Saturday 1 May 2021

మానవ ఆరోహణ(The Ascent of Man)....మూలం:జేకబ్ బ్రోనోస్కీ.పరిచయం:ముక్తవరం పార్థసారధి

 మానవ పరిణామ క్రమాన్ని వివరించే పుస్తకాల్లో  ఇది 4 దశాబ్దాల క్రితంది అయినా మనకు ఈ మధ్యనే పరిచయం చేసారు పార్ధసారధి గారు.ఏదేమైనా ఈ అంశం పై ఏ పుస్తకమైనా నన్ను కుతూహలానికి గురిచేస్తుంటుంది.           ప్రకృతి పరిణామం కన్నా భిన్నమైన  విషయం "మానవారోహణ".జ్ఞానమెప్పుడు పరిణామక్రమం లో ఒక దశ మాత్రమే.ప్రతి పరిణామ దశలో కీలకమైన మలుపు ఒకటి ఉంటుంది.అదే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే దృష్టికోణం అన్న వాక్యాల ద్వారా రచయిత తను చెప్పదలచుకొన్న అంశాలకు పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడు.మానవ మేధస్సు వివిధ రంగాలలో వికసించిన క్రమం ఇందులో ప్రస్తావించారు.1859 లో అచ్చయిన The origin of spices తో,1871 నాటి " the descent of man" తో చార్లెస్ డార్విన్ మనకు ఆదర్శం కావడాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క అంశాన్ని చెబుతూ ఆసక్తి కలిగిస్తూ వెడతారు.20 లక్షల సంవత్సరాల క్రితం లభించిన పిల్ల వాడి పుర్రె ను విశ్లేషించి ఆస్ట్రలో పితికస్ దానికి పేరు పెట్టారు.తొలి రాతి పనిముట్టు తయారు చేసిన కాలం ఇది.10 లక్షల సంవత్సరాల క్రితం Homoerectus ఆవిర్భవించాడు.2 లక్షల సం. నాడు Neanderthal Man దర్శనమిస్తాడు.తరువాత దశలో వచ్చినవారు Homo sapien (మనం).మానవ చరిత్రలో మౌలికమైన ఆవిష్కరణ నిప్పును రాజెయ్యటం.అగ్నిని తయారు చేసిన మనిషి జీవితమే మారిపోయింది.ఈ విషయాలతో మొదలు పెట్టి తరువాత దొరికిన కుడ్య చిత్రాల ఆధారంగా 20,000 ఏళ్ల క్రితం మనిషిని విశ్లేషిస్తారు.గత 12,000 ఏళ్ల క్రితం నుండి జరిగిన మానవ చరిత్ర మీద దృష్టి సారించారు రచయిత.10,000 ఏళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంతువులను మచ్చిక చేసుకొని మొక్కల్ని పెంచడం ప్రారంభించాడు.మంచుయుగం చివరి దశలో వ్యావసాయిక విప్లవం(జీవ విప్లవం)ప్రారంభమైంది.మానవారోహణలో తొలిమెట్టు సంచారజీవితం మాని ఒక చోట స్థిరపడి వ్యవసాయం ప్రారంబించటమే.ప్రకృతి లో జరిగిన జన్యు సంయోగ ఫలితాల ద్వారా ఏర్పడిన గోధుమ ఏర్పడిందనే ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయడం ద్వారా మనల్ని రచనలోకి మరింత ముందుకు వెళ్లేలా చేస్తారు.ప్రకృతి సహజంగా ఏర్పడిన వీటిని తరువాత పంట లాగా పండించడం నేర్చుకున్నాడు.క్రీ.పూ 6000 సం నాడు జెరికో వ్యవసాయ క్షేత్రంలో వీటిని పండించారు.తరువాత కొడవలి,నాగలి,చక్రం ఆవిష్కరించారు.కుక్క,గాడిద,ఎద్దు,గుర్రం వంటి జంతువులను పెంచుకుని వాటి సహాయం తో అదనపు సంపద సృష్టించిన విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈ విధంగా లభించిన ఆధారాల ఆధారంగా పనిముట్లు,నిర్మాణాలు చేయడం,లోహాలను వాడటం,గణిత అవిష్కరణలతో ఉదాహరణలతో మనకు ఆసక్తి కలిగిస్తూ ముందుకు సాగుతారు.ఇక 16 వ శతాబ్దం లో మొదలయిన పారిశ్రామిక విప్లవాన్ని గెలీలియో తో మొదలు పెట్టి న్యూటన్,leebnitz einstein,నీల్స్ బోర్ దాకా కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు.ఆవిరి యంత్రం కనుగొన్న జేమ్స్ వాట్,చార్లెస్ డార్విన్ ల కృషిని తలచుకుంటారు.కాంతి కిరణాల పై ప్రయోగాలు,రాంట్ జెన్ x రే కిరణాలు,లియో జిలార్డ్ అణు విచ్చిత్తి ప్రక్రియలను ప్రస్తావిస్తారు.గ్రెగరీ మెండల్ పరిశోధనలు,DNA ఆవిష్కరణ,క్లోనింగ్ వంటి ఆధునిక పరిశోధనల వరకు వివరిస్తారు.సైన్స్ నైతికతను పెంచాలని,మేధో ప్రజాస్వామ్యం అవసరమని చెబుతారు.what is man అనే రహస్యం తెలుసుకోవడానికి కొనసాగాలి ఆరోహణ అంటారు.జ్ఞానం వెనుక బాధ్యత,నిజాయితీ,విచక్షణ ఉంటుంది.మానవ జాతి మూలాలు, చరిత్ర ఆరోహణ క్రమం ప్రతి స్కూలు పుస్తకం లోను భాగం కావాలని అభిలషిస్తారు రచయిత.మనిషికి తన పరిణామ క్రమాన్ని గురించిన జ్ఞానమే ఆలోచన కలిగిస్తుంది.అనుభవం,ఆలోచనను కలగలిపి ఆచరణను నిర్ణయించుకోవాలని చెబుతారు. జ్ఞానాన్ని లాటిన్ భాషలో సైన్స్ అంటారు.చరిత్ర అంటే గతం కాదు,ఈనాడు,ఈ క్షణం మనం తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న జ్ఞానమే చరిత్ర .దీని ఆధారంగా మనిషి ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేయడమే మానవారోహణ అన్న ముగింపు తో మనలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాడు. సైన్స్ ఉపాధ్యాయులు,అధ్యాపకులు,విద్యార్థులు,చరిత్రపట్ల అభిరుచి ఉన్న వారందరు చదవతగ్గ పుస్తకం ఇది....ఒద్దుల రవిశేఖర్.

Friday 30 April 2021

ఆనందో బ్రహ్మ.....యండమూరి.

              కాలాన్నివెనక్కి ముందుకు నడిపించిన సుందరకావ్యం ఇది.భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు ముందుగా అంచనావెయ్యడం కొంతమందికే సాధ్యం,ముఖ్యంగా రచయితలకి.యండమూరి ఆ విషయంలో పరాకాష్టకు చేరుకున్నారిందులో ఉదాహరణకు సోలార్ శాటిలైట్.ఇంకో 100 ఏండ్లు పోయినా సాంకేతికత ఎలా మారినా ప్రేమ ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా చేసుకొని వ్రాసిన అపురూపమైన నవల ఇది.           మంచినవల:ఉన్న పరిస్థితులు ఉన్నట్టు వ్రాసి పాఠకుడి ఆలోచన్లని విస్తృతం చేయడం ద్వారా నిర్దుష్టమైన అభిప్రాయాల్ని కలుగజేసేది మంచినవల.                                              నవల:మనిషి జీవితంలో అనుభవాలకి అందమైన అల్లికే నవల....యండమూరి                     విశ్వనాథ సత్యనారాయణ,జంధ్యాలపాపయ్య శాస్త్రి,దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత గొప్ప కవులో స్మరించుకుంటారు.                                  గోదావరి నది వర్ణించడం విషయానికి వస్తే కవి విశ్వరూపం కనిపిస్తుంది.తెలుగు భాషలో రచయిత వాడే కొన్నిపదాలు నిఘంటువు చూసి తెలుసుకోవాల్సిందే,కొన్నింటి అర్ధం వివరిస్తుంటారు.పల్లెటూరిని వర్ణిస్తుంటే అటువంటి ఊర్లలో కొంత కాలం గడుపుదామనిపిస్తుంది.                          "భూదేవి కొత్త పెళ్లికూతురయితే బంతిపూలు పసుపు!మిరప పంట కుంకుమా!" ఎంత చక్కని పోలిక.సాహిత్యమన్నా,గతకాలపు కవుల కావ్యాలన్నా రచయితకి ప్రాణం.వారి పేర్లను, వారి పద్య,గద్యాలను సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావించకుండా ఉండరు.సంక్రాంతికి పల్లె ఎలా ఉంటుందో చదివి తీరవలసిందే.        *"అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్పవేదం లేదు".ఆణిముత్యం లాంటి మాట. పద్యాలంటే రచయితకు చాలా ఇష్టం.మనం చదవని, మరిచిన,కావ్యాల్లోని పద్యాలను పరిచయం చేస్తూ తన్మయత్వం చెందుతూ మనల్ని పరవశించి పోయేలా చేస్తారు.ఇక స్త్రీని వర్ణించడం లో ప్రబంధకవులైన కాళిదాసు,ముక్కుతిమ్మన,శ్రీనాధుడు,అల్లసాని పెద్దనల కే మాత్రం తీసిపోని శైలిలో మనకర్ధమయ్యే వచనంలో వ్రాస్తారు.     మందాకిని పాత్రను అత్యద్బుతంగా మలిచిన తీరు తెలుగు నవలా చరిత్రలో కలికుతురాయి.అలాంటి వ్యక్తి ఒకరయినా జీవితంలో సరయిన దశలో మార్గదర్శకత్వం చేస్తే  ప్రతివ్యక్తి జీవితం మారిపోతుంది. సోమయాజితో పలికించిన పద్యం రచయిత వ్రాసిన అద్భుత మైన పద్యం.కార్తెలను వర్ణిస్తూ మందాకిని వ్రాసుకున్న డైరీ లో ప్రకృతిలో మనం కలిసిపోవాలని పిస్తుంది.మరిచి పోతున్న తెలుగు భాష ,సంస్కృతిమీద తీవ్రమైన ఇష్టం పుట్టించే నవల ఇది.గుండెను వీణ మీటినట్లు మీటిన నవల ఆనందోబ్రహ్మ.                         "వేదాంతమే ఋష్యత్వమైతే ఆనందమే బ్రహ్మత్వం".యండమూరి                                                             ......ఒద్దుల రవిశేఖర్.

