ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే హృదయం పరవశిస్తుంది.ప్రకృతి అందాలకు మనసు మురిసిపోతుంది. పైరగాలి పాటకు ప్రాణం లేచి వస్తుంది.బోసినవ్వుల పసిపాపను చూస్తే అప్రయత్నంగా మన పెదవుల పై చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది. ఎవరయినా మనల్ని పలకరిస్తే ముఖం విప్పారుతుంది.ఏదయినా ప్రశ్న వేస్తే జవాబిస్తాం. అడగాలనిపిస్తే ప్రశ్నిస్తాం.హాస్యానికి నవ్వులతో హారతి పడతాం.క్లిష్టమైన సమస్యలకు తర్కాన్ని అన్వయిస్తాం. తోటివారు చూపే ప్రతిభా నైపుణ్యాలను అభినందిస్తాం. ఇలా ఎన్నో విధా లుగా ప్రతిస్పందిస్తుంటాం. ఇది మానవ సహజ లక్షణం. కానీ ప్రస్తుతం ఒక కొత్త తరహా మానసిక స్థితి ఏర్పడుతుంది. దేనికీ స్పందించకపోవటం. Online or offline మనకెందుకు లే అనే భావన. ఇది ప్రత్యక్ష సంభాషణల్లోను పరోక్ష social మీడియాలోనూ గమనించవచ్చు. FB లో చాలా మంది అసలు active గా ఉండరు. Active గా ఉన్నవాళ్లలో ఎక్కువ మంది ఒక paragraph అయినా చదవరు. చదివిన వారు స్పందించరు. ఇక whatsapp లో మరీను.256 మంది ఉన్న group లో ఏ కొద్ది మందో post లు పెడుతుంటారు. ఒక్కరు లేదా కనీసం ఇద్దరు కూడా స్పందించరు.ఇక చాలామంది వారికి ప్రత్యక్షంగా whatsapp కి పంపిన సమాచారానికి కూడా స్పందించరు. పంపేవారు కూడా అవసరం లేనివికూడా ఎక్కువ సందేశాలు పంపుతుంటారు.whatsapp ఓ రకంగా మనం మరిచిపోయిన ఉత్తరాలు వ్రాసుకోవడానికి ఆధునిక రూపం. ఏదయినా మాట్లాడు కుంటేనే మాటలు, స్నేహం కుదురుతుంది. స్పందిస్తుంటేనే మన మనస్తత్వం ఎదుటివారికి అర్ధమవుతుంది. Social media ను మనం ఇంతకుముందు వ్రాసిన ఉత్తరాలకు బదులుగా చక్కగా ఉపయోగించుకోవచ్చు.ఎంత మంచి విషయం post చేసినా కనీసమైన స్పందన ఉండటం లేదు.communication gap భయంకరం గా కనిపిస్తుంది. పరస్పర మానవ సంబంధాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎవరితో వివరంగా ఏదీ చెప్పరు. చెప్పినా దానికి సరిఅయిన సమాధానం ఇవ్వరు.ఇలా కుటుంబంలో,బయట స్పష్టత స్పందన కరువై ఎన్నో సమస్యలు సంక్లిష్టం గా మారుతున్నాయి.మానవ సంబంధాల పటిష్టతకు కనీసం ఒక ఫోన్ కాల్, లేదా ఒకసారి ఆత్మీయులను కలవడం చేయాలి. అవతలి వారి బాధలు వినాలి.సహానుభూతి(empathy )కలిగి ఉండాలి. స్పందించే గుణం కోల్పోతే సగం జీవితం కోల్పోయినట్లే..... ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment