Sunday, 17 September 2023

30. పాటల పూదోట

 

"ఆనందం"సినిమా పేరు విన్నారా ఈ పాట ప్రత్యేకత సగం పాట గాయకుడు పాడాక మిగతా సగం గాయని పాడుతుంది. సిరివెన్నెల చిలికిన చిక్కని తెలుగు పదాల సౌరభాన్ని దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతం తో మరింత గుబాళింప చేసాడు.ప్రతాప్ చిత్రల స్వరాల్లో చిత్రంగా పలికిన ఈ గీతం ఈ వారాంతం మీ కోసం.(https://youtu.be/pN8g9Mp-a_4)

29. పాటల పూదోట

 

సిరివెన్నెల పాటల్లో ఆణిముత్యం ఈ పాట. కెవి మహదేవన్ స్వర కల్పనలో బాలు, సుశీల పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. విశ్వనాధ్ దర్శకత్వం లో వచ్చిన  " సిరివెన్నెల" చిత్రం లోని పాటలన్నీ అజరామరం.(https://youtu.be/dfOYIXOclTg)

28.పాటల పూదోట

 

https://youtu.be/vbz_BVTiozE ) శివ compose చేయగా సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట  ఒకే టెంపో లో సాగుతూ మన హృదయాలను మీటుతుంది, వినండి ఈ weekend.

27. పాటల పూదోట

 

https://youtu.be/rGX1Ch6OyUs(https://youtu.be/rGX1Ch6OyUs )"వరాహరూపం" పాట విన్నారా, origional song సన్నాయి మీద సాగితే ఇందులో వేణువు, గిటార్ modern music touch చేస్తూ అనూప్ శంకర్ చేసిన విభిన్నప్రయోగం,వినండి మరి.)

26. పాటల పూదోట

 

తెలుగులో ఈ పాట వినే వుంటారు. "తెలుసా మనసా ". మరి హిందీలో కుమార్ సాను,అల్కా యాగ్నిక్ గొంతుల్లో పలికిన ఈ గంధర్వగానా న్ని earphones పెట్టుకుని కళ్ళు మూసుకుని వినండి. కీరవాణి పాటల్లో ఇది అత్యద్భుతమైన melody.(https://youtu.be/nqTS7ngviwQ)

25. పాటల పూదోట

 

Bombay (Mumbai) సినిమా చూసారా, మణిరత్నం master piece.రెహమాన్ స్వరపరిచిన ఈ గీతం హరిహరన్, కవితా కృష్ణమూర్తి పాడారు. Earphone పెట్టుకుని, కళ్ళుమూసుకుని వినండి.సంగీత ప్రపంచపు సరిహద్దుల్లోకి వెడతారు. ఈ weekend మీకోసం.Tu Hi Re (Bombay / Soundtrack Version)(https://youtu.be/P4NwOb39sTQ)

24. పాటల పూదోట

 

https://youtu.be/kP9oPI5791A
నజీర్ స్వరంలో విలక్షణంగా సాగిన ఈ గీతాన్ని థామస్ స్వరపరిచారు.కృష్ణ కాంత్ తన కలం తో విరజిమ్మిన ఈ తేట తెనుగు గీతం వినండి.

23.పాటల పూదోట

 

భూమికి పచ్చని చీర కట్టినట్టున్న,పర్వత పరిసరాల్లో అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ స్వరాల్లో రెహమాన్ పలికించిన మరో melodious master piece తాల్ సినిమా లోని ఈ గీతం. హిందీ అర్ధమైతే మరింత బాగుంటుంది. ఈ వారాంతం మీ కోసం. (https://youtu.be/OinGHNpnGtc)

22. పాటల పూదోట

 

మణిరత్నం దర్శకత్వం వహించిన రత్నం లాంటి సినిమా "గీతాంజలి " చూసారా, మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఆ చిత్రానికి మకుటాయమానం. ప్రకృతి ని పలకరిస్తూ బాలు పాడిన ఈ గీతం లో లీనమై పోండి.(https://youtu.be/vyH7ow2C4Zw)

21. పాటల పూదోట

 

