మన ప్రవర్తన ఇతరులతో మన సంభందాలద్వారా వ్యక్తమవుతుంటుంది .మన ఇంట్లో, మన బంధువులతో మనస్నేహితులతో ,మన ఉద్యోగం లోని సహచరులతో మరియు ఇతర వ్యక్తులతో మనం ఏవిధంగా వ్యవహరిస్తున్నాము అన్న దాన్ని నిరంతరం పరిశీలించు కుంటూ వుంటే మనకు మన ప్రవర్తన అద్దంలా కనపడుతుంది.మరి ఈ పరిశీలనకు ప్రతిరోజు మనం కొంత సమయం కేటాయించాలి.అదే విధముగా విభిన్న పరిస్థితు లకు మన స్పందనలు కూడా మన వ్యక్తిత్వాన్నినిర్ణయిస్తాయి.మరి ఈ మొత్తం ప్రక్రియను మనం ఎలా పరిశీలించాలి.మన మనసుతోనే ఈ పని అంతా జరగాలి.అంటే మనం మనసు చేసిన పనులన్నింటిని దానితోనే పరిశీలించాలి.
ఇది ఎలా సాధ్యం .తనఫై తనే విచారణ చేపట్టాలి.మన కోర్ట్ లాగా .ఈ విచారణ లో మనమే న్యాయవాది, న్యాయమూర్తి , ఆరోపించేది,ఆరోపించ బడేది.అన్ని మనమయి విచారణ జరగాలి .ఇది సాద్యమా !సాధ్యమే కాని దీనికి మనల్ని మనం నిరంతరం మెరుగు పరుచుకుంటూ ఉన్నత మయిన జీవితం గడపాలనే కోరిక వుండాలి.
అప్పుడు ఎవరికి వారికే తమ ప్రవర్తన లోని లోపాలు స్పష్టంగా అర్థమవుతాయి.మనం ఎన్నో పుస్తకాలు ,మరెన్నో ఉపన్యాసాలు ఎంతమందో వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాము .మంచి విషయాలు తెలుసుకున్న ప్రతిసారి ఉత్తేజం పొందుతాము.కాని రోజులు గడిచేకొద్దీ మరల మన మామూలు జీవితం లో వుండి పోతాము.
దీనికి కారణం మనం ఎప్పుడు ఫైన చెప్పిన ప్రక్రియకు సమయము కేటాయించక పోవటమే.మరి ఈ దిశలో ఆలోచిద్దామా !