*BIS* *వారి* *పరిశ్రమల* *సందర్శన* *యాత్ర* :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ వారు ఏర్పాటు చేసిన పరిశ్రమల సందర్శన లో భాగంగా ZPHS చెన్నారెడ్డి పల్లె విద్యార్థులు కడప జిల్లా బద్వేలుకు
సమీపంలోని సెంచరీ ప్లై వుడ్ కంపెనీ ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో BIS తరపున G. కిషోర్ గారు హాజరయ్యారు. మొదటగా పాఠశాల లో BIS కార్యక్రమాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ Y. శ్రీనివాస రావు,ఉపా ధ్యాయులు ఒ.వి. రవిశేఖర రెడ్డి( మెంటర్ BIS), ఒ.నరసింహారావు 8,9 వతరగతుల విద్యార్థులు 26 మంది తో కలిసి సెంచరీ కంపెనీ సందర్శనకు బయలు దేరారు. కంపెనీ యాజమాన్యం సా దరంగా ఆహ్వానించి, కంపెనీని త్రిప్పి చూపించి విద్యార్థులకు వివరించడానికి ఇద్దరు ఉద్యోగులను కేటాయించారు.సుబాబుల్,మామిడి కర్ర ను ఉపయోగించి ప్లై వుడ్ తయారు చేస్తారని చెప్పారు. అంతా ఆటోమేటిక్ మిషన్ ల ద్వారా జరుగుతుందని కర్ర ను ముక్కలయ్యే దశనుండి చివరకు ప్లై వుడ్ తయారయ్యేంతవరకు వివిధ దశలను చూపిస్తూ వివరించారు. అన్ని యంత్రాలను కంప్యూటర్ ద్వారా గమనిస్తుంటారు. విద్యార్థులు తమ సందేహాలను అడుగుతు చాలా ఆసక్తిగా కంపెనీ లోని అన్ని విషయాలను తెలుసుకున్నారు. యంత్రాల పని తీరు, నిర్వహణ విధానం, అయిన ఖర్చు ను తెలుసుకుని ఉత్పత్తి అయిన వుడ్ ను చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చక్కని ఆతిధ్యం ఇచ్చి విద్యార్థులకు అన్ని విషయాలను వివరించిన కంపెనీ యాజమాన్యానికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియ జేశారు.