Thursday, 30 December 2021

వెళ్ళు, నీ కలను వేటాడు(Go,Hunt your dream)

 https://www.fearlessmotivation.com/2019/06/29/go-hunt-your-dream-official-music-video-and-lyrics/. (Thanks to "fearless motivation" William Hollis and Chris's Ross)  పై లింక్ లో వీడియో చూడండి.Powerful motivation.                        *కల ....అది అత్యంతశక్తివంతమైన పదం.              *నీ కలలను వేటాడే క్రమంలో నీవు చాలాసార్లు పడిపోయి ఉండవచ్చు.                                   *తిరిగి ప్రయత్నించడానికి నీకు శక్తి లేదని భావించవచ్చు.                                              *తిరిగి లేవడానికి నీకు బలం లేకపోవచ్చు            *ఇక వదిలివేయడం ఒక్కటే మార్గం అనిపించవచ్చు   *జీవితం కొట్టే ఎదురుదెబ్బలకు నీవు పడిపోవచ్చు   *అదే సరైన సమయం తిరిగి కొట్టటానికి.        *చాలా మంది జీవితం కొట్టే దెబ్బలకు ఎదురుతిరిగి పోరాడలేరు.                                                   *నీవు అలాగే క్రిందనే ఉండిపోతావా లేదా తిరిగిలేచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నావా                          *నీ మీద ఎవరికీ నమ్మకం లేనప్పుడు తిరిగి పోరాడటానికి ధైర్యం కావాలి.నమ్మకం కావాలి.బలమైన మనస్తత్వం కావాలి.   *మనందరిలో ఒక సింహం ఉంటుంది.    *కొంతమంది ఆ సింహాన్ని ఎప్పుడూ లేపరు.    *చాలా మంది ఆ సింహాన్ని బోనులో పెట్టి తాళం వేస్తారు.                                                              *నీ కలను సాధించటానికి ఆకలిగొని ఉన్నావా      *ఆ కలను నెరవేర్చుకోవడానికి పోరాటం చేస్తావా       *ఆ సింహాన్ని బయటకు రానీయండి.నీ కలను సాధించే ఆకలి గొనండి.                                   *వెళ్ళు వేటాడునీ కలను సాధించడానికి             *ఆ కల గురించి మాట్లాడటం నిన్ను ముందుకు తీసుకు వెళ్లదు.                                                *పని చేయడం మాత్రమే నిన్ను ముందుకు తీసుకు వెడుతుంది.                                                  *నిన్ను సందేహించేవాళ్ళు వాస్తవికంగా వెళ్లమంటారు.                                               *నిన్ను ద్వేషించేవాళ్ళు వైదొలగమంటారు.        *కానీ ముందుకురికి ఆ కలను సాధించగలిగేది నువ్వే                                                              *అది నీ కల.దాన్ని ఎవరూ వెంటాడరు            *ఎవరు నీ కోసం దాన్ని వేటాడరు                         *నీ కలకు ఎవ్వరూ మద్దతివ్వరు,నీవు తప్ప.       *ఒక సామెత లో ఇలా ఉంది"ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది.కొంతమంది మాత్రమే వేటకు సిద్ధంగా ఉంటారు.ప్రతి ఒక్కరికీ విజయం సాధించాలని ఉంటుంది.కానీ కొంతమందే అందుకవసరమైన పనిలోకి దిగుతారు.                                           *మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు.                 *మీ కలలను మీరు నిజాలుగా మార్చుకోగలరు. *కానీ అది సాధ్యపడుతుందని ఒక్కరు మాత్రం విశ్వసించాలి.ఒక్కరు మాత్రం పనిలోకి దిగాలి. ఆ వ్యక్తి నువ్వే                                                        *నీ కంటే ముందు చాలా మంది,వారు కలగన్న జీవితాలను జీవించారు.పెద్ద పెద్ద విజయాలు సాధించారు.                                                  *వారు సాధించారు.అదే సాక్ష్యం నువ్వు సాధించగలగడానికి.                                      *నువ్వు నిజంగా కోరుకుంటే నీ కలను నిజం చేసుకోగలవు.                                                      *నీ కలలకు నువ్వే భయంకరమైన శత్రువువి. ఎందుకంటే నీ కలను ఎప్పుడు విడిచిపెట్టాలో,నువ్వే నిర్ణయిస్తావు కనుక,నువ్వే నిర్ణయిస్తావు నీ కలలను ఎప్పుడు చంపుకోవాలో                                          *నీ గురించి నీకు తెలిసిన దానికంటే నీవు ఎక్కువ శక్తివంతుడివి/రాలివి.                                          *నీ కలతో ప్రపంచాన్ని మార్చగలవు.                  *కానీ దానికి నువ్వు కావాలి. నీ అనువయిన స్థితి నుండి బయటకు రావడానికి,నీలో ఉన్న సింహాన్ని కట్టువిప్పటానికి,ఆ సింహాన్ని బోనులో నుండి నువ్వు మాత్రమే బయటకు విడువగలవు.నువ్వు మాత్రమే నీ కలలను వెంటాడగలవు.                            *బలహీనమైన మనస్తత్వం ఉన్నా,ఆపదలను ఎదుర్కోవడానికి భయపడినా జీవితంలో ఎప్పుడూ ముందుకుపోలేవు                                    *బలహీనమైన మనస్తత్వంతో నువ్వెప్పుడు నీ కలను సాధించుకోలేవు                                      *ఇతరులు వదిలివెడుతున్నా ముందుకే వెళ్లే మనస్తత్వాన్ని సృష్టించుకో                               *జీవితం ఎప్పుడూ ఉహించినవిధంగా ఉండదు.అది ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నువ్వు ఆలోచించే విధం కన్నా నీ కలకు నువ్వు దగ్గరగా ఉంటావు.                                                          *నువ్వు వదిలివెయ్యకుండా ఉంటే నీ కల వాస్తవం అవుతుంది.                                                    *సింహం లా ఉండండి.నువ్వెదుర్కొనే సవాళ్లనుండి ఎప్పుడూ వెనక్కి వెళ్లొద్దు.                                *సింహం ఎప్పుడూ దాని ఆహారాన్ని వేటాడటం ఆపదు,అది దొరికే వరకు.                                    *నీ కలను నిజం చేసుకునేంత వరకు వేటాడటం ఆపవద్దు.                                                        *పెద్ద కలలు కను,నువ్వు కలలు సాధించలేవని చెప్పే అల్పమనస్కుల మాటలు నమ్మొద్దు.                 *అవి వాళ్ళు సాధించలేనివి,కానీ నీకు బాగా తెలుసు                                                         *నిన్ను నువ్వు నమ్ము.                                        *నా లక్ష్యాల,కలల దారిలో నువ్వు కూడా ఉంటే కదులు, ముందుకు కదులు.(అనువాదం:ఒద్దుల రవిశేఖర్) 

