలను ఎప్పుడు విడిచిపెట్టాలో,నువ్వే నిర్ణయిస్తావు కనుక,నువ్వే నిర్ణయిస్తావు నీ కలలను ఎప్పుడు చంపుకోవాలో *నీ గురించి నీకు తెలిసిన దానికంటే నీవు ఎక్కువ శక్తివంతుడివి/రాలివి. *నీ కలతో ప్రపంచాన్ని మార్చగలవు. *కానీ దానికి నువ్వు కావాలి. నీ అనువయిన స్థితి నుండి బయటకు రావడానికి,నీలో ఉన్న సింహాన్ని కట్టువిప్పటానికి,ఆ సింహాన్ని బోనులో నుండి నువ్వు మాత్రమే బయటకు విడువగలవు.నువ్వు మాత్రమే నీ కలలను వెంటాడగలవు. *బలహీనమైన మనస్తత్వం ఉన్నా,ఆపదలను ఎదుర్కోవడానికి భయపడినా జీవితంలో ఎప్పుడూ ముందుకుపోలేవు *బలహీనమైన మనస్తత్వంతో నువ్వెప్పుడు నీ కలను సాధించుకోలేవు *ఇతరులు వదిలివెడుతున్నా ముందుకే వెళ్లే మనస్తత్వాన్ని సృష్టించుకో *జీవితం ఎప్పుడూ ఉహించినవిధంగా ఉండదు.అది ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నువ్వు ఆలోచించే విధం కన్నా నీ కలకు నువ్వు దగ్గరగా ఉంటావు. *నువ్వు వదిలివెయ్యకుండా ఉంటే నీ కల వాస్తవం అవుతుంది. *సింహం లా ఉండండి.నువ్వెదుర్కొనే సవాళ్లనుండి ఎప్పుడూ వెనక్కి వెళ్లొద్దు. *సింహం ఎప్పుడూ దాని ఆహారాన్ని వేటాడటం ఆపదు,అది దొరికే వరకు. *నీ కలను నిజం చేసుకునేంత వరకు వేటాడటం ఆపవద్దు. *పెద్ద కలలు కను,నువ్వు కలలు సాధించలేవని చెప్పే అల్పమనస్కుల మాటలు నమ్మొద్దు. *అవి వాళ్ళు సాధించలేనివి,కానీ నీకు బాగా తెలుసు *నిన్ను నువ్వు నమ్ము. *నా లక్ష్యాల,కలల దారిలో నువ్వు కూడా ఉంటే కదులు, ముందుకు కదులు.(అనువాదం:ఒద్దుల రవిశేఖర్)
No comments:
Post a Comment