సన్మానాలు
దండలు,శాలువాలు బదులు
మొక్కలు పుస్తకాలు ఇద్దాం
ప్రస్తుతం సన్మానం ఏదయినా శాలువాలు, దండలు ఉండాల్సిందే!retire అయిన వారు జరుపుకునే functions కి ఇక చెప్పాల్సిన పని లేదు. August 15,September 5,January 26 ఇలా ఏ సందర్భంగా awards గెలుచుకున్నా ఇక శాలువాల,దండలు తప్పని సరి. రెండూ పునర్వినియోగించేవి కావు, దండలు అయితే కొద్ది సేపటికే అక్కడే వదిలేస్తారు,శాలువాలు అయితే ఇంటికి తీసుకెళ్లి బీరువాలో పెడతారు.మళ్ళీ వాటిని ఉపయోగించరు.
ఇలా కాకుండా ఇంకేదైయినా మంచి సన్మానం ఉందా! అక్కడక్కడా ఈ పాటికే అటువంటి సన్మానాలు చేస్తున్నారు.APNGC meetings లో అయితే మొక్కలు ఇస్తారు. కొన్ని సాహిత్య సమావేశాల్లో పుస్తకాలు ఇస్తారు. మరి అన్ని సన్మానాలకు మొక్కలు లేదా పుస్తకాలు ఇస్తే బాగుంటుంది కదా! మొక్కలు ప్రకృతి పరిరక్షణకు,పుస్తకాలు జ్ఞానసముపార్జనకు పనికి వస్తాయి కదా!
సన్మానం ఘనంగా చేయాలి అనుకుంటే పెద్ద మొక్కలు, గ్రంధాలు ఇవ్వవచ్చు. గుర్తుగా ఒక జ్ఞాపికను ఇచ్చుకోవచ్చు.పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమాజంలో చదివే అలవాటు అభివృద్ధి అవుతుంది. అలాగే మొక్కలు నాటే సంస్కృతి పెరుగుతుంది.
ప్రభుత్వమే రాబోయే september 5 న ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానాల నుండే ఇలా చేయొచ్చు. తరువాత వారికి పాఠశాల స్థాయిలో మొక్కలు,పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారిని అభినందించవచ్చు.ఏదయినా ఒక మంచి ఎక్కడో ఒకచోట మొదలు కావాలి.
ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులు,రాజకీయ నాయకులు, నూతనంగా పదవులు పొందే వారు ఇలా మొక్కలు పుస్తకాలు ఇవ్వడం మొదలు పెడితే సామాన్య ప్రజలు కూడా ఈ అలవాటును ఆచరిస్తారు. కనుక ఈ దిశగా సమాజం అంతా ఆలోచిస్తుందని, మొదటగా ఉపాధ్యాయులుగా మనం ఇందుకు మార్గదర్శకులుగా ఉందామని కోరుకుంటున్నాను
ఒద్దుల రవిశేఖర్
No comments:
Post a Comment