Monday 13 January 2014

వారానికొక రోజు సైకిల్ సవారీ చేయండి !

               నేను స్కూల్,కాలేజీ చదివే రోజుల్లో సైకిల్ పై వెళ్ళే వారం.నేను నా మిత్రుడు ఒకే  సైకిల్ పై వెల్లేవారం.  అప్పుడు మాకాలేజీ lecturers కూడా సైకిల్ పైనే వచ్చేవారు.మాmaths lecturer,principal మాత్రంbajaj chethak పై వచ్చేవారు  అప్పుడు అందరం వాటిని గొప్పగా చూసేవాళ్ళం.ఓ సారి college కి నడిచి వెడుతుంటే మా maths లెక్చరర్  Nageswararao (SNR ) నన్ను తన స్కూటర్ ఎక్కించుకుని వెళ్ళారు.ఆ రోజు ఎంత ఆనందమో !అందరికి ఆ విషయం చెప్పాను.ఆయన అప్పుడప్పుడు అలా నడిచి వచ్చే పిల్లలను స్కూటర్  ఎక్కించుకునే వారు.
             తరువాత డిగ్రీ నెల్లూరులో చదివే రోజుల్లో కూడా అదే సైకిల్ పై ప్రయాణం అప్పటికి lecturers అందరు స్కూటర్ పై వస్తున్నారు.ఎందుకీ ఉపోద్ఘాతమంటే ఈ మధ్య కాలంలో సైకిల్ తొక్కటం కేవలం చిన్న పిల్లలకు సంబంధించిన విషయంగా మిగిలిపోయింది పిల్లలు కూడా స్కూల్  కి కాలేజీ లకు ఆటో లలో,బస్సు లలో వెడుతున్నారు ఇంటి దగ్గర మాత్రమే సైకిల్ త్రొక్కుతున్నారు.
             పెద్దలు దాదాపుగా సైకిల్   త్రొక్కటం మానేసి  హీరో హోండా లు కొనేస్తున్నారు.ఇది పట్టణాల్లో మామూలు విషయం.పల్లెల్లో సైతం విపరీతంగా కొంటున్నారు.పట్టణాల్లో రోడ్ల పై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది బండ్ల వేగం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెట్రోల్ వాడకం పెరిగింది.దీంతో కాలుష్యం,భూతాపంపెరిగిపోతు న్నాయి.ప్రపంచ వ్యాప్తంగా bikes,cars ఎక్కువవటం వలన పట్టణాల్లో గంటలతరబడి ట్రాఫిక్ జామ్ అవటం మనం హైదరాబాద్ ,బెంగళూరులో చూస్తుంటాం.మరి దీనికి పరిష్కారం ఏమిటి ?
          చైనాలో వారానికొక రోజు ప్రతి ఒక్కరు సైకిల్ పైనే ప్రయాణించాలి,లేదా ఫైన్ వేస్తారు.మన రాష్ట్రంలో వైజాగ్ లో ఈ ప్రయోగం జరుగుతుంది .హైదరాబాద్ లో కిరణ్ రెడ్డి అనే ఒక కంపెనీ అధికారి అత్తాపూర్ నుండి ameerpeta  వరకు రోజు సైకిల్ పై వస్తారట.car ప్రయాణం గంటన్నర  సైకిల్ పై 45 నిముషాలకే వెడతారట.  వారాని కొకరోజు తన ఆఫీసు ఉద్యోగులు సైకిల్ పై వస్తే 1000 రూపాయలు బోనస్ గా ఇస్తానని ప్రకటించారు .
        అలాగే దీన్ని అందరు ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుంది ఇంధనం,కాలం డబ్బు అన్నీ ఆదానే !  భూమాతకు ఎంతో మేలు చేసినట్లు! ఒక గంట సైకిల్ త్రొక్కితే 414 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది .  గంటకు 6 కి. మీ నడిస్తే 228 కేలరీలే ఖర్చు అవుతాయి మార్నింగ్ వాకింగ్ కు బదులు మార్నింగ్ సైక్లింగ్ చేస్తే మరీ మంచిది . ప్రయత్నిస్తారు  కదూ!      

Sunday 5 January 2014

నూతన సంవత్సర వేడుకలు ఇలా జరిపితే ఎలా ఉంటుంది ?

      నూతన సంవత్సరాన్ని ప్రపంచమంతా చాలా ఘనంగా జరుపుకొంది.మనం కూడా మిత్రులతో,బంధువులతో ఆనందంగా గడుపుతుంటాం.మనకెవరయినా,మనమెవరికయినా శుభాకాంక్షలు చెబితే ఇద్దరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది కదా!ఇంకా చాలా మంది చాలా ఖర్చుతో వేడుకగా జరుపుకుంటారు.ఇక అధికారులు,రాజకీయ నాయ కుల దగ్గరికి పండ్లు ,స్వీట్స్ ,శాలువాలు తీసుకెళ్ళి పలకరిస్తారు.వారికి వాటి నన్నింటిని ఏమి చేసుకోవాలో తెలీదు.
         ఓ సారి మార్కాపూర్ లోని vasavi club మిత్రుల సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొనటం జరిగింది. వారికి ఆ సందర్భంగా హాస్టల్ పిల్లలకోసం ఏదైనా కార్యక్రమాన్ని చేయమని అడగటం జరిగింది.ఈ నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని hostel  పిల్లలతో వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందని ఆ సంస్థ కార్యదర్శి నా మిత్రుడు ఆనంద్ అడిగారు.బాగుంటుందని నేను చెప్పాను.ఈ విషయాన్ని ఆ వార్డెన్ తో సంప్రదించమని అడిగాడు.ఆ హాస్టల్ వార్డెన్ ఏడుకొండలు గారిని కలిశాను.ఆయన ఆనందంతో ఒప్పుకొన్నారు.ఈ విషయాన్ని ఆనంద్ కు తెలియ జేయగా ఆయన వాసవి క్లబ్ వారితో తెలపగా వారు ఉత్సాహంతో ఆమోదించారు . నేను వార్డెన్ కు చెప్పగా  వారు అన్ని ఏర్పాట్లు చేసారు.రాత్రి 10. 30 నిముషాల నుండి 12. 00 గంటల వరకు వారు అక్కడ ఉండి పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి నోట్సులు పెన్స్ అందించారు అలాగె 12 . 00 గంటలు కాగానే పిల్లల తో ఆడి పాడి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కేరింతలు కొట్టారు.ఆ క్షణంలో పిల్లలెంత ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నారో! తరువాత కేకు,లడ్డు ,బిస్కట్స్ పంచారు .
       ఈ కార్యక్రమంలో మోదాల నాగరాజు ,పి.వి. ఆనందబాబు ,టి .వి శ్రీనివాస్ ,పువ్వాడ రవిశంకర్, దోగిపర్తి బాబు గొంట్లా శేషగిరి,R.K.G నరసింహం,రంగనాయకులు, ప్రదీప్ పాల్గొన్నారు .
        పుట్టిన రోజు,వివాహ వార్షికోత్సవం వంటి వివిధ కార్యక్రమాలను HOSTELS,అనాధ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు వంటి వాటిలో నిర్వహిస్తే వారికి మనకు ఆనందం కలుగుతుంది.మీరేమంటారు ?