Sunday, 23 November 2025

ఆచార్య N.G రంగా

 స్వాతంత్ర్యం కోసం (రంగా ఆత్మ కథ)

ప్రముఖ  స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య N. G. రంగా గారు

ఆంగ్లంలో రచించిన Fight for freedom అనే పుస్తకానికి జక్కంపూడి సీతారామారావుగారి తెలుగు అనువాదం ఇది.

స్వాతంత్ర్య కాలం నాటి విశేషాలు తెలుసుకోవాలి అన్న ఆసక్తి

ఉన్న వాళ్లకు ఈ పుస్తకం బాగా నచ్చు తుంది. గాంధీ గారి

అనుచరునిగా,విధానాల పరంగా నెహ్రూ ను వ్యతిరేకించిన

నాయకునిగా కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ ల

వ్యవస్థాపకునిగా ప్రసిద్ధులు.

జీవితాంతం రైతులు, కార్మికుల కోసం అహర్నిశలు

శ్రమించిన నాయకులు. ఎన్నో దేశాలు తిరిగి ప్రపంచ స్థాయి

నాయకులతో పరిచయాలున్న వారు. మద్రాస్ ఉప ముఖ్యమంత్రి,

కేంద్ర మంత్రి పదవులను తిరస్కరించారు. పిల్లలు ఉంటే స్వార్ధం

ఏర్పడుతుంది అని వద్దనుకున్నారు. వీరు ఆంగ్లం లో 35

, తెలుగు లో 6 పుస్తకాలు రచించారు.జీవితం చివరి వరకు

నిస్వార్ధంగా జీవించిన నిజాయితీ పరుడు, అసలు సిసలు

గాంథేయ వాది ఆచార్య N. G. రంగా గారు.

భగత్ సింగ్

 పుస్తకం :భయమెరుగని ధీరుడు భగత్ సింగ్  రచయిత :కోడూరి శ్రీరామ మూర్తి

24 సంవత్సరాల చిన్న వయసులో స్వాతంత్ర్య సముపార్జన కోసం విప్లవ పంధాలో పోరాడుతూఉరి తీయబడ్డ దేశభక్తుడు భగత్ సింగ్. 1930 లలో గాంధీజీ తో సమానంగా దేశప్రజల గుండెల్లో చోటుచేసుకున్న విప్లవ వీరుడు.ఎన్నో గొప్ప పుస్తకాలు చదివి వాటిని అర్థం చేసుకున్న మేధావి. తనకు నచ్చిన విషయాలు తన Notebook లో వ్రాసుకున్నాడు. Victor Hugo, రూసో ల పుస్తకాల ద్వారా  ప్రేరణ పొందారు.జైలు జీవితం అంతా విపరీతంగా పుస్తకాలు చదువుతూ తన అభిప్రాయాలను వ్యాసాల రూపంలో తెలియబరి చారు. జైలులో ఉన్నప్పుడు ఖైదీల సమస్యలపై భగత్ సింగ్ చేసిన నిరాహార దీక్ష కు దేశమంతా కదిలిపోయింది."ఇంక్విలాబ్ జిందాబాద్ " అనే నినాద రూప కర్త. దేశ స్వాతంత్ర్యం కోసం మృత్యువును చిరునవ్వు తో ఆహ్వానించిన ధీరుడు భగత్ సింగ్. వారి త్యాగాల పునాదుల మీద నిలబడ్డ భారతదేశం వారి ఆశయాల సాధనకు అంకితం కావాలి.

*పుట్టిన ప్రతివాడు మరణించవలసిందే, అయితే ఆ మరణం గొప్ప మరణంలా ఉండాలి. మనం ఎంతకాలం బ్రతికాం అన్నది ముఖ్యం కాదు. మనం మనిషిగా ఎంతకాలం జీవించాం అన్నది ముఖ్యం 

*మేం జీవితాన్ని ప్రేమిస్తాం 

మరణాన్నీ ప్రేమిస్తాం 

మేం మరణించి ఎర్ర పూల వనంలో

పూలై పూస్తాం

నిప్పు రవ్వల మీద నిదురిస్తాం

                      - భగత్ సింగ్