Saturday, 9 September 2023

11.పాటల పూదోట

 నేను ఐష్టంగా వినే పాటలు 

(https://youtu.be/WcYBoOuqG90) తేనియ లాంటి తేట తెనుగు లో సిరివెన్నెల కురిపించిన ఈ కమ్మని గీతాన్ని చిత్ర తన గొంతులో అమృతాన్ని కలిపి పాడింది. శోభా శంకర్ జత కలువగా ప్రకృతి ని తన సంగీతంతో ముడి వేసి రెహమాన్ అందించిన దృశ్య కావ్యం విని తరించండి.

Friday, 8 September 2023

10. పాటల పూదోట

 

మిక్కీ జె మేయర్ versatail composer అనుకున్నంత పేరు రాలేదు కాని. శ్యాం సింగరా య్ ఆయన సృజన. ఈ గీతాన్ని చైత్ర అనురాగ్ కులకర్ణి గానం చేశారు.ప్రకృతి ని సంగీతంలో కలిపి వీనుల విందు చేసిన ఈ గీతాన్ని earphone తో వింటూ చూడండి.(https://youtu.be/rTW7Yb5eRxA)

9. పాటల పూదోట

 సిద్ శ్రీ రామ్ తో ప్రసన్న చేసిన మరో ప్రయోగం ఈ గీతం. శ్రీరామ్ గొంతులో ఎన్ని variations ఉన్నాయో అన్నీ పలికించాడు. అలలై లేచి మెరుపై మెరిసి మన ఎదలో అలజడి లేపుతుంది ఈ సంగీతం. Ear phones పెట్టుకుని, కళ్ళుమూసుకొని వింటే ఎన్ని రకాల instruments వాడారో ఆశ్చర్య మేస్తుంది. చూస్తూ మరోసారి వినండి. జనని కూడా సిద్ తో పోటీ పడింది. ఈ వారం మీ కోసం.(https://youtu.be/t60uDwyxzWQ)

8. పాటల పూదోట

 గోవింద్ సరళ మైన సంగీతానికి ప్రదీప్ గళం మనల్ని ఆలోచింప చేస్తుంది. ఒంటరి తనం నుండి....... ఏకాంతం లోకి ప్రయాణం. సాహిత్యాన్ని అర్ధం చేసుకుంటూ వినండి. ఒంటరి గా వస్తాం ఒంటరిగానే వెడతాం నడుమ జరిగేదంతా మనసుకు పట్టించుకోకుండా ఏకాంత స్థితి లోకి వెళ్ళడానికి ప్రకృతి... సంగీతాన్ని తోడు చేయాలి.(https://youtu.be/2a34XyiZO14)

7. పాటల పూదోట

 

కాలభైరవ అనే singer ఉన్నాడని ఈ పాట విన్నాకే తెలిసింది.ఇంత వరకు వినని అదో ప్రత్యేక స్వరం.భావోద్వేగాలు,ఆవేదన,ఆర్థ్రత తన గళం నుండి జాలువారుతుంటే మనమూ అందులో లీనమౌతాం. సుద్దాల అశోక్ తేజ గీతానికి కీరవాణి సంగీతం మనల్ని కట్టిపడేస్తుంది. పాట చూస్తూ ఒక సారి, చూడకుండా ear phones తో మరో సారి వినండి. నిన్న ప్రకటించిన జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ గాయకుడు అవార్డు కాలభైరవ నే వరించింది.(https://youtu.be/2VmgpHUld8o?si=jjJp1fxdG_WR0L1m)

మంచి -చెడు

 మంచి, చెడులను బుద్ధి విశ్లేషి స్తుంది.కాని ఒక్కోసారి అది చెడును మంచిగా మంచిని చెడుగా పొరబడుతుంది.తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.                                     