Sunday, 26 December 2021

స్టూడెంట్ నంబర్ 1

స్టూడెంట్ నంబర్ 1                                                రచన:విశేష్,భరత్                                                   పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్           విద్యార్థుల తల్లిదండ్రులకు అంకితం ఇవ్వటంతోనే ఈ పుస్తక ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు రచయితలు. పైగా ముందు మాట కూడా లేకుండా వచ్చిన పుస్తకం ఈ మధ్య కాలంలో లేదు. మీరు రాసి పంపిస్తే ప్రచురిస్తాం అన్న మాటలతో పాఠకుల దృష్టి పుస్తకం మీదకు వెళ్లేలా చేస్తుంది.

ఈ పుస్తకం లో 12 అంశాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ తెలుగు పుస్తకంలో రాని విధంగా సంభాషణల రూపంలో పుస్తకంలోని అన్ని అంశాలను రూపొందించడం, పాఠకుడితో మాట్లాడినట్టు ఉంది ఈ పద్ధతి. తనను తాను identify చేసుకుని లీన మయ్యేలా చేస్తుంది.                                ఇందులోని అంశాలు..

1)  బాగా చదవడమంటే ఏమిటో ఏమిటో విద్యార్థులకు ఎవరూ సరిగా చెప్పకపోవడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ముందు, ముందు topic లలో వాటికి సమాధానాలుంటాయని ఉత్సుకతను లేపారు. 

                                                                      2)విద్యార్థుల్లో బలమైన నమ్మకాలను పెంపొందించాలని అప్పుడే విజయం సాధ్యమవుతుందని విద్యావ్యవస్థలో అదే లోపించిందని దాన్ని సరిదిద్దాలని ఇందులో తెలియజేస్తారు.                                        3)పాఠాలు ఎలా వినాలో, ప్రతి పాఠం శ్రద్ధగా వింటే అది మన జీవితాలకు ఎలా పెట్టుబడిగా మారుతుందో మన సంపాదనా స్థాయి ఎలా పెరుగుతుందో ఇందులో ఆసక్తిగా వివరిస్తారు.

4)తరగతి లో చెప్పే పాఠ్యాంశాల్ని ఎలా notes రాసుకోవాలో, mindmaps ఎలా తయారు చేసుకోవాలో ఇందులో వివరణాత్మకంగా చెబుతారు.                                   

5)బాగా చదవడం అంటే ఏమిటో 7 steps ద్వారా ఇందులో వివరిస్తారు.అన్నీ సాధన చేస్తే అలవాటయ్యేవే!                         

6)సంగీతం వింటూ ఆల్ఫాస్థితికి చేరి మరింత ఏకాగ్రతను పొంది బాగా చడవవచ్చని, చదివింది, విన్నది,అలాగే గుర్తుండి పోతుందనే వినూత్న విషయాన్ని ఇందులో పరిచయం చేస్తారు.

7)విద్యార్థులకు challenging గా ఉండే "గుర్తుంచుకోవడం" అనే అంశం చదివి తెలుసుకుని ఆచరిస్తే వారి జ్ఞాపక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. 

 8 ) మనం marks, grades, ranks సాధించిన వారినే తెలివైనవారని అనుకుంటాము. తెలివితేటల్లోని విభిన్నమైన రకాలను పరిచయం చేసి,  ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉంటుందని చెబుతారు.                         

9)మెలకువలు పాటిస్తే ఎవరయినా ఏకాగ్రతను సాధించవచ్చు అని ఇందులో వివరిస్తారు.     

10) విద్యార్థుల పై ఒత్తిడిని పెంచే పరీక్షలకు ప్రణాళికా బద్దంగా ఎలా తయారు కావాలో తెలియజేస్తారు                       

11)పరీక్షలంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని ఎలా అధి గమించాలో practical గా వివరిస్తారిందులో.

12) ఇక చివరి అంశం లో విద్యార్థులకు ఉండాల్సిన skills ను వివరిస్తూ జీనియస్ లా మారాలంటే ఏ రకమైన ఆలోచనా తీరు కలిగి ఉండాలి,దానికి ఎలాంటి, training తీసుకోవాలో Genius gym లో విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇస్తారో తెలుపుతూ ఈ పుస్తకాన్ని ముగిస్తారు.             

విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా చదవ వలసిన practical way of conversation ఇందులో వివరించబడింది. తరువాత Genius Gym లో శిక్షణ పొంది genius లుగా మారటానికి ఈ పుస్తకం పునాదిలాగా పనిచేస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది.

-ఒద్దుల రవిశేఖర్

👉 స్టూడెంట్ నెంబర్-1 పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 50, 101 నెంబర్ స్టాల్స్ లో దొరుకుతుంది.

👉పోస్ట్ ద్వారా పొందాలనుకునే వారు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం. 

https://imjo.in/sX2DmY

Friday, 17 December 2021

వ్యాసరచన

ఏదయినా ఒక విషయాన్ని గురించి సమగ్రంగా వివరంగా అన్ని కోణాల్లో వ్రాయడాన్ని వ్యాసం అంటారు.మనకున్న జ్ఞానానికి,సృజనాత్మక శక్తికి,తార్కిక శక్తికి వ్యాసం నిదర్శనం.స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీ,నెహ్రూ తమ భావాలను వ్యాసాల రూపంలో ప్రజలకు తెలియజేసేవారు.                                        పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తుంటారు.అలాగే కొన్ని సంస్థలు కూడా వ్యాసరచన పోటీలకు ఆహ్వానిస్తుంటాయి.విద్యార్థి ఏదయినా అంశాన్ని లోతుగా పరిశీలించడానికి, విషయాన్ని సేకరించడానికి తన స్వంత భాషలో అభివ్యక్తీకరించడానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.మన మాతృభాష అయిన తెలుగుతో పాటు హిందీ ,ఇంగ్లీష్ లలో కూడా పాఠశాల స్థాయిలో విద్యార్థులను వ్యాసరచనలో ప్రోత్సాహించాలి.కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న విషయాలను నేర్చుకుని పరీక్షలు వ్రాయడం కాకుండా ప్రపంచంలోని విభిన్న విషయాలను తెలుసుకోవడానికి వ్యాసరచన పోటీలు దోహదం చేస్తాయి.ఒక భాష మనకు బాగా వచ్చు అంటే ఆ భాషలో బాగా మాట్లాడటం తో పాటు వ్రాయడం కూడా వస్తే పరిపూర్ణత వచ్చినట్లు.                                  ఇక విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలైన సివిల్స్,గ్రూప్ 1 స్థాయి పరీక్షలు వ్రాయడానికి చిన్నప్పటినుంచి వ్యాసరచన ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.పరీక్షల కోసం నేర్చుకుని రాయడం కాకుండా ఏ విషయాన్ని అయినా విశ్లేషించి మన అభిప్రాయాలను వ్యక్తీకరించడం విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది.                ప్రస్తుతం పాఠశాలల్లో మార్కులు గ్రేడుల మాయాజాలం లో పది వ్యాసరచన ప్రక్రియను ప్రక్కకు పెట్టారు.కనీసం నెలకు ఒక అంశంలో నైనా తెలుగు,హిందీ ,ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన పోటీలను పాఠశాలల్లో నిర్వహిస్తే విద్యార్థుల భవితకు బంగరు బాటలు వేసినట్లే.           విద్యార్థులు ఏదైయినా అంశంపై తమ స్వంత అనుభవాలను,అభిప్రాయాలను వ్రాసే విధంగా కూడా ప్రోత్సాహిస్తే వారికి రచనా శక్తి అలవడుతుంది.సమాజంలో తాము గమనించే అంశాలపట్ల తమకు వచ్చే ఆలోచనలను,మనిషి జీవితం మరింత సౌకర్యవంతంగా,ఉన్నతంగా మారడానికి అవసరమయ్యే వినూత్న సంస్కరణలను వ్యాసాలరూపంలో వ్రాసి వార్తాపత్రికలు, సోషల్ మీడియా ద్వారా కూడ ప్రజలకు తెలియజేయవచ్చు.                               పైన తెలిపిన విధంగా పాఠశాల స్థాయినుంచే వ్యాసరచన పట్ల ఆసక్తిని,ఇష్టాన్ని,విద్యార్థుల్లో కలిగించడం ప్రతి ఒక్క ఉపాధ్యాయుని బాధ్యత.....ఒద్దుల రవిశేఖర్.

