స్నేహం /ప్రేమ

స్నేహం
                       స్నేహం  గురించి వివరించేముందు దీని అర్థమేమిటో తెలుసుకుందామా! స్నేహం అంటే స్నేహితుల మధ్య ఉండే సంబంధం.మరి స్నేహితుడంటే ? a person with whom one enjoys mutual affection and regard(exclusive of sexual or family bonds)ఫై అర్థము oxford dictionary లోనిది .దానిని స్వేచ్చానువాదము చేస్తే  పరస్పర ఇష్టము కలిగి వున్న ఇద్దరు వ్యక్తులు ఒకరి సమక్షము లో మరొకరు ఆనందముగా వుంటే వారు స్నేహితులని భావించవచ్చు.(ఈ ఆనందానికి శృంగారపరమయిన ,కుటుంబ బంధాలు కారణము కాకూడదు.)
            ఇప్పుడు వివరముగా స్నేహము గురించి చర్చిద్దామా!ఫైన చెప్పుకున్నట్లు నిఘంటువుల్లో మాదిరిగా ఇది మనుషుల మధ్యనేనా?కాదు .సృష్టిలో అన్ని జీవరాశుల్లో  కూడా స్నేహము వుంటుంది.ఒకే జాతి జంతువుల మధ్య విభిన్న జాతుల మధ్య మనం చూస్తూ ఉంటాము. ఆ లక్షణమే  మనకు వచ్చింది.మనము వాటినుండి వచ్చినవారమే కదా! మనిషి బాల్యము నుండి ఇతరులతో  సంబంధాలు కలిగివుంటాడు వాటిలో ఏ  సంబంధము అయితే తనకు ఇష్టమో ,ఎవ్వరి సమక్షము లో అయితే ఆనందము కలుగుతుందో వారితో ఎక్కువగా మాట్లాడటము  ,ఎక్కువసేపు గడపటం  చేస్తుంటాడు.దానికి ప్రాతిపదిక ఎలా ఏర్పడుతుంది.అవతలి మనిషి హావభావాలు ,మాట తీరు,అతని అభిప్రాయాలు,ఇష్టా ఇష్టాలు  వంటి రకరకాల కారణాలతో ఫై సంభందము ఏర్పడుతుంది.ఇది బాల్యములో ఏర్పడవవచ్చు,తరువాత ఏర్పడవచ్చు.ఇలా ఒకరికొకరు స్నేహితులుగా వ్యవహరిస్తూ స్నేహం అనే బంధం లో వుంటారు.
స్నేహం ఫై ఇది ప్రారంభం మాత్రమే మరిన్ని వ్యాసాల కోసం వేచి చూడండి .
 స్నేహం అంటే ఓ ఆహ్లాదం
 చుట్టరికం లేకున్నా సన్నిహితంగావుంటూ కష్ట సుఖాలు ,ఆనంద విషాదాలు,సమస్యలు పంచుకోవటం ,ఓదార్పును పొందటం,ఇవ్వటం అవసరమయిన మేర సహకరించుకోవటం ఇవీ స్నేహ ధర్మాలు.బాల్య స్నేహితులు గా వుండి,విడిపోయి ఎప్పుడో మరల కలుసుకున్నా ఆ అభిమానాలు అలానే ఉంటాయి.యువకులుగా ఉన్నప్పటి స్నేహాలలో కొంచం సాంద్రత తక్కువగా వుంటుంది  ఇక జీవితాలలో స్థిరపడ్డ తరువాత ఏర్పడ్డ స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి.
         మరి ప్రస్తుత స్నేహాలు సమీక్షిస్తే ఒకప్పుడు ఉన్నంత మంచి స్నేహాలు, మిత్రులు ప్రస్తుతం ఉంటున్నారా!ఆర్థిక వ్యత్యాసాలు స్నేహానికి కొలమానం అవుతున్నాయా?అభిప్రాయ భేధాలతో స్నేహాలను వదులుకొంటున్నారా !పోటీ ప్రపంచం లోని ఈర్ష్య ,అసూయ ,పోలికలు స్నేహాలను దెబ్బ తీస్తున్నాయా?ఇవన్నీ ఆలోచిస్తే స్వచ్చమయిన      స్నేహంలోని సాంద్రత బాగా తగ్గినట్లు కనిపిస్తుంది.ఎదుటి మనిషి మనకు ఎలా ఉపయోగపడతాడా!అని ఆలోచించేవారు ఎక్కువయ్యారు.అవసరాలకోసం స్నేహాలు ఎక్కువయ్యాయి.వ్యాపార లావాదేవీల్లో స్నేహితులను మోసం చేసే వ్యక్తులు పెరిగి పోయారు.నమ్మకంగా వుంటూ మిత్ర ద్రోహం చేసే వాళ్లకు కొదువ లేదు.హోదా అంతస్తులు స్నేహాన్ని నిర్దేశిస్తున్నాయి.తమ తాహతుకు తగ్గ వారితోనే స్నేహాలు చేస్తున్నారు.ఇవన్ని గమనిస్తుంటే స్నేహం ఎలా ఉండాలో వ్రాయాలని పిస్తుంది.
         ప్రతి మనిషికి,తన భావాలు స్వేచ్చగా వ్యక్తపరచుకోవటానికి ఒక స్నేహితుడు/రాలు అవసరం.అలాంటి స్నేహం లో ఎలాంటి స్వార్థం ఉండకూడదు.ఒకరినొకరు మోసం చేసుకోకూడదు.హితము కోరేవాడే కదా స్నేహితుడు.ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకూడదు.స్నేహితుని చూస్తే ఆనందం కలగాలి.ఈర్ష్య,అసూయ కలుగుతున్నాయంటే ఆ స్నేహం కలుషితమవుతున్నట్లు.ఒక స్నేహంలో పరస్పరం ఎన్నో నేర్చు కోవాలి.విభిన్న అభిప్రాయాలు కలిగి వున్నా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
       స్నేహం అంటే చంద్రుని వెన్నెలలా చల్లదనం ఇవ్వాలి.జీవితం లో అది ఒక స్వాంతన కావాలి.స్నేహం అంటే ఓ నమ్మకం .స్నేహం అంటే ఓ ఆహ్లాదం.ఎటువంటి ఒడిదుడుకులు లేని ఓ ప్రయాణం.ఏమీ ఆశించని ఓ ఆనందాల హరివిల్లు.