Wednesday, 16 May 2012

నీ ధ్యానమే!


నింగిని నేనై విశ్వమంతా పరచుకున్నా
నీ జాడను నే కనుగొన  లేకున్నా    
కవితను నేనై నీ కన్నుల్లో వికసించినా
కలనైనా కనిపించకున్నావు
కమ్మని పాటలో నిన్నునే వర్ణించినా
తియ్యని పిలుపైనా నీనుండి రాలేదు
ఊహవు నీవై మదిని నిండి
                                     ఊయల లూగావు
అనుభూతివి నీవై హృదిని నింపి
                                       ఎక్కడో వున్నావు
ఆశను పెంచి
వేదన నింపి
కవితకు అందక
కలలకు చిక్కక
కన్నీటిని తెప్పించి
కనుమరుగయిన  అనురాగమయి
తుది దాకా  నీ గానమే!
చివరి వరకు నీ ధ్యానమే!
       
 

18 comments:

  1. కవితకు అందక
    కలలకు చిక్కక
    chinn chnna padaallallo chaalaa bhagundi,

    ReplyDelete
  2. చాలా బాగుంది. :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీకు స్వాగతం .

      Delete
  3. చాలా బాగుంది... అండి... సూపర్

    ReplyDelete
    Replies
    1. సాయి గారూ .ధన్యవాదాలండి మీ ప్రశంసకు .

      Delete
  4. "ఆశను పెంచి
    వేదన నింపి
    కవితకు అందక
    కలలకు చిక్కక...."
    భావం కవిత లో చక్కగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీ స్పందనకు ,ప్రశంసకు

      Delete
  5. రవి శేఖర్ గారు, కవిత ఎంత బాగుందో! lovely!
    మీకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారు!మీరు కవితలలోని భావాన్