చెడును మంచిగా పొరబడినప్పుడు తీవ్ర వేదన నష్టం కలుగుతాయి. మంచిని చెడుగా భావిస్తే మరపురాని గాయమై జీవితాంతం బాధిస్తుంది. ఒద్దుల రవిశేఖర్ 

6.పాటల పూదోట

 

మణిరత్నం "PS 1" సినిమా చూసారా. అందులో రెహమాన్ స్వరపరచిన గీతం "అంతర నంది"గొంతులో నుండి ప్రవహిస్తూ మన హృదయాన్ని తాకుతుంది. ఆ పాటను సముద్రం నేపథ్యంలో ఒక దృశ్య కావ్యం గా మలిచారు మణిరత్నం.(https://youtu.be/bh6et8Ko200)

5)పాటల పూదోట

 

పాట వినడం కూడా ఓ కళే అనేలా చేసిన సంగీత మాంత్రికుడు రెహమాన్. శోభా శంకర్ పాడిన ఈ గీతం headphones పెట్టుకొని వినండి. Background లో రెహమాన్ వాడే instruments మనసు కెంత హాయినిస్తాయో తెలుస్తుంది. ఈ weekend song వినండి మరి.(https://youtu.be/_16dW-ohq54)

4)పాటల పూదోట

 RHTDM సినిమా లోని ఈ Rain theme song ని కరణ్ బీర్ remix చేసిన తీరు superb. Ladies chorus తో పాటు బీట్ mix అవుతూ thrill చేస్తూ ఉంటే flute add అవడం తో మరింత melodious గా మారింది.earphone తో కళ్ళు మూసుకుని వినడం మరువకండి. (https://youtu.be/5maPVXz2Czk?si=y6jGchldzTW-QhD7)

3)పాటల పూదోట

 

ప్రకృతిలో గడపటం, సంగీతం వినడం  మనసుకు ఒత్తిడి తగ్గించే దివ్యఔషధా లు.హృదయం సినిమాలో Hesham స్వరపరచిన ఈ గీతాన్ని విమల్,భద్ర మనల్ని అడవిలో ఉన్నామా అని feel అయ్యేలా పాడారు.మనోజ్ఞ మైన అడవి అందాలు సెలయేటి గలగలలు చూపు తిప్పు కోనివ్వవు. English subtitles చూస్తూ పాటను అర్థం చేసుకోండి.(https://youtu.be/lZL2K3ewRYM)

2) పాటల పూదోట


ప్రపంచ ధరిత్రీ దినోత్సవ సందర్భంగా అత్య ద్భుతమైన జయరాజ్ సాహిత్యం, మోహన్ అందించిన చక్కని సంగీతం,విజయ్ ఏసుదాస్(జేసుదాస్ కుమారుడు) అమృత స్వరంలో జాలువారిన ఈ 23 నిముషాల దీర్ఘ గీతాన్ని save చేసుకుని వినండి. మానవ జీవిత తాత్వికతను రంగరించి మనపై వెదచల్లిన పుప్పొడి పరిమళం ఈ గానం వినండి మరి.(https://youtu.be/j1Z0u4SkdwQ?si=yjOuOSB2CB3xD5XA)

Wednesday, 6 September 2023

1)పాటల పూదోట


మానసిక ప్రశాంతత కు, ఆరోగ్యానికి సంగీతం ఉపకరిస్తుందని తెలిసిందే." నడక " లో మంచి పాటలు వింటుంటే ఆ అనుభూతే వేరు. అలాగే ఒంటరి తనాన్నుండి తప్పించు కోవాలన్నా సంగీతమే దివ్య ఔషధం.విభిన్న మైన పరిమళాలు విరబూసే సంగీతం వినడం అలవాటు చేసుకోండి. దైనందిన జీవిత సమస్యలనుండి కాస్త ఉపశమనం పొందండి

చిత్రం :వందేమాతరం 

పాడటం మొదలెట్టాక stage పై నేను పాడిన మొట్ట మొదటి పాట ఇది.ఈ సినిమా విడుదల కాకముందే Nellore లో శ్రీనివాస్ గారు law చేస్తూ ఉండేవారు. మేము ఆయన ఉండే room పైన ఉండేవాళ్ళం.అప్పుడే ఆయన పాటలు record చేసుకొని practice చేస్తూ ఉండే వాళ్ళు."వందేమాతరం" శ్రీనివాస్ స్వీయ సంగీతం లో ఆయనే పాడిన అర్థవంతమైన గీతం,డా. సినారె రచన.రాజశేఖర్ కి మొదటి సినిమా అనుకుంటా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టినట్లు సినారె వ్రాసిన ఈ పాటను కృష్ణ గారు చక్కగా చిత్రించారు. వందేమాతరం లోని ప్రతి వాక్యానికి అప్పటి పరిస్థితులను అన్వ యించి వ్రాయగా శ్రీనివాస్ తనదైన గంభీరమైన విలక్షణ మైన గొంతుతో అద్భుతం గా పాడారు. అప్పటినుండి ఆయనకు "వందేమాతరం శ్రీనివాస్ అనే పేరు స్థిర పడింది."దర్శకుడు T. కృష్ణ. (https://youtu.be/DICYKmHXbl0?si=Zw5H-RLaolBghS1d)

Tuesday, 6 June 2023

ఆత్మహత్య లు వద్దు.

 NEET లో MBBS SEAT రాకున్నా, Biotechnology, Bioinformatics,Biomedical engineering వంటి మంచి ఉద్యోగ అవకాశాలున్న courses లో చేరవచ్చు.నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు.జీవితం విలువైనది.తల్లిదండ్రులారా పిల్లలపై మీ ఆశలను రుద్దవద్దు!వారికిష్టమున్న చదువులు చదవనీయండి,మంచి ర్యాంకులు రాకున్నా వారిని ఏమీ అనవద్దు.ఏదో ఒక రంగం లో వారు ఎదుగుతారు.మీ బిడ్డల ప్రాణాల కంటే చదువులు,ర్యాంకులు ఎక్కువేం కాదు కదా!ఈ విషయం తీవ్రంగా ఆలోచించండి.అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఇలా లేదు!డాక్టర్,ఇంజినీర్ కాకుంటే భూకంపాలేమీ రావు.మిగతా వారి విజయాలను మీ పిల్లలతో పోల్చవద్దు.ఇంటర్ తర్వాత విభిన్న రంగాలలో రాణించే అవకాశాలున్నాయి.విద్యార్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తలు,పౌరసమాజం,ప్రభుత్వాలు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోండి,పరిష్కార మార్గాలు ఆలోచించండి.చదువులు ఆనందాన్ని ఇవ్వాలిగాని ఆత్మహత్యలకు పురికొల్పకూడదు...................ఒద్దుల రవిశేఖర్

Saturday, 3 June 2023

ప్రపంచ సైకిల్ దినోత్సవం

 ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు

చిన్నప్పుడు మామయ్య వాడిన cycle ఉండేది. Cycle తొక్కేవాళ్ళని చూస్తే అది ఒక అద్భుతం గా అనిపించేది. పడిపోకుండా ఎలా తొక్కుతారా అనిపించేది.ఇంట్లో hero cycle చాలా ఎత్తుగా ఉండేది.6,7 తరగతుల్లో అనుకుంటా cycle నేర్చుకుందాం అని మిత్రుల సహకారం తో ప్రయత్నాలు మొదలెట్టాను. ఇద్దరు అటొకరు, ఇటొకరు పట్టుకుంటే కత్తెర తొక్కడం (seat పైన ఎక్కకుండా )అలవాటు చేసుకున్నా. క్రమంగా మిత్రులు పట్టు కోకున్నా తొక్కడం, balance చేసుకోవడం అలవాటయ్యింది. మరి seat ఎక్కి తొక్కాలికదా. మళ్ళీ మిత్రులు పట్టుకుంటే seat ఎక్కి కూర్చుని తొక్కుకుంటూ వెళ్లే వాన్ని ఆపాలంటే ఏదయినా చిన్న బ్రిడ్జి (mori) దగ్గరికెళ్లి దిగేవాన్ని. ఇక చివరి అంకం సొంతంగా seat ఎక్కడం ఇది నేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు. క్రింద పడటం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం...... ఇలా చివరికి cycle నేర్చే సుకున్నా. ఇహ 10 వతరగతి దోర్నాల చదివే రోజుల్లో రోజు వెళ్లి రావడం 16 km cycle తొక్కేవాడిని. తరువాత మార్కాపురం లో inter, చదివేటప్పుడు 2 సంవ త్స రాలు college కి cycle పై వెళ్లి వచ్చే వాళ్ళం నేను Jay కలిసి. ఇహ డిగ్రీ nellore సర్వో దయాలో చేరినప్పుడు cycle ప్రయాణమే.cycle పై nellore అంతా తిరిగే వాన్ని. ఇహ teacher గా మార్కాపురం లో చేరాక కూడా కొంత కాలం cycle వాడాను. ఇహ గత 6,7 ఏండ్ల నుండి ఆరోగ్యం కోసం cycle తొక్కడం చేస్తున్నాను. ఇలా cycle నా జీవితం లో విడదీయరాని భాగం అయింది. ఇహ cycle తొక్కడం వల్ల ప్రయోజనాలు ఇంకో post లో వ్రాస్తాను.... ఒద్దుల రవిశేఖర్ 

Wednesday, 31 May 2023

దేవనహళ్లికోట

 దేవనహళ్లి కోట (Devanahalli Fort):బెంగళూరు కు సమీపంలో ని 

చారిత్రక ప్రాధాన్యత ఉన్న దేవనహళ్లి కోట చూద్దామని jay అనగానే ఆసక్తిగా అనిపించి చూడ్డానికి బయలు దేరాం. కోట ప్రవేశ ద్వారం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కోట లోపలికెళ్లి చూస్తే ఎక్కడా కోట లాంటి నిర్మాణం కనపల్లేదు.అన్ని సాధారణ ఇల్లే కనిపించాయి. కాని కోట గోడ మాత్రమే విశాలం గా చాలా పొడవుగా నిర్మితమై ఉంది. అక్కడున్న వివరాల ప్రకారం 1501 లో మట్టి కోట గా మల్ల బెరే గౌడ కట్టారు.ఈయన బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ పూర్వీకుడు. ఈ మట్టికోట క్రమంగా చేతులు మారి 1749 లో హైదర్ అలీ చేతికి వచ్చింది. దీన్ని ఈయన పునర్నిర్మించాడు. ఈయన మైసూరు రాజు వడయార్ అశ్విక దళం లో పనిచేసే వారు. హైదర్ అలీ కొడుకే టిప్పుసుల్తాన్. దేవనహళ్లి లోనే టిప్పు సుల్తాన్ జన్మించారు. తరువాత మైసూర్ రాజ్యాన్ని హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరిపాలించారు.

             కోట గోడ పై  నడుస్తూ గమనిస్తే  వృత్తాకారంగా గోడ మాత్రమే ఉంది. గోడ కు ఒక వైపు పెద్ద చెరువు ఉంది. కోట గోడకు రక్షణ గా నిలిచే సైన్యం తుపాకులు ఎక్కుపెట్టడానికి గోడకు రంధ్రాలు చేశారు. ఒకే రంధ్రం గుండా 4 తుపాకులు ఎక్కుపెట్టేలా లోపల 4 వైపులా  4 చిన్నరంధ్రాలు చేశారు. ఫోటోలు చూస్తే మీకే అర్ధమవుతుంది. కోట గోడ నిర్మాణ శైలి. నంది hills ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నంది కొండలు టిప్పు సుల్తాన్ వేసవి విడిది గా ఉపయోగించుకునే వారట.


Wednesday, 17 May 2023

నందికొండలు (Nandi Hills) బెంగుళూరు సందర్శన.