అచ్చ తెనుగు పదాల సోయగం చిత్ర స్వరం లో జాలువారే ఈ "దేవరాగాన్ని " వినండి.(https://youtu.be/16nIvB_CbTE)

20. పాటల పూదోట

 

బాలు, శైలజ స్వరాల్లో వచ్చిన అజరామరమైన ఈ గీతాన్ని వేటూరి వ్రాయగా ఇళయరాజా సంగీతం అందించారు. కేవలం earphone పెట్టుకుని పాట మాత్రమే వినండి. తరువాత పాటని చూస్తూ వినండి. బాలు గాత్రం కమల్ హాసన్ అభినయం కళ్ళు చెమర్చేలా చేస్తాయి. ఈ వారం మీ కోసం ఈ గీతం.(https://youtu.be/ya6fkjJcvD4)

19. పాటల పూదోట

 

కృష్ణవంశీ "అంతఃపురం"చూసారా చిత్ర పాడిన పాటల్లో మకుటా యమానం ఇది.ఇళయరాజా స్వరకల్పనలో సిరివెన్నెల కురిపించిన వెన్నెల ఈ గీతం.(https://youtu.be/drgfr9WHVfA)

18.పాటల పూదోట

 

Gulzar కలం నుండి జాలువారగా రెహమాన్ సృష్టించిన మేఘాలను వర్షపు జల్లుగా మనపై శ్రేయా ఘోషల్ కురిపించిన ఈ గీతం మీకోసం (https://youtu.be/xj_OHHWcPNw)

17.పాటల పూదోట

 

https://youtu.be/qBZoM-6qu38)    దేవరాగం (శిశిరకాలం) అభిజిత్ వేణుగానంలో విని ఈ ఉషోదయానికి స్వాగతం పలకండి.

16.పాటల పూదోట

 

మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన గీతాంజలి పాటలు యువత ను కట్టి పడేసాయి ఇళయరాజా సృజించిన ఈ పాట బాలు జానకి ల స్వరం లో పలికిన ఓంకారం.(https://youtu.be/NMPlZrSl144)

15.పాటల పూదోట

 

రామ్ గోపాల్ వర్మ "రంగీలా "చూసారా!సురేష్ వాడ్కర్, కవితా కృష్ణ మూర్తి ల గొంతులో మంద్రంగా సాగే ఈ గీతానికి "రెహమాన్ "సంగీతం". పాట లో చరణాలు ఆగిన తరువాత  రెహమాన్ తన ప్రతిభ ను పతాక స్థాయికి తీసుకు వెడతారు. దాన్ని earphones తోనే వినాలి.(https://youtu.be/w7yE8XOE2vM)

14. పాటల పూదోట

 

థమన్ సంగీతం లో వచ్చిన ఓ మలయ సమీరం ఈ మందారం. శ్రేయా ఘోషల్ స్వరంలో మంద్రంగా పలికిన ఈ గీతం మీ కోసం (https://youtu.be/Zo5kxK4j2qY)

13.పాటల పూదోట

 "సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.

తమిళ్

1)(https://youtu.be/bDorKQg8Uyc?si=XIbfC9h8Pde_XuYt)

తెలుగు 2)https://youtu.be/XvBZx0Hauw0?si=D-K6Gly-3qAmF8yh

12.పాటల పూదోట

 "సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.1)Tamil (https://youtu.be/bDorKQg8Uyc?si=-mpHbIq0d6rX12Hr)

2)Telugu (https://youtu.be/XvBZx0Hauw0?si=g1uadzh_89Ojuh9K)

11. పాటల పూదోట

 ప్రభాస్ "రాధే శ్యామ్ " చూసారా, సినిమా సరిగా ఆడకున్నా అందులోని పాటలన్నీ బాగుంటాయి. మిథున్ సంగీతం ఈ పాటలో మన హృదయవీణ ను కొనగోటితో మీటుతుంది .ఆర్జిత్ సింగ్ ఈ పాటకు ప్రాణం పోసాడు.(https://youtu.be/inwnVerWbJo?si=MCPpCBL-l-2KBfIr)