Sunday, 23 November 2025

భగత్ సింగ్

 పుస్తకం :భయమెరుగని ధీరుడు భగత్ సింగ్  రచయిత :కోడూరి శ్రీరామ మూర్తి

24 సంవత్సరాల చిన్న వయసులో స్వాతంత్ర్య సముపార్జన కోసం విప్లవ పంధాలో పోరాడుతూఉరి తీయబడ్డ దేశభక్తుడు భగత్ సింగ్. 1930 లలో గాంధీజీ తో సమానంగా దేశప్రజల గుండెల్లో చోటుచేసుకున్న విప్లవ వీరుడు.ఎన్నో గొప్ప పుస్తకాలు చదివి వాటిని అర్థం చేసుకున్న మేధావి. తనకు నచ్చిన విషయాలు తన Notebook లో వ్రాసుకున్నాడు. Victor Hugo, రూసో ల పుస్తకాల ద్వారా  ప్రేరణ పొందారు.జైలు జీవితం అంతా విపరీతంగా పుస్తకాలు చదువుతూ తన అభిప్రాయాలను వ్యాసాల రూపంలో తెలియబరి చారు. జైలులో ఉన్నప్పుడు ఖైదీల సమస్యలపై భగత్ సింగ్ చేసిన నిరాహార దీక్ష కు దేశమంతా కదిలిపోయింది."ఇంక్విలాబ్ జిందాబాద్ " అనే నినాద రూప కర్త. దేశ స్వాతంత్ర్యం కోసం మృత్యువును చిరునవ్వు తో ఆహ్వానించిన ధీరుడు భగత్ సింగ్. వారి త్యాగాల పునాదుల మీద నిలబడ్డ భారతదేశం వారి ఆశయాల సాధనకు అంకితం కావాలి.

*పుట్టిన ప్రతివాడు మరణించవలసిందే, అయితే ఆ మరణం గొప్ప మరణంలా ఉండాలి. మనం ఎంతకాలం బ్రతికాం అన్నది ముఖ్యం కాదు. మనం మనిషిగా ఎంతకాలం జీవించాం అన్నది ముఖ్యం 

*మేం జీవితాన్ని ప్రేమిస్తాం 

మరణాన్నీ ప్రేమిస్తాం 

మేం మరణించి ఎర్ర పూల వనంలో

పూలై పూస్తాం

నిప్పు రవ్వల మీద నిదురిస్తాం

                      - భగత్ సింగ్

No comments:

Post a Comment