 భానుడి భగ భగల నుండి కాస్తంత తప్పించు కోవటానికి బెంగుళూరు వెళ్లాను. ఆంధ్రా లో 45 C ఉంటే అక్కడ 34 C మాత్రమే ఉంది.ఇక దగ్గరిలో చూడదగ్గ ప్రాంతం ఏదయినా ఉందా అని ఆలోచిస్తే ఇంతకు ముందు మా అబ్బాయి స్నేహిత్ వాళ్ళ మిత్రులతో నంది కొండ (Nandi Hills ) చాలా బాగుంటుంది అని చెప్పాడు. మిత్రుడు Jay తో చెప్పగా ఆదివారం ఉదయాన్నే వెడదామన్నాడు. Car లో బయలు దేరాం. కొన్ని వందల cars, bikes లో అదేదో ఉత్సవాన్ని చూట్టానికన్నట్టు ఉదయం 4 గంటల నుండే బయలు దేరారు జనం.పైకి వెళ్ళడానికి రావడానికి ఒకటే దారి. వేరు వేరు గా ఉంటే ప్రజల కెంతో సౌకర్యం. Parking చేసి ticket కొనుక్కొని పైకి వెళ్ళగానే (కొద్దిగా కొండ ఎక్కాలి ) పలకరించాయి మంచు తుంపరలు. చల్లటి గాలి దట్టమైన పొగమంచు తెరలు కట్టి నట్లు, మంచు కరిగి టప్ టప్ శబ్దం చేస్తూ పెద్ద పెద్ద చినుకులు. మంచు తెరల మధ్య మనుషులు కనబడటం లేదు.అక్కడి వాతావరణాన్ని వచ్చిన వేలాది మంది తన్మ యత్వం చెందుతూ ఆస్వాది స్తుంటే ప్రకృతి మనిషి కెంత మంచి స్నేహితుడో అర్ధమవుతుంది.దీన్ని నందిహిల్స్ లేదా నంది దుర్గ్ అంటారు. టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా దీన్ని ఉపయోగించుకున్నాడు.ఇది బెంగుళూరు వాసులకు వారాంతపు విడిది గా మారింది.సిటీ నుండి 60km దూరంలో ఉంటుంది. చిక్ బళ్ళాపూర్ కు 10km దూరం లో ఉంటుంది.భూమికి 1478 మీ ఎత్తులో చిక్ బళ్ళాపూర్ జిల్లాలో (బెంగుళూరు.... హైదరాబాద్, అనంతపూర్ రూట్ లో )ఉంటుంది.చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి గాని చెప్పే guides ఎవరూ లేరు. జనం అంతా 6 గంటలకల్లా అక్కడకు చేరుకున్నారు సూర్యోదయం చూట్టానికి. వారి కోలాహలాన్ని enjoy చేస్తూ మేము ఎదురు చూస్తున్నాం. విపరీతమైన మంచు కురవడం వల్ల కాస్త ఆలస్యంగా సూర్యుడు మబ్బుల మాటున దోబూచులాడాడు.కేరింతలతో జనం ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తున్నారు.సూర్యోదయం అనంతరం కొండపై తిరుగుతూ 11 వ శతాబ్దం లో చోలుల కాలంలో నిర్మితమయిన 10 అడుగుల పొడవు,6 అడుగుల ఎత్తుగల నంది విగ్రహాన్ని చూసాం. అందుకే దీనికి నంది hills అని పేరు వచ్చిందేమో.ప్రక్కనే రాతి లో సహజంగా ఏర్పడ్డ గుహ చూసాం. దీన్ని బ్రహ్మా శ్రమం అంటారు. ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునే వారట.SAARC SUMMIT జరిగిన భవనాన్ని చూసాం చెట్ల కొమ్మల చాటున తొంగి చూస్తున్న సూర్యుడిని చూస్తూ మంచు దుప్పటిని కప్పుకున్న చెట్లను పలకరిస్తూ,ఆకుల స్పర్శ తో గాలి గాంధర్వమై వీస్తున్న వేళ... పరవశించిన కొమ్మలు రా రమ్మని ఆహ్వానిస్తున్న దృశ్య కావ్యాలను చదువుతూ తనివి తీరా ప్రకృతి లో పరవశించి పోయాం మార్గ మధ్యం లో ద్రాక్ష తోటను చూసాం. మంచి అనుభూతులను మూట గట్టుకుని తిరుగు పయనమయ్యాము..(https://www.thrillophilia.com/attractions/nandi-hills)(https://en.m.wikipedia.org/wiki/Nandi_Hills,_India)

Saturday, 15 April 2023

చరిత్ర శకలాలు.