Thursday 29 April 2021

ప్రేమ....యండమూరి

            పల్లెను వర్ణించాలంటే మాటలు చాలవు.వేప చెట్టు వేదం చదవడం,కొబ్బరాకులు నీటిలో జల తరంగిణులు మ్రోగించడం తో మొదలవుతుంది రచయిత పద విన్యాసం." వేదసంహిత"ను సృష్టిస్తూ బ్రహ్మ ఆమెను గురించి శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు అక్షరాలను విరజిమ్ముతుంటే మనకు విభ్రమం కలుగుతుంది. ,మోహనరాగం,బిలహరి గురించి లోతుగా తెలుసుకుని మరీ మనకు వివరిస్తారిందులో.ఆంథ్రోపాలజీ గురించి పాఠకుడికి వివరంగా పరిచయం చేస్తూ ఇది ప్రేమ పై ఆధారపడి ఉందని చెప్పిస్తూ నవల యొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తారు.ఊరు మేల్కోవడాన్ని కన్నులకు కట్టినట్లు వ్రాస్తారు.పనిచేసే వారు పాడే పాటల్లోని అంత రార్ధాన్ని కూలంకషంగా వివరిస్తారు. "పొద్దున్నే ఊరు మేల్కొవటం ఓ పాటైతే మేల్కొన్న తోటను చూడటం ఒక కావ్యం.ప్రేమ ,పైరును పోల్చడం ఆసక్తికరం.ఆంత్రోపాలజీ ప్రేమ చుట్టూ కోట కట్టి అందులో ప్రేమను బంధించింది అని చెబుతూ మనుషులు ఎందుకు ప్రేమ రాహిత్యంగా,ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వివరించిన తర్కం బాగుంది."ప్రేమించడానికి హృదయం ఉండాలి.ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి" ప్రేమంటే స్త్రీ పురుషుల మధ్య శారీరక ఆకర్షణ వల్ల కలిగే సంపర్కం మాత్రమే కాదు,విశ్వాన్నీ,ప్రకృతిని,సాటి మనిషిని ప్రేమించడం అని చెప్పడం ద్వారా ప్రేమకు సంపూర్ణ నిర్వచనం ఇచ్చారు.                                                            చరిత్ర చదివిన వారికే సరిగా ఈ అపాచీ కల్చర్(red indians) గురించి తెలీదు.సరిగ్గా ఈ విషయాన్ని తన "ప్రేమ" కు ఇరుసుగా మలచుకున్నారు యండమూరి.పోలీస్ ఆఫీసర్,అపాచీ నాయకుడి మధ్య సంభాషణలు సినిమాగా తీస్తే కళ్ళప్పగించి చూస్తాం."కోరిక యొక్క సాంద్రతని కొలిచే సాధనాలు ఇంకా ఈ ప్రపంచం లో కనుగొనబడలేదు." "ద్వేషం స్థానం లో ప్రేమను నింపండి.నవ్వును ప్రేమించండి." చక్కటి సందేశాలు."కన్నీటి చుక్కకి చాలా విలువుంది.