Thursday 6 March 2014

మార్కాపూర్ లో Readersclub( పాఠకుల సమాఖ్య) ప్రారంభం

             మార్కాపూర్ శాఖా గ్రంధాలయంలో 5/2/14 న "readersclub" ప్రధమ సమావేశం సజ్జా మధుసూధన రావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయటం జరిగింది.దాదాపు 20 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు.
                   దీని ప్రారంభానికి నేపధ్యం గత సంవత్సరం ఇదే బ్లాగ్ లో "పుస్తకాలే మన నేస్తాలయితే "అన్న వ్యాసం వ్రాయటం జరిగింది.ఈ వ్యాసానికి ప్రతిస్పందనగా "శర్కరి "బ్లాగ్ ను నిర్వహిస్తున్న జ్యోతిర్మయిగారు ఒక వ్యాఖ్య వ్రాశారు .ఆమె మాటల్లోనే  
"నాకు అమెరికాలో నచ్చిన మంచి విషయాల్లో ఇది ఒకటి. పిల్లలకు మాటలు కూడా రాని సమయం నుండే పిల్లలకు పుస్తకం చదివి వినిపిస్తారు. ఇక బడికి వెళ్ళడం మొదలుపెట్టినప్పటినుండి రోజుకు కనీసం 20 నిముషాలు పుస్తకం చదవాలి. కొంచెం పెద్దయ్యాక తరగతిలో వాళ్ళు చదివిన పుస్తక౦పై చర్చలు జరుగుతాయి. ఇవి కాక లైబ్రరీలు ప్రతి వేసవిలో 20 పుస్తకాలు చదివిన వారికి ఓ పుస్తకం బహుమతిగా ఇస్తుంది. ఇలా చిన్నతనం నుండే పుస్తకం చదవడం జీవితంలో ఓ భాగంగా మారుతుంది."
       ఈ వ్యాఖ్య చూసిన తరువాత ఈ విషయాన్ని మార్కాపూర్ గ్రంధ పాలకుడు సజ్జా మధుసూదనరావు గారికి చెప్పగా అయన వెంటనే స్పందించి గత వేసవిలో ఈ పోటీలు ఏర్పాటు చేసారు.కొద్ది మంది పిల్లలే హాజరయినా నెల రోజులు ఉత్సాహంగా వచ్చిపుస్తకాలు  చదివారు. తరువాత వారికి బహుమతులు పంపిణీ చేసారు.ఆ సమయంలో మాట వరసకు మధుసూదన్ గారు ఇక్కడకూడా readersclub  ఉంటుంది అని చెప్పటంతో దానిని బలోపేతం చేద్దామని నిర్ణయించటం జరిగింది.ఇప్పటికి అది కార్యరూపం లోకి వచ్చింది .
               ఈ సమావేశానికి వచ్చిన వారికి readersclub గురించి మధుసూదన్ రావు గారు వివరించారు .దాని ఉద్దేశ్యాలను,లక్ష్యాలను నేను (రవిశేఖర్ ) వివరించాను.ముఖ్యంగా పుస్తకాలు చదివే వారిని ప్రోత్సాహించటం ఇందుకు సమాజానికి గ్రంధాలయానికి అనుసంధానం గా పనిచెయ్యాలి అని నిర్ణయించటం జరిగింది.తరువాత హాజరయిన వారు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు .అందరి అభిప్రాయాలతో వచ్చే నెల సమావేశానికి అజెండా నిర్ణయించటం జరిగింది.ప్రతినెల మొదటి ఆదివారం ఉదయం 11. 00 గంటలనుండి 12. 00 గంటల వరకు సమావేశం జరపాలని నిర్ణయించటం జరిగింది.2/3/14 న సమావేశం ఉంటుందని అందులో పుస్తక సమీక్ష,కరపత్రం తయారీ,పిల్లల పుస్తకాలను సర్దటం అన్న అంశాలను నిర్వహించాలని నిర్ణయించారు.పుస్తక సమీక్షకు మల్లిఖార్జున గారు అంగీకరించారు.readersclub అనే పేరు కాకుండా పాఠకుల సమాఖ్యగా దీనికి పేరు పెట్టాలని అందరు ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ కార్యక్రమంలో ఆనంద్,మల్లిఖార్జున,చాంద్ భాషా ,ముసలారెడ్డి ,వీరారెడ్డి ,నాగశ్రీ ,తోట

శ్రీనివాస రావు ,అరుణ్ కిశోర్,ఆదినారాయణ సుబ్బారావు,అక్బర్ అలీ పాల్గొన్నారు .

3 comments:

  1. ఎక్కడైనా ఒక చెడు జరిగితే వందమంది ఖండిస్తారు( మాటల్లోనే చేతల్లో ఏమీ ఉండదు) కాని ఒక మంచి పనిని అభినందించే వాళ్ళు అది నచ్చి ఆచరించే వాళ్ళ.సంఖ్య చాలా తక్కువ. చెడును వదిలి మంచిని ప్రోత్సహించగలిగినప్పుడు మాత్రమె సమాజం ప్రగతి మార్గంలో నడుస్తుంది.

    ఎప్పుడో కామెంట్ లో వ్రాసినది గుర్తు పెట్టుకుని ఆచరణలో పెట్టిన మీ కార్యదీక్షతకు అభినందనలు రవి శేఖర్ గారు. మీలాంటి వారు నేటి సమాజానికి యంతో అవసరం.

    ReplyDelete
  2. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు!ప్రపంచం లో ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించటం వీలయినవి ఆచరించటం
    ఎక్కడో ఒకచోట అడుగు పడాలి కదా!

    ReplyDelete
  3. అన్నా మీ ఆలోచన చాల మంచిది .చాల మంచి విషయం తెలియ జేశారు thanks.

    ReplyDelete