Saturday, 11 December 2021

తెలుగు కోసం

 తెలుగు కోసం రచయిత:డా.జి.వి.పూర్ణచందు.                  పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్.    భాష,సాహిత్యం, సంస్కృతి,చరిత్ర ల అనుశీలన అన్న శీర్షికలోనే పుస్తకం లోని విషయాలు ఏంటో తెలుస్తాయి.1)సంస్కృతి చరిత్ర:ఈ విభాగంలో వినాయకుడు,గణపతి ల గురించి వ్రాస్తూ వినాయకచవితిని పర్యావరణ పరిరక్షణ పండుగగా జరుపు కొమ్మని పిలుపివ్వడం బాగుంది.తొలి తెలుగు దేవతలు గురించి ఆసక్తికర విషయాల్లో ఆసక్తికర విషయాలెన్నో.ఆంధ్ర్ర మహావిష్ణువు, మురుగ స్కంధ ,సుబ్రహ్మణ్యం ల వివరణ,అలెగ్జాండర్ దాడి కథల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకి.సుశ్రుతుని వైద్య విధానాలు,బౌద్ధయుగంలో సభాసంప్రదాయాలు,వైదికుల పరిభాషలో విశేషాలెన్నో.,2) మన ఆహారం భాష సంస్కృతి : అన్నమయ్య వంటకాలు, తెలుగు పచ్చళ్ళ ముచ్చట్లు చదువుతుంటే నోరూరాల్సిందే.తినే ఆహారాన్ని అన్నం అనేది తెలుగు వారే. పంచదార చెరకు పండించిన తొలి రైతులు తెలుగు వారే  3) మన భాష:పాణిని వ్యాకరణానికి చేసిన సేవను గూర్చి చక్కగా వివరించారు.కోడింగ్ పద్ధతిని కంప్యూటర్ లో ఒక భాషను వ్రాయటానికి పాణిని పేరు కూడా చేర్చి పాణిని బాకస్ నౌర్ పద్ధతి అనే వ్యవహార నామం వ్యాప్తి లో ఉంది.భాషను పరిశోధించడం ద్వారా చరిత్రను ఎన్నో విధాలుగా మనం తెలుసుకోవచ్చు .ద్రావిడ కుటుంబంలో తెలుగే తొలిభాష అనే ఆశ్చర్యం గొలిపే తెలుస్తుంది.సింధు నాగరికత   ద్రావిడుల నాగరికత.అందులో తెలుగు వారి పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది.దక్షిణ భారతీయ కులాలు,జాతులలో ఆఫ్రికన్,ఆసియన్ మూలాలు ఉన్నట్లు  mt DNA పరీక్షలో నిర్దారణ అయింది.ఈ జాతులు ప్రస్తుతం తెలుగు నేలమీద నివసిస్తున్నారు.వైదిక యుగం కన్నా ముందు పూర్వ ముండా భాష మాట్లాడిన నాగరిక ప్రజలు ఉండేవారని నిరూపణ అయింది.వరి స్పష్టమైన తెలుగు పదం.పూర్వ ద్రావిడ భాషకు దగ్గరగా కనిపించేది తెలుగు భాషే.పాళీ భాషలో తెలుగు వ్యవసాయ పదాలు కలిసి ఉన్నాయి.ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు భాషకు ప్రాచీన హోదాకై విశేష కృషి చేసారు4)భాషోద్యమం-భాషాభివృద్ది.కంప్యూటర్ లో తెలుగు భాషాభివృద్ది ప్రపంచ భాషగా తెలుగును తీర్చటానికి ఇది మొదటి అడుగు.5) మన భాష మన చారుత్ర:అమెరికా మెక్సికో లోని రెడ్ ఇండియన్లు ,'ఇంకా' మయా అనే రెండు ప్రధాన తెగలు కూడా మూల ద్రావిడ భాషకు సంబంధీకులే అన్న విషయం సంభ్రమానికి గురిచేస్తుంది.మూలా ద్రావిడ భాష మాట్లాడిన ప్రజలు ప్రపంచ దేశాలన్నింటా విస్తరించి ,దక్షిణ భారతదేశంలో తెలుగువారిగా స్థిరపడినట్లు అనిపిస్తుంది.ఇప్పటికి 2700 సం. క్రితం తెలుగు నేలను అస్మకులు పరిపాలించారు.15 వ శతాబ్దానికి ప్రపంచం లోనే అత్యధిక ధనిక సామ్రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని తొలుత గుర్తించినవారు పోర్చుగీస్ లు.రాయల కాలం లో వజ్రాల గనులు నిర్వహించారు.ఆంధ్రవిశ్వ విద్యాలయ స్థాపన గురించి వివరంగా ఇచ్చారు.తొలి ద్రావిడ ప్రజలు సుమేరియా మీదుగా బంగాళా ఖాతం గుబడా కృష్ణా,గోదావరి ముఖద్వారాల్లోంచి తెలుగు నేల మీద మొదటగా పాదం మోపారని భారతదేశం లో తొలి ద్రావిడులు తెలుగు ప్రాంతీయులేనని ప్రాంక్లిన్ సి సౌత్ వర్త్ ప్రకటించారు.6) మన సాహుత్యం:పాల్కురికి సోమనాధుని తెలుగు పద ప్రయోగాలను సోదాహరణంగా వివరిస్తారు.రాయల నాటి పాలనా భాష గురించి వివరించారు.తొలి తెలుగు నిఘంటువు "ఆంధ్రదీపిక" మామిడి వెంకటార్య పండితులు రూపొందించారు.తొలి తెలుగు పత్రికల గురించి సవివరంగా వివరిస్తారు.1831 లో తొలి పత్రిక 'తెలుగు జర్నల్' అనే పత్రిక వెలువడింది.స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి పత్రిక "ఆంధ్రపత్రిక" 1908 లో ప్రారంభమయి 1991 లో మూత పడింది.తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ గలా డా.జి వి.పూర్ణచందు గారి విస్తృత పరిశోధనా గ్రంధం ఇది.తెలుగు వారి చరిత్రను పెక్కు ఆధారాలతో వివరించిన వారికి తెలుగు జాతి ఎంతగానో ఋణ పడిఉంటుంది.తెలుగు భాషాభిమానులు,తెలుగు వారి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు,విద్యార్థులు,మరీ ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు,అధ్యాపకులు తప్పక చదవవలసిన పుస్తకమిది.

