Sunday 26 December 2021

స్టూడెంట్ నంబర్ 1

స్టూడెంట్ నంబర్ 1                                                రచన:విశేష్,భరత్                                                   పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్           విద్యార్థుల తల్లిదండ్రులకు అంకితం ఇవ్వటంతోనే ఈ పుస్తక ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు రచయితలు. పైగా ముందు మాట కూడా లేకుండా వచ్చిన పుస్తకం ఈ మధ్య కాలంలో లేదు. మీరు రాసి పంపిస్తే ప్రచురిస్తాం అన్న మాటలతో పాఠకుల దృష్టి పుస్తకం మీదకు వెళ్లేలా చేస్తుంది.

ఈ పుస్తకం లో 12 అంశాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ తెలుగు పుస్తకంలో రాని విధంగా సంభాషణల రూపంలో పుస్తకంలోని అన్ని అంశాలను రూపొందించడం, పాఠకుడితో మాట్లాడినట్టు ఉంది ఈ పద్ధతి. తనను తాను identify చేసుకుని లీన మయ్యేలా చేస్తుంది.                                ఇందులోని అంశాలు..

1)  బాగా చదవడమంటే ఏమిటో ఏమిటో విద్యార్థులకు ఎవరూ సరిగా చెప్పకపోవడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ముందు, ముందు topic లలో వాటికి సమాధానాలుంటాయని ఉత్సుకతను లేపారు. 

                                                                      2)విద్యార్థుల్లో బలమైన నమ్మకాలను పెంపొందించాలని అప్పుడే విజయం సాధ్యమవుతుందని విద్యావ్యవస్థలో అదే లోపించిందని దాన్ని సరిదిద్దాలని ఇందులో తెలియజేస్తారు.                                        3)పాఠాలు ఎలా వినాలో, ప్రతి పాఠం శ్రద్ధగా వింటే అది మన జీవితాలకు ఎలా పెట్టుబడిగా మారుతుందో మన సంపాదనా స్థాయి ఎలా పెరుగుతుందో ఇందులో ఆసక్తిగా వివరిస్తారు.

4)తరగతి లో చెప్పే పాఠ్యాంశాల్ని ఎలా notes రాసుకోవాలో, mindmaps ఎలా తయారు చేసుకోవాలో ఇందులో వివరణాత్మకంగా చెబుతారు.                                   

5)బాగా చదవడం అంటే ఏమిటో 7 steps ద్వారా ఇందులో వివరిస్తారు.అన్నీ సాధన చేస్తే అలవాటయ్యేవే!                         

6)సంగీతం వింటూ ఆల్ఫాస్థితికి చేరి మరింత ఏకాగ్రతను పొంది బాగా చడవవచ్చని, చదివింది, విన్నది,అలాగే గుర్తుండి పోతుందనే వినూత్న విషయాన్ని ఇందులో పరిచయం చేస్తారు.

7)విద్యార్థులకు challenging గా ఉండే "గుర్తుంచుకోవడం" అనే అంశం చదివి తెలుసుకుని ఆచరిస్తే వారి జ్ఞాపక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. 

 8 ) మనం marks, grades, ranks సాధించిన వారినే తెలివైనవారని అనుకుంటాము. తెలివితేటల్లోని విభిన్నమైన రకాలను పరిచయం చేసి,  ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉంటుందని చెబుతారు.                         

9)మెలకువలు పాటిస్తే ఎవరయినా ఏకాగ్రతను సాధించవచ్చు అని ఇందులో వివరిస్తారు.     

10) విద్యార్థుల పై ఒత్తిడిని పెంచే పరీక్షలకు ప్రణాళికా బద్దంగా ఎలా తయారు కావాలో తెలియజేస్తారు                       

11)పరీక్షలంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని ఎలా అధి గమించాలో practical గా వివరిస్తారిందులో.

12) ఇక చివరి అంశం లో విద్యార్థులకు ఉండాల్సిన skills ను వివరిస్తూ జీనియస్ లా మారాలంటే ఏ రకమైన ఆలోచనా తీరు కలిగి ఉండాలి,దానికి ఎలాంటి, training తీసుకోవాలో Genius gym లో విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇస్తారో తెలుపుతూ ఈ పుస్తకాన్ని ముగిస్తారు.             

విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా చదవ వలసిన practical way of conversation ఇందులో వివరించబడింది. తరువాత Genius Gym లో శిక్షణ పొంది genius లుగా మారటానికి ఈ పుస్తకం పునాదిలాగా పనిచేస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది.

-ఒద్దుల రవిశేఖర్

👉 స్టూడెంట్ నెంబర్-1 పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 50, 101 నెంబర్ స్టాల్స్ లో దొరుకుతుంది.

👉పోస్ట్ ద్వారా పొందాలనుకునే వారు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం. 

https://imjo.in/sX2DmY

1 comment: