Tuesday 14 August 2012

పచ్చని అడవి

        వర్షాకాలం వచ్చిందంటే చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో!కాగితపు పడవలు,చేసి పారే నీళ్ళల్లో వదిలి కోలాహలంగా వాటి వెంట పరుగు తీసే వాళ్ళం .చిన్న చిన్న పిల్లకాలువలకి ఆనకట్టలు(చిన్నవే) కట్టి వాటిలో అగరుబత్తీలకు వచ్చే కడ్డీ లను తూములుగా అమర్చి దానిగుండా పారే నీటిని చూస్తూ ఎంత ఉత్సాహంగా వుండే వాళ్ళమో! వడగళ్ళ వాన పడితే వాటిని చేతుల్లోకి తీసుకొని ఐస్ అంటూ ఆడుకునే వాళ్ళం.అప్పటికి ఈ ఫ్రిజ్ లు  లేవు.కొని తినే ఐస్ లు మాత్రమే తెలుసు.ఇక ఇప్పటి వర్షాకాలంలో  పిల్లలు ఏమీ ఆటలు ఆడటం లేదు. మనమే మన పిల్లల్ని తడవనీయటం లేదు జలుబు చేస్తుందని.ఈ మధ్య రాష్ట్రం లో వర్షాలు బాగానే పడ్డాయి కానీ  projects లకి ఇంకా నీరు రాలేదు.శ్రీశైలంకు  వస్తున్నాయని అంటున్నారు.ఎప్పుడొస్తాయా వెళ్లి చూద్దామని ఉంది. ఈ లోపల ఒకసారి మహానంది వెడితే ఎలా ఉంటుందా అని అనిపించింది.
         మార్కాపూర్ (మేము ఉండే వూరు )నుండి నంద్యాల వెడుతూ నల్లమల అడవి అందాలు చూస్తుంటే తన్మయత్వంతో పులకించి  పోయాము.కొన్ని లక్షల వృక్షాలు పచ్చగా చిగురించి ఆకు పచ్చని తివాచిని పరిచినట్లు ఎంత హొయలు పోతున్నాయి.ట్రైన్లో  వెడుతూ చూస్తూఉంటే  చెట్లన్నీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఊగుతూ  పలకరించాయి.ఎన్ని రకాల చెట్లని.పేర్లన్నీ  సేకరించి మరోసారి  వ్రాస్తాను,ఎందుకంటే అన్ని చెట్ల పేర్లు తెలియవు మరి.రైలు మెలికలు తిరుగుతూ వెడుతుంటే చెట్లన్నీ టాటా చెబుతూ వెనుకకు పరిగెడుతూ ఉన్నాయి.దిగువ మెట్ట  దగ్గర కాసేపు ఆపుతారు,ట్రైన్ కు నీరు పట్టు కోవాలని.మీకో విచిత్రం తెలుసా!ఇక్కడ అన్ని రైళ్లకు పట్టే నీరంతా దగ్గరి కొండమీదనుండి సంవత్సరమంతా వస్తూ ఉంటుంది.కొండ పైన ఒక చోటనుండి నీరు ఉబికి వస్తుంటే అక్కడ బ్రిటిష్ వారు వేసిన పైపులనుండి క్రిందికి వస్తాయి.ఇక అక్కడి నుండి ముందుకు వెడితే పచ్చర్ల స్టేషన్ లో కొద్ది సేపు రైల్  ఆగుతుంది.ఇది అడవి మధ్యలో ఉంటుంది.అక్కడ తనివి తీరా ప్రకృతి అందాలను ఆస్వాదించ వచ్చు.మబ్బులు కొండల అంచును తాకుతూ వెడుతుంటాయి.
     ఇక దాని తర్వాత మొదటి సొరంగం వస్తుందండీ.ఇక ట్రైన్ అంతా ఒకటే కేకలు.లోపల ఒక మూడు నిమిషాల ప్రయాణం .లైట్స్ ముందే వేస్తారు.వేయకపోతే చిమ్మ చీకటి పగలే.అది దాటినా తరువాతంతా అడవే.ఇక్కడే చాలా సినిమాలు తీసారు.p.v.నరసింహారావు గారి హయాం లో దీనిని అభివృద్ది చేసారు.ఇక అలా అడవిని దాటుకొని నంద్యాల వెళ్లి తరువాత మహానంది వెళ్ళాము.ప్రకృతి ఎంత అందంగా అలంకరించుకొని అక్కడ నాట్యం చేస్తుందో చూడాలంటే రెండు కళ్ళు చాలవు.ఆ గుడిలో సహజ సిద్ధంగా వచ్చే నీటితో ఒక కొలను లోపల, రెండు కొలనులు బయట ఏర్పాటు చేసారు.వాటిల్లో ఈత కొట్టటం మరపురాని అనుభవం.చాలా సార్లు వెళ్ళినా వెళ్ళిన ప్రతి సారి కొత్తగా ఉంటుంది.ఇక్కడ వచ్చే నీరు బయటికి వదులుతారు.వీటి సహాయంతో వందల ఎకరాల అరటి తోటలు  పండుతాయి గుడిలో దర్శనం  అయిన తర్వాత గుడి వెనుకే అడవి.అడవిలో కొద్ది దూరం నడిచి చెట్లను చేతులతో తట్టి పలకరించి వచ్చాము .కానీ ఇక్కడ కొండకు దిగువగా గుడి వెనకాల ఒక మంచి ఉద్యాన వనం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో!
      అలాగే అక్కడ ఒక హెలిపాడ్ ఏర్పాటు చేసి అందులోహెలికాప్టర్తో  నల్లమల అడవంత చూపించే  ఏర్పాటు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!అడవిని పైనుండి చూడటం ఎవరికీ సాధ్యం కాదు కదా!నల్లమల  అడవి ప్రపంచం లోనే పేరెన్నికగన్నది.దీన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత.అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడి చెట్లు కొట్ట నీయకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి .ఈ కాలంలో ఓ సారి  అక్కడికి ఒక సారి వెళ్లి రండి.

16 comments:

  1. watching dense forest through helicopter is awesome.our tourism should act upon it...very nice article.....murthy

    ReplyDelete
  2. మేమూ నంద్యాల , మహానంది వెళ్ళాము కాని కార్ లో వెళ్ళాము . అప్పుడు అడవి గుండా వెళ్ళిన గుర్తు లేదు .మీ పోస్ట్ చదువుతుంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తోంది .

    ReplyDelete
    Replies
    1. గుంటూరు నుండి నంద్యాల పోయే రూట్ లో ఉంటుందండి.హైదరాబాద్ నుండి వచ్చి మహానంది చూసిన తరువాత మార్కాపూర్ వైపు వస్తే ఈ అడవిని చూడవచ్చు.మీకు ధన్యవాదాలు.

      Delete
  3. మహానంది చూడాలని మేము కూడా ఎప్పటినుండో అనుకుంటున్నామండీ
    మంచి పచ్చని,అందమైన ప్రయాణాన్ని గురించి చెప్పారు..
    బాగుంది..

    ReplyDelete
    Replies
    1. ఈ సీజన్లోనే చూడండి.మీకు ధన్యవాదాలు.

      Delete
  4. ravi sekhar gaaru chala baga varninchaaru choodaalanipinchela inka chaduvuthunte choosthunnantha anandama kaligela abinandanalu

    ReplyDelete
    Replies
    1. ప్రకృతి కలిగించే పరవశం లోని మైమరపు అలా వ్రాయించిందండి.మీకు నచ్చినందులకు ధన్యవాదాలు.

      Delete
  5. ravishekar gaaroo nandyala adavi pachhadanam goorchi baagaa chepparu

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.ప్రక్రుతి కోసం ఓ సారి చూడండి.

      Delete
  6. ఎపుడో గూగుల్ లో మెసేజ్ పెట్టి మీ ఊరు వచ్చేస్తాం...
    మీరే చేయించాలి చక్కని ప్రకృతి సందర్శనం...:-)
    బాగా వర్ణించారు ప్రకృతిలోని అందాలను..
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. రండి శ్రీనివాస్ గారూ!తప్పకుండా చూపిస్తాను.మీ రాక మాకు ఆనందం.మీకు ధన్యవాదాలు.

      Delete
  7. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము. మీ పోస్ట్ చదువుతుంటే మళ్ళీ వెళ్లాలనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు చాలా మారిపోయిందండి.ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా చూడండి.మీకు ధన్యవాదాలు.

      Delete
  8. నల్లమల అడవి దారిలో ప్రయాణం చేస్తుంటే .పచ్చటి ప్రకృతి , స్వచ్ఛమైన కొండగాలి ... ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

    మహానంది గుడి చాలా బాగుంటుందండి. అక్కడ ఉండే కొలనులలోని నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటిలో ఉన్న చిన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.

    చక్కటి విషయాలను తెలియజేశారు.

    ReplyDelete
    Replies
    1. మీరు ఈ ఆనందం అనుభవించారన్నమాట.వర్షాకాలం లో మరింత బాగుంటుంది.మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete