Tuesday, 13 January 2026

ఐ న్ స్టీన్ జీవితం కృషి

 ఐ న్ స్టీన్  జీవితం కృషి 

రచయిత్రి :కేతరిన్ ఓవెన్స్ పియర్ 

అనువాదం :బెల్లంకొండ రాఘవరావు 

మానవులు స్వతః ఒకరి నొకరు ద్వేషించుకోరని నా విశ్వాసం. ఎవరేనా పని కట్టుకుని ప్రేరేపిస్తే తప్ప, ప్రజలు అందరితోటి సామరస్యంతో సుఖంగా బ్రతుకుతారు.. Einstein 

   అన్ని యుగాల లోని ప్రపంచం లోని మహోన్నతులయిన పద్నాలుగు మంది విజ్ఞాన శిఖామణుల శిలా ప్రతిమ లను న్యూయార్క్ లోని రివర్ సైడ్ చర్చి ప్రాంగణం లో ప్రతిష్టించారు. అందులో ఒక ప్రతిమ Einstein ది. ఆయనను కోపర్నికస్, న్యూటన్ తో పోల్చి ప్రస్తావించేవారు.

ఇందులో ఆయన బాల్యం లో పాఠశాల లో ఎదుర్కొన్న ఇబ్బందులు, చిన్న ఉద్యోగం నుండి ఆచార్య పదవికి ఎదిగిన తీరు జర్మనీ లో ప్రాణ భయం తో బ్రతికిన తీరు, పలు దేశాల్లో ఆయన పొందిన గౌరవాలు, హిట్లర్ విజృంభణ తో ఇతర దేశాల్లో తల దాచుకున్న తీరు ఇన్ని సమస్య ల మధ్య ఆయన సాధించిన విజయాలు, ప్రయోగ శాల లేకుండా తన మేధస్సు తో సాపేక్ష సిద్దాంతాన్ని ప్రచురించి నోబుల్ బహుమతిని పొందిన విధం, ప్రపంచ శాంతి కొరకు ఆయన ప్రయత్నాలు, ఆయన పరిశోధనలు వంటి ఎన్నో అంశాలు సామాన్యులకు కూడా అర్థం చేసుకొనే రీతిలో రాయబడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పని సరిగా చదువ వలసిన పుస్తకం.... ఒద్దుల రవిశేఖర్