ఇతరుల కష్టాల్ని చూసి అది స్రవించాలే కానీ,మన గురించి కాదు".గొప్ప సహానుభూతిని చూపే భావం. " సాటి మనిషికి చేయి అందిస్తే ప్రపంచమంతా సుఖ శాంతులతో వర్ధిల్లుతుందనే నమ్మకమే విశ్వ జనీనమైన ప్రేమ"అన్న వాక్యాల ద్వారా ప్రేమలోని విశ్వ వ్యాప్త భావనను ఆవిష్కరించారు. "ప్రేమకి పునాది నమ్మకమయితే పై కప్పు భద్రత".                                               పిల్లలాడే ఆటల్లోని అర్ధాలు వివరిస్తారు.ప్రకృతి ని వర్ణించడం లో యండమూరి తర్వాతే ఎవరయినా అనిపిస్తుంది."ప్రకృతి ని ప్రేమించడమే అన్నిటికన్నా గొప్ప".ప్రేమించు --ప్రేమను పొందు అన్న ఆలోచనా స్రవంతే సంక్రాంతి.ఇక 5 రోజుల పెళ్లిళ్లు ఎలా చేస్తారో చదవ వలసిందే.మనం మరచిన మన సంప్రదాయాలన్నీ గుర్తు చేస్తారు."మట్టినీ, మేఘాన్ని, మొక్కనీ ప్రేమించ లేని వాడు ప్రపంచం లో దేనినీ ప్రేమించలేడు.   అచ్చ తెలుగు సంస్కృతి నిండిన ఓ పల్లె గురించి వ్రాసిన విధానాన్ని ప్రతి తెలుగువాడు చదవాలి.ఇక తెలుగు భాషలోని గొప్పదనాన్ని వివరిస్తూ పద్యాలు మన భాషకు ఎలా తలమానికమో ఛందస్సు అలంకారాలు మనకే ఎలా ప్రత్యేకమో వివరించడం తెలుగు భాషపై మనకు మరింత మక్కువని పెంచేలా చేస్తాయి.ఆంధ్ర ,తెలంగాణ,రాయలసీమ నేపధ్యాలుగా కవి చెప్పిన గేయాలు హృదయాన్ని హత్తుకుంటాయి.తనను ఉరితీయబోయిన కార్టిస్ ను తన రక్తం ఇచ్చి రక్షించబోయిన అభిషేక్ పాత్ర ద్వారా ప్రేమ విశ్వరూపాన్ని చూపారు." మీకీ ప్రపంచం లో అయిష్టమైన దేదీ లేదా అన్న ప్రశ్నకు .....యండమూరి పలికించిన జవాబు ఏ తత్వ వేత్త చెప్పిన దానికి తీసిపోదు.ఈ ఒక్క జవాబు ఆయన్ను నవలా శిఖరాగ్రాన నిలబెడుతుంది."ప్రేమంటే సౌందర్యం,సౌందర్యమంటే ఆనందం." ఉప్పెన లో సముద్రం లో ప్రేయసీ ప్రియులు గడిపే దృశ్యం ఇందులో చదివి ప్రభావితమైనట్లుగా ఉంది.అద్భుతమైన ఈ వర్ణన ఉప్పెన సినిమాలో ఆవిష్కృతమైంది.ఓ మహాత్మాగాంధీ, ఓ నెల్సన్ మండేలా,ఓ మార్టిన్ లూధ ర్ కింగ్,ఓ ఆంగ్ సాన్ సూకీ లా అభిషేక్ ని అపాచీల కోసం పోరాటం చేసే నాయకుడిగా నిలపటం విశ్వ జనీనమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం....ఒద్దుల రవిశేఖర్.

