Thursday, 2 February 2017

బ్లాగులు :ఒక సమీక్ష
                        మన మది లోని భావాలను స్వేచ్చగా వ్యక్తీరించటానికి బ్లాగులు మంచి సాధనంగా ఉపయోగపడేవి . అప్పుడు ఎంతో మంది మిత్రులు పరిచయ మయ్యారు . ఒకరి పోస్టులు మరొకరు చదువుతూ చాలా ప్రొత్సాహక రమైన మాటలతో వ్యాఖ్యలు వ్రాస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్లాగులు ఉండేవి .తరువాత ఫేస్బుక్ బాగా ప్రాచుర్యం పొందిన తరువాత అందరు దానిలో సభ్యులు కావటం తో అక్కడే ఎక్కువగా గడుపుతూ బ్లాగుల్లో వ్రాయటం తగ్గించారు.నేను కూడా అంతే.దీని తరువాత దీనికంటే ప్రభావం కల్గించింది వాట్సాప్.ఇక జనం అంతా వ్యక్తిగతంగా గ్రూపుల్లో ఒకటే ముచ్చట్లు.దీనితో కొంత ఫేస్బుక్ ప్రభావం తగ్గటం తో గమనించిన ఫేస్బుక్ యాజమాన్యం వాట్సాప్ ను కొనేసింది.
           ఇక వాట్సాప్ లో గ్రూపుల్లో ఎన్నో సమస్యలు అడ్మిన్ ఒక ఉద్దేశ్యం తో గ్రూపు ప్రారంభిస్తే  పోస్టులు ఎవరి ఇష్టం వఛ్చినట్లు వారు వ్రాయటం చాలా గొడవలు జరగటం చాలా గ్రూపులు మూసివేయటం జరిగాయి .ఫొటోస్ ,వీడియో లు విపరీతం గా షేర్ చేసుకోవటం ఎంతో మందికి చికాకు తెప్పిస్తుంది .అడ్మిన్స్ ఎంత మొత్తు కున్నా వినే వారు లేరు అంతా చదువుకున్న వారే,మరి అర్థం చేసుకోరు ఎందుకో. రిలయన్స్ ఫ్రీ డేటా ఉండటం వ లన  ఇన్ని గ్రూపులు ఉన్నాయి గాని రేపు డబ్బులు వసూలు చేస్తే చూడాలి ఎంత మంది వాట్సాప్ లో ఉంటారో!
         బ్లాగు మిత్రులందరికీ మనవి ,అందరు మరల రండి బ్లాగు వేదికగా మన ఆలోచనలు అభిరుచులు కలబోసుకుందాము.      

11 comments:

  1. ఇప్పుడు అంత సమయం ఉండటం లేదండి. ఒకటో రెండో లైన్లు ఫేసుబుక్కు లోనో వాట్సప్పులోనో వ్రాయడం అవుతోంది. చాలా విషయాలున్నాయి వ్రాయడానికి ఎప్పుడో కూర్చోవాలి.

    ReplyDelete
    Replies
    1. Thanks satyasaigaru,రాయాలనుకోండి.అదే మొదలవుతుంది.

      Delete
  2. రవిగారు...నా మనసులోని మాటలకు మీరు అక్షరరూపం ఇచ్చారు ఈ పోస్ట్ లో. నా మట్టుకు నాకు బ్లాగ్ పదిలంగా అల్లుకున్న పొదరిల్లులాంటిది. ఫేస్ బుక్ అద్దె ఇంట్లో ఉన్న ఫీల్ కలిగిస్తుంది. చూడాలి మీ పోస్ట్ చదివి ఎంతమంది సొంతగూటికి వచ్చి చేరుతారో.

    ReplyDelete
  3. నిజం పద్మార్పిత గారు,మీ భావనే నాది కూడా,మరల అందరినీ ఆహ్వానిద్దాం.ధన్యవాదాలు మీ ప్రోత్సాకర స్పందనకు

    ReplyDelete
  4. బ్లాగ్ వెలుగులు మరోమారు విరజిమ్మాలని కోరుకునే వారిలో నేను ఉన్నాను.

    ReplyDelete
    Replies
    1. Thanks Amruthavalli garu.మీరు మొదలు పెట్టండి

      Delete
    2. Amruthavalli garu,మీ బ్లాగు లింక్ ఇవ్వండి.

      Delete
  5. సాహిత్య ప్రియులకు మంచివేదిక బ్లాగ్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. మొద లెట్టండి మరి

      Delete
  6. మహానందం
    బ్లాగ్ పండితులు పెద్దవారంతా తిరిగి విచ్చేస్తున్నారు :)

    ReplyDelete
    Replies
    1. అందరం బ్లాగరులమే నండి,ధన్యవాదాలు.

      Delete