Thursday, 2 December 2021

సిరివెన్నెల కురియని రాత్రి.

 10 వ తరగతి ముగిసిన వేసవి.కె.విశ్వనాధ్ గారి సినిమా "సిరి వెన్నెల"పేరే ఎంత మనోహరంగా ఉందో .సినిమా చూస్తున్నంత సేపు గుండె స్పందనలు కళ్ళు పలికిస్తున్నాయి.పాటల్లో అప్పటివరకు వినని సాహితీ సొబగులు,మరోలోకానికి తీసు కెళ్లిన వేణుగానం. అప్పుడు పరిచయమయ్యారు సీతారామ శాస్త్రి.అప్పుడే ఇష్టం పెరిగింది వేణుగానం పై.సిరివెన్నెల లోని "విధాత తలపున"ఎన్ని సార్లు పాడుకున్నానో .ఇక అర్ధరాత్రి నెల్లూరు అర్చన థియేటర్ లో "రుద్రవీణ" సినిమా చూసి అందులోని "చెప్పాలని ఉంది ,గుండె విప్పాలని ఉంది" పాట స్ఫూర్తి తో అర్ధరాత్రి ఒంటి గంటకు ఓ కవిత వ్రాసుకున్నా .ఇక నెల్లూరు VR College లో ఏదో function కు వచ్చిన సిరివెన్నెల గారు "త్రిశంకు స్వర్గం లో త్రివర్ణ పతాకం"అన్న ఒక పాట స్వయంగా పాడారు. తరువాత ఏదో పత్రికలో ఆ పాట వస్తే వ్రాసుకుని ట్యూన్ గుర్తు పెట్టుకుని చాలా వేదికల మీద పాడా.National science fair( రాంచీ,జార్ఖండ్) లో పాడి అక్కడి కలెక్టర్ ప్రశంస లందుకున్నా. ఈ పాట గాయం సినిమా లో వచ్చింది.ఇక "ఎటో వెళ్ళిపోయింది మనసు" జామురాతిరి జాబిలమ్మ" "నిగ్గదీసి అడుగు",తరలి రాద తనే వసంతం" "జగమంత కుటుంబం నాది " నాకు బాగా ఇష్టమై పాడుకునే ఆయన పాటలు.మా తరపు ఊహలకు భావుకత అద్దిన పాటల రేడు సిరివెన్నెల."నీవు లేవు నీ పాట ఉంది"మాకు తోడుగా.శ్రద్ధాంజలి వారికి....ఒద్దుల రవిశేఖర్.