Wednesday 1 July 2020

సాధారణత్వం

(Free translation for an American poem by Ravi sekhar Oddula).                                               అసాధారణ జీవితం కోసం శ్రమపడమని మీ పిల్లలకు చెప్పకండి.                                                                          ఆ ప్రయత్నం చూడటానికి ఆరాధనీయంగా ఉండవచ్చు కానీ అది మూర్ఖత్వానికి దారి.                                                 వారికి సాధారణ జీవితం లోని    అద్భుతాలను,ఆశ్చర్యకరమైన అనుభవాలను పరిచయం చేయండి.                                          టమాటా,జామ,రేగు వంటి పండ్లరుచులను ఆస్వాదించనీయండి                                                పెంపుడు జంతువులు ,మనుషులు చనిపోతే ఎలా స్పందించాలో(ఏడ్వాలో) చూపండి.                                          చేతి స్పర్శలో వచ్చే అనంతమైన సంతోషాన్ని వారికి చెప్పండి.      సాధారణంగా వారిని జీవించనియ్యండి.            అసాధారణమైనది తన పని తాను చూసుకుంటుంది...........స్వేచ్చానువాదం ఒద్దుల రవిశేఖర్.(కవి పేరు దొరకలేదు.వారికి ధన్యవాదాలు)

Friday 29 May 2020

భూమిపై ఆరో వినాశనాన్ని ఆపేద్దాం.

భూమిపై ఆరో వినాశనాన్ని ఆపేద్దాం.                                       భూమిపై జీవ వైవిధ్యాన్ని ,సమృద్ధిని కాపాడటానికి  A Global deal for nature(GDN) అనే science policy  ని 19 మంది అంతర్జాతీయ పరిశోధకులు రూపొందించారు.రానున్న ఆరోవినాశ నాన్ని తప్పించేందుకు 7 లక్షలకోట్లు అవసరమవుతాయి అని ఈ విధానం చెబుతుంది.2015 పారిస్ ఒప్పందం తర్వాత,భూవినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే.ఇది భావితరాలకు మనం ఇవ్వబోయే ఆటగిపెద్ద బహుమతి ఈ విధానం.

Wednesday 20 May 2020

సాయి అభయారణ్యం

http://www.saisanctuary.com/                 SAI(SAVING ANIMALS INITIATIVE) ఇండియాలో మొట్టమొదటి Private wildlife sanctuary.                          మనం మొక్కలు నాటితే సంతోషపడతాం,అవి పెరిగి పెద్దయి చెట్లయితే మరింత ఆనందిస్తాం.మన ఆలోచనలు అంతవరకే ఉంటాయి.కానీ అమెరికాలో స్థిరపడ్డ అనిల్.కె.మల్హోత్రావి ఆలోచనలు ఏకంగా ఓ అభయారణ్యాన్ని సృష్టించేలా చేశాయి.1986 లో ఇండియా వచ్చాక కర్ణాటకలోని కొడగు జిల్లాలో 300 ఎకరాలు భూమి కొన్నారు.ఆయన భార్య పమేలా,పర్యావరణ ప్రేమికురాలు తారాచందర్ మరికొంతమంది ఆయనకు సహకరించారు.అందులో 700 సం క్రితం చెట్టు ఓ ప్రత్యేకం.300 రకాల పక్షులు,పునుగు పిల్లులు,పులులు,ఏనుగులు జింకలు ఇలా వందలాది జీవరాసులున్నాయి.ఇందులో రెండు cottages నిర్మించి యాత్రికులను ఆహ్వానిస్తున్నారు.వాటిద్వారా వచ్చే డబ్బుతో ఆ అరణ్యాన్ని నిర్వహిస్తున్నారు.మనం ఓ సారి వెళ్లి చూసొద్దామా!ప్రసిద్ద కంపెనీలు CSR (Corporate social responsibility)క్రింద ఇటువంటి అరణ్యాలను సృష్టించవచ్చు.