 చరిత్ర శకలాలు

రచయిత :ఈమని శివనాగిరెడ్డి

పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్

చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరమే.ఏ చరిత్ర అయినా ఆ కాలం లో ఉన్నవారు పుస్తకం రూపం లో వ్రాస్తే అది చదివి మనం ఆయాకాలాలలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోమొదటి సారిగా 5500 సం. క్రితం మెసపటోమియా(ప్రస్తుత ఇరాక్ )లో లిపి వాడారు.అంటే క్రీస్తు పూర్వం 3500 సం నుండి మాత్రమే జరిగిన సంఘటనలను వ్రాయడానికి భాష మొదలయిందన్న మాట. అన్ని చోట్ల ఒకే సారి భాష అందుబాటులోకి రాలేదు. మన దేశం లో పరిపాలించిన రాజులు వేసిన శాసనాల ద్వారా అప్పటి విషయాలు తెలుస్తున్నాయి.ఇంకా వారు నిర్మించిన దేవాలయాలు,అప్పటి ప్రజలు వాడిన వస్తువులు,ఇలా ఎన్నో సాక్ష్యాలుగా సేకరించి ఆయా కాలాలలో ఏం జరిగిందో ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారు "చరిత్ర శకలాలు" అన్న పుస్తకం లో తెలుగువారి చరిత్రను వివరించారు. ప్రతి అంశం ఆధారాలతో సహా వ్రాసిన తీరు ఆకట్టుకుంటుంది. మన మనో ఫలకం పై ఆ కాలాలు ప్రత్యక్ష మవుతాయి.2000 సం. రాల క్రితమే శాతవాహన చక్రవర్తి తెలుగు నేలను ఏలిన దగ్గరనుండి,చైనాలో విశేష ప్రాచుర్యం ఉన్న జెన్ గురువు బోధి ధర్ముడు తెలుగు వాడేనని,74,000 ఏళ్ల క్రితం ఇండో నేషియా లోని తోబా అగ్ని పర్వతం పేలడం వలన ఎగజిమ్మిన లావా,బూడిద కర్నూల్ జిల్లా జ్వాలా పురం దాకా విస్తరించిందని అక్కడ ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు దొరికాయని,బుద్ధుని 'దంత 'పురం,తెలుంగాణపురం,తెలుగు నేలపై రోమన్ నాణాలు, చేజారిన కోహినూర్, నల్గొండ లో పడిన ఉల్కా శకలం, శ్రీశైల చరిత్ర ఇలా ఎన్నో ఆసక్తి గొలిపే చరిత్ర విషయాలు మనకు అందించిన తీరు ప్రశంస నీయం. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు చదువదగ్గ పుస్తకం ఈ "చరిత్ర శకలాలు ".

Thursday, 6 April 2023

దార్శనికుడు (Scientist గురించి )

 అతడు వర్తమానం లో చరిస్తున్న భవిష్యత్ దార్శనికుడు

సృష్టి రహస్యాల్ని ఛేదిస్తూ సాగే అలుపెరుగని యాత్రికుడు

అతడి చేతులు

దిగ్ దిగంతాలు దాటుకుంటూ

అనంతాకాశపు ఆవలి అంచును సైతం అంది పుచ్చుకోగలవు

అతడి చూపులు

సాగర గర్భాల్ని చీల్చుకుంటూ

పరమాణు కేంద్రకాల్ని పటాపంచలు చేసుకుంటూ చొచ్చుకు పోగలవు

అతడి అడుగులు నాటికల్ మైళ్లంత విస్త్రతంగా ఉందనుకునేంత లోనే

నానో మీటర్లా సూక్ష్మీకరించుకుంటూ కాంతి సం వత్సరం లా దూసుకుపోతాయి

అతడి హృదయం వయలిన్ తంత్రులకు లయబద్ధంగా ఓ వైపు స్పందిస్తూనే

మరో వైపు వైరస్ ల వైచిత్రి ని విశ్లేషిస్తూ జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది

అతడి మనసు నీతో నాతో సంచరిస్తూనే

సరికొత్త సంబంధాలను సృజించడం లో సంగమిస్తుంది

అనాది నుండి అతనొక నిరంతర శ్రామికుడు

నిత్య చైతన్య స్ఫూర్తి

మానవాళి సౌఖ్యం కోసం పరిశోధనే ప్రాణంగా

ప్రజ్వలిస్తున్న విజ్ఞాన వీచిక

అతడే ఓ కెప్లర్... ఓ జన్నర్...ఓ రామన్... ఎందరెందరో

 (ఆంధ్రప్రదేశ్ 9 వ తరగతి భౌతిక శాస్త్రము వెనుక అట్ట లోపలిభాగం లోని కవిత. రచయిత పేరు లేదు. వారికి ధన్యవాదాలు )


Wednesday, 5 April 2023

అమ్మ....నాన్న.....ఓ జీనియస్.


రచయిత :వేణు భగవాన్

పుస్తక పరిచయం : ఒద్దుల రవిశేఖర్

పిల్లల పెంపకం ఎప్పటికీ ఒక సవాలే. మన అమ్మా నాన్న మనల్ని పెంచినట్టు మన పిల్లల్ని పెంచుతామంటే కుదరదు.21 వ శతాబ్దపు parenting చాలా challenging గా ఉంటుంది. ఈ విషయం మీద ఈ పుస్తకం అంతా నడుస్తుంది. చక్కటి కొటేషన్స్ సేకరించి తనదైన అన్వయంతో ఒకటి, రెండు పేజీ లలోనే ఒక అంశాన్ని ముగించడం బాగుంది.ప్రస్తుత చదువులు, పిల్లలు ఎలా ఉన్నారో వివరిస్తూ ఈ పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోవాలంటే ఏ రకమైన నైపుణ్యాలు ఉండాలి అన్న విషయాలు విపులంగా చర్చించారు. కెరీర్ అంటే, విజయం అంటే చక్కని నిర్వచనాలు ఇచ్చారు.అర్థవంతమైన బొమ్మలతో (ven diagram ) కూడిన సమాచారం మరింత ఆకట్టుకుంటుంది.ఖలీల్ జీబ్రాన్ కవిత ఆలోచింపజేస్తుంది.ఇదంతా విషయ సూచిక. పుస్తకం మొత్తం 10 chapters గా వర్గీకరించారు. 1) పిల్లలు గొప్ప మానవులుగా ఎదగాలనుకుంటే! ఇందులో అబ్రహాం లింకన్ ఉత్తరం మనల్ని కదిలిస్తుంది. బాల్యాన్ని ఆట పాటలతో ఆనందంగా గడపాలంటాడు. ఆ స్వేచ్చ లోనే పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది మానవ వనరుల్లో అత్యంత విలువైనది అంటారు. పిల్లలకు ప్రశ్నించే హక్కు, కలలు కనే స్వేచ్ఛ ఉండాలంటారు 2)సరయిన విద్యాలయాలను ఎంచుకోండి.ఇందులో పిల్లలని ప్రశంసించాలని, ప్రతి శిశువు ఓ జీనియస్ అని చెబుతారు. స్టీవ్ జాబ్స్ కవిత భావి జీనియస్ లు ఎలా ఉంటారో చెబుతుంది. తెలివి తేటలు (multiple intelligences) 10 రకాలుగా ఉంటాయని హోవార్డ్ గార్డనర్ కనుగొన్నారు. పిల్లల్లో వాటిని కనుగొనాలంటారు. పిల్లల్లో 5 రకాల minds అభివృద్ధి చేయాలట.3)పిల్లల్ని ఎలా పెంచాలి?4) గొప్ప మానవులుగా తీర్చి దిద్దండి.5) పిల్లల హృదయాలను గెలవాలంటే? 6) సరయిన సంభాషణ 7) Family managment 8) స్ఫూర్తి కలిగించండి 9) character building 10) ఒత్తిడిని జయించండి 

ఇలా 10 విభిన్న మైన topic లతో తల్లిదండ్రులను ఆలోచింప జేసే విధంగా వ్రాయబడిన ఈ పుస్తకం ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా చదవదగ్గది.


