కృష్ణా నది ఉరవళ్లతో డాం నిండి గేట్లు ఎత్తివేశారని తెలిసి శ్రీశైలం వెళ్ళాము.దారంట నల్లమల అడవి వర్షాలకు మనోహరంగా కనిపిస్తుంటే చూస్తూ వెళ్ళాము.పోగానే పర్యాటక సందర్శన బస్ ఎక్కి బయలుదేరాము.పాలధార పంచదార దగ్గర శంకరాచార్యుడు తపస్సు చేసాడంటారు.అక్కడ జలధార ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియదు.తరువాత శిఖరం చూసుకుని ఆనకట్ట దగ్గరికి వెళ్ళాము,రెండు కళ్ళు చాలలేదు ఆ ప్రవాహాన్ని చూడటానికి.6 గేట్లు ఎత్తారు.డాం ఉపరితలం లో గుఱ్ఱపుడెక్క నిండి ఉంది.ప్రవాహం అంతెత్తునుండి పడి పాము పడగ విప్పి పైకి లేచినట్లు లేచి మరల పడుతూ వెండి మబ్బుల్లా తెల్లని నురగను వ్యాపింప చేస్తుంటే మనసు ఆనందం తో పరవశించింది. అక్కడ ప్రవాహాన్ని చూడటానికి ఒక భద్రమైన ఏర్పాటు చేసి ఉంటే బాగుండు. కెమెరా నిండా ఆ దృశ్యాలను బంధించి మళ్లీ శ్రీశైలం చేరుకుని గుడి సందర్శనకు వెళ్ళాము,జనం లేకపోవటం తో త్వరగా దర్శనం పూర్తయింది.గుడికి దక్షిణం వైపు అందమైన రంగులతో రంగవల్లిక లద్దారు. తరువాత పాతాలగంగ చూడటానికి మెట్లు దిగుతూ వెళ్ళాము.ఆనకట్ట వెనుకగా చూస్తే నిండుకుండలా ప్రశాంతంగా ఉంది.అక్కడ కొండలపై కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి.కెమెరాతో వాటిని బంధించి రోప్ వే ద్వారా తిరుగు ప్రయాణం అయ్యాము.తప్పకుండా రోప్ వే ఎక్కండి, మంచి అనుభూతి ,అక్కడనుండి మరిన్ని ఫొటోస్ తీసాము.బస్ ఎక్కి తిరుగు ప్రయాణం అయ్యాయి.express bus tickets పల్లెవెలుగు కన్నా రెట్టింపు కన్నా ఎక్కువున్నాయి.ఏదేమైనా ఒక్కరోజు ప్రయాణం లో ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకొని వచ్చాము.ఈ క్రింది చిత్రాలన్నీ అక్కడివే.
good afternoon
ReplyDeleteits a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/
nice siteseeing
ReplyDeletehttps://goo.gl/Ag4XhH
plz watch our channel