దేవనహళ్లి కోట (Devanahalli Fort):బెంగళూరు కు సమీపంలో ని
చారిత్రక ప్రాధాన్యత ఉన్న దేవనహళ్లి కోట చూద్దామని jay అనగానే ఆసక్తిగా అనిపించి చూడ్డానికి బయలు దేరాం. కోట ప్రవేశ ద్వారం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కోట లోపలికెళ్లి చూస్తే ఎక్కడా కోట లాంటి నిర్మాణం కనపల్లేదు.అన్ని సాధారణ ఇల్లే కనిపించాయి. కాని కోట గోడ మాత్రమే విశాలం గా చాలా పొడవుగా నిర్మితమై ఉంది. అక్కడున్న వివరాల ప్రకారం 1501 లో మట్టి కోట గా మల్ల బెరే గౌడ కట్టారు.ఈయన బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ పూర్వీకుడు. ఈ మట్టికోట క్రమంగా చేతులు మారి 1749 లో హైదర్ అలీ చేతికి వచ్చింది. దీన్ని ఈయన పునర్నిర్మించాడు. ఈయన మైసూరు రాజు వడయార్ అశ్విక దళం లో పనిచేసే వారు. హైదర్ అలీ కొడుకే టిప్పుసుల్తాన్. దేవనహళ్లి లోనే టిప్పు సుల్తాన్ జన్మించారు. తరువాత మైసూర్ రాజ్యాన్ని హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరిపాలించారు.
కోట గోడ పై నడుస్తూ గమనిస్తే వృత్తాకారంగా గోడ మాత్రమే ఉంది. గోడ కు ఒక వైపు పెద్ద చెరువు ఉంది. కోట గోడకు రక్షణ గా నిలిచే సైన్యం తుపాకులు ఎక్కుపెట్టడానికి గోడకు రంధ్రాలు చేశారు. ఒకే రంధ్రం గుండా 4 తుపాకులు ఎక్కుపెట్టేలా లోపల 4 వైపులా 4 చిన్నరంధ్రాలు చేశారు. ఫోటోలు చూస్తే మీకే అర్ధమవుతుంది. కోట గోడ నిర్మాణ శైలి. నంది hills ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నంది కొండలు టిప్పు సుల్తాన్ వేసవి విడిది గా ఉపయోగించుకునే వారట.