ఊరు ముంగిట రైలు గేటు, దాన్ని అనుకొని ఊరికి వడ్డాణంలా చిన్న చెరువు ఉంటుంది. మొదట్లోనే నారాయణ వనం ఆహ్వానిస్తుంటుంది. పచ్చని చెట్ల మధ్య ఓ భవంతి.పండ్ల తోట, ఆవులు దర్శన మిస్తుంటాయి.అందులో ఆదర్శ దంపతులు సాయి బాబు, గీత గార్లు నివసిస్తూ శివానంద స్వామి శిష్యులు గా ఉంటూ ఆయన పేరుతో సేవాభావం తో ఓ పాఠశాల నిర్వహిస్తున్నారు.పాఠశాల పచ్చని పర్ణశాల. అందులో PGNF సహకారం తో Robotics work shop జరుగుతుంటే వచ్చాను.
ఊర్లో 4 గుడులు ఉన్నాయి. ఊరి మధ్యలో ఉన్న గుడి విశాలంగా ఉంది. దాదాపు 10,000 జనాభా ఉంటుందట. పొగాకు, శనగ జామాయిల్ పంటలు వేస్తుంటారు. బోర్ల తో వ్యవసాయం లేదు. సముద్రం దగ్గర్లో ఉండటం తో బోర్ వేస్తే ఉప్పు నీళ్లు పడతాయట. గుండ్ల కమ్మ నుండి వచ్చే నీరు రామతీర్ధంలో ఆగుతాయి. అవే వీరికి మంచి నీరు.
ఈ ఊరికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది అంటారు. ఇదో బ్రాహ్మణ అగ్రహారమట. శర్మ గారని ఒక ఆయన గ్రామ పెద్దగా ఉంటూ 3000 ఎకరాలు కలిగి ఉండే వారట.ఇప్పుడు వారికి పొలాలేమీ లేవట. వీళ్ళు ఊరి ఖాళీ చేసి వెళ్ళారట ఆయన మనుమరాలే సినిమా నటి కాంచన.
శివానంద పాఠశాల వ్యవస్థాపకులు సాయిబాబు గారు Airforce లో పనిచేసి retire అయ్యి స్వంత గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకొని మిత్రుల సహకారం తో పాఠశాల స్థాపించారు. దంపతులిద్దరు పాఠశాలను విలువలు, ఆదర్సా లతో నడుపుతున్నారు.చెట్ల పై, గోవులపై వారికున్న మక్కువ వారి ఇల్లు, పాఠశాల చూస్తే అర్థమవుతుంది. ఒక లేగ దూడను కుక్కలనుండి రక్షణ కోసం వారి ఇంట్లో ఉంచారు. సాయిబాబు గారి నాన్న గారు ఆయుర్వేద వైద్యులు. వారి పూర్వీకులు 10 తరాలనుండి అదే వృత్తి లో ఉన్నారట. వారి అన్నలు, అన్న కొడుకు హైదరాబాద్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు గా కొనసాగుతున్నారు. వీరి గురువు గారయిన శివానంద స్వామి వారికి హిమాలయాల్లోని ఋషికేష్ లో ఆశ్రమం ఉన్నదట. కరవది చుట్టు ప్రక్కల ఊర్లలో 600 మంది శిష్యులు ఉన్నారట. ఒకప్పుడు కరవది లో వేదాలు, ఉపనిషత్ లు అభ్యసించే వారట.ఒక విశేష ప్రాధాన్యమున్న ఊరిని సందర్శించి నందుకు చాలా సంతోషం కలిగింది...... ఒద్దుల రవిశేఖర్
No comments:
Post a Comment