నిత్య జీవితంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము.వాటి వలన మన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి.ఇక మన మిత్రుల దగ్గర,బంధువుల దగ్గర ప్రయాణాల్లో మన వైన అభిప్రాయాలు చెబుతూ వెళతాము.అవతలి వారికి అవి నచ్చితే సరి,నచ్చక పోతే వాతావరణం వేడెక్కుతుంది.సంభాషణలో ఎవరి అభిప్రాయాలు వారివి.కాని వాస్తవం లో ఏమి జరుగుతుంది అంటే మన మనసు మనకు నచ్చిన అంశాలనే ఇష్ట పడుతుంది నచ్చని వాటిపట్ల వ్యతిరేకతను ఏర్పరుచుకుంటుంది.అది క్రమంగా ఆ వ్యక్తుల పట్ల వ్యతిరేకంగా మారు తుంది .విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవటం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. క్రమంగా నచ్చే మాటలు మాటలు మాట్లాడే వ్యక్తులతో మాత్రమే మనం ఒక సమూహం లో ఏర్పడి ఒకరికి ఇంకొకరు నచ్చేలా మాట్లాడు కుంటూ కాల క్షేపం చేస్తుంటాము.విషయాలు తెలుసుకోవాలనే తపన తగ్గి పోయి మనం అనుకున్నదే సరిఅయినది అనే మిత్ర బృందంతో మాత్రమే జీవితం గడుపుతూ ఉంటాము .దీనితో జీవితం లో సత్యాలు తెలుసుకునే మార్గాలు మూసు కుంటాము.ఏ విషయంలో నైనా వాస్తవాలు ఏమిటి,సత్యం ఏమిటి అని తరచి చూసుకోగలిగితే సరిపోతుంది.మనం నమ్మినవి మాత్రమే సత్యాలు అనుకుంటే ఎన్నో విషయాలు తెలుసు కాకుండానే ఈ జీవితం ముగిసి పోతుంది. విభిన్న అభిప్రాయాలను గౌరవిద్దాము,అందులో సత్య మెంతో తరచి చూద్దాము.
బాగాచెప్పారండి
ReplyDeletewelcome ,thank you prerana garu
ReplyDelete