Wednesday, 8 March 2023

కొండవీడు కోట


సెలవొస్తే ఏదయినా ప్రాంతం చూసే అవకాశమొస్తే వెళ్లడమే. అలా విజయవాడ వస్తావా అని ఆనంద్ అనగానే ఏంటి కార్యక్రమం అంటే మార్కాపురం ప్రాంతం లో 10 వ తరగతి విద్యార్థులకు అందించే "వాసవి club అమృతాహార సేవ " ను విజయవాడ వాసవి క్లబ్ వారు కూడా అక్కడ  కూడా అందించేందుకు వారిని motivate చేయడానికి అన్నాడు. సరే మంచిదే కదా!మధ్యాహ్నం వీలయితే భవానీ ద్వీపమో, కొండవీడు కోట గాని చూద్దా మనుకున్నాం.మధ్యాహ్నం meeting అయ్యాక 3:00 కల్లా విజయవాడ లో బయలు దేరాం. మిత్రుడు HM సుధాకర్ car నడుపుతుంటే నేను ఆనంద్, పిచ్చిరావు 5 గంటలకల్లా కోట పైకి చేరుకున్నాం.

కొండ పైకి 3 ఏళ్ల క్రితం తారు రోడ్డు వేశారు. మలుపులతో కూడిన ఘాట్ రోడ్డు. ఆ ప్రాంతమంతా అటవీశాఖ పరిధిలో ఉంది. కొండపైన చిన్న పార్క్ అభివృద్ధి చేశారు. లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్దరిస్తున్నారు. ప్రక్కనే చిన్న మసీదు ఉంది. దానికి ముందు అనవేమారెడ్డి విగ్రహం ఉంది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రక్కనే వేమన విగ్రహం ఉంది. వెనుకగా రంగసాని మంటపం ఉంది. అది ఎక్కి చూస్తే ఒక వైపు కోట గోడ కనిపిస్తుంది.14 వ శతాబ్దం లో రెడ్దిరాజులు అద్దంకి నుండి రాజధాని ని ఈ ప్రాంతానికి మార్చారు. ప్రోలయ వేమారెడ్డి దీనిని నిర్మించారు.1328 నుండి 1482 వరకు రెడ్డి రాజులు కొండవీడును రాజధాని గా చేసుకుని శ్రీశైలం నుండి సింహాచలం వరకు పరిపాలించారు. తరువాత గజపతులు, కృష్ణ దేవరాయలు(1516), కులీ కుతుబ్ షా (1579), ఫ్రెంచ్ వారు (1752), బ్రిటిష్ వారు (1788) వరుసగా ఈ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలించారు. గుంటూరు కు 16 km దూరం లో ఫిరంగి పురం దగ్గరిలో ఉంటుంది.భూమికి 1700 అడుగుల ఎత్తులో ఉంటాయి ఇక్కడి కొండలు. ఆంధ్రప్రదేశ్ TOURISM Department వారు ఇక్కడ resort లాగా అభివృద్ధి చేసి వసతి కల్పిస్తే చక్కటి పర్యాటక ప్రాంతమౌతుంది. అక్కడ గడిపింది కొద్దిసేపే అయినా "ఇచ్చోటనే కదా భూములేలు రాజన్యుల అధికార ముద్రలు అంతరించి పోయే. ... గుర్రం జాషువా పద్యం గుర్తుకు వచ్చింది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు రాజులు రాణులతో కళ కళ లాడుతూ ఉండి ఉంటుంది కదా, ఎన్నో యుద్దాలకు ఈ కోట గోడలు సాక్షీ భూతాలుగా నిలిచాయి కదా అనిపించింది.అంత గొప్ప కోట ఆనవాళ్లే మీ లేవు.

కొండకు దిగువన కొండవీడు museum ఉంది. అపురూపమైన చిత్రాలు, శిల్పాకళా సంపద ఇక్కడ భద్రపరిచారు. శ్రీశైలం రెడ్ల సత్రం వారు దీన్ని ఏర్పాటు చేశారు. కోట చూసి వచ్చిన తరువాత museum తప్పకుండా చూడండి.( https://en.m.wikipedia.org/wiki/Kondaveedu_Fort)

..........ఒద్దుల రవిశేఖర్.