Monday 28 May 2012

మనకి కోపం ఎందుకు వస్తుంది?1


        మనిషికి కోపం లేదా ఆగ్రహం ఎందుకు వస్తుంది?.కోపం ఎవరిపై వస్తుంది?కోపం అంటే ఏమిటి?ఏదైనా బాహ్య పరిస్థితి  తనకు అనుకూలంగా లేకున్నా,ఎదుటివారు మనల్నికించ పరిచేలా మాట్లాడినా మన అవకాశాలను ఎవర న్నా దెబ్బ కొడుతున్నారని తెలిసినా మన దగ్గరి వారు మన మాట వినక పోయినా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఇలా విభిన్న పరిస్థితులలో మన ప్రతిస్పందన కోపం రూపంలో బహిర్గతమవుతుంది .దీని బారిన పడని మనిషి ఉండ డేమో!కాకపోతే ఎంత త్వరగా ఆ స్థితినుండి బయటపడతారు అన్నది వ్యక్తుల స్వభావాన్ని బట్టి ఉంటుంది.
         పై కారణాలనన్నింటితో పాటు  ఒక విషయం చెబితే అందరు  ఆశ్చర్యపోతారు.మనకు చాలా లక్షణాలు వంశపా రం పర్యంగా వస్తాయి.మన తల్లి దండ్రులకు లేదా వారి తల్లిదండ్రులకు గల ఈ లక్షణం జీన్స్ ద్వారా మనకు రావచ్చు. కాబట్టి ఒక రకంగా కోపం ముందుగానే నిర్ణయించబడుతుంది.ఇంకా చెప్పా లంటే మన తల్లిదండ్రులు ప్రవర్తించే విధానా న్ని మనం చిన్నప్పట్నుండి చూస్తుంటాము కనుక అలాగే మన ప్రవర్తన నిర్ణయించబడుతుంది.నూటికి నూరు శాతం కాకపోయినా ఎక్కువ శాతం ఇలా జరిగే అవకాశం వుంది.అలాగే కోపం ప్రదర్శించడం వ్యక్తి నిస్సహాయ స్థితిని కూడా సూచిస్తుంది.ఇంకా ఎన్నో అంశాలు దీనికి కారణమవుతాయి.
       సహజంగా ఈ కోపం రెండు రకాలు.1)ప్రదర్శితమయ్యేది2)లోలోపల వ్యక్తమయ్యేది
కొంత మంది వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.మరికొంత మంది వ్యక్తులు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తారు.చిత్రంగా ఇంకొందరు అసలు కోపాన్ని ప్రదర్శించరు.మరి వారికి కోపం రాదా అంటే వస్తుంది.దానిని అంతర్గతం గా అణచుకుంటారు.అతి తక్కువ మందికి మాత్రమే అంతర్గతంగా కూడా కోపం జనించదు. వారిని మనం ఋషులు అనవచ్చు.మనమందరం మామూలు మానవులం కాబట్టి దీని నుండి ఎలా బయట పడాలో మరో వ్యాసంలో చర్చిద్దాము.
 

4 comments:

  1. కొంతమందికి సరదాగా బ్రతిమాలించుకోవాలన్నా, కావలసినది దక్కించు కోవాలన్నా కూడా కోపం నటిస్తారు :)

    ReplyDelete
  2. కోపం నటించడం వల్ల వారి ఆరోగ్యానికి ఏమీ ప్రమాదం లేదు.అది చిన్న పిల్లల మనస్తత్వం .ధన్యవాదాలు.

    ReplyDelete
  3. మీ పోస్ట్ లో భలే valid point రాసారు. తల్లితండ్రుల జీన్స్ వల్ల చాలా లక్షణాలు పిల్లలకి సంక్రమించడం. బాగుందండి పోస్ట్!

    ReplyDelete
  4. మనల్ని మనం గమనించుకుంటే ఈ విషయం అర్థమవుతుంది.ధన్యవాదాలు .మరణం ఇచ్చేసందేశం లో మీ వ్యాఖ్యకు వ్యాఖ్య వ్రాసాను గమనించగలరు.

    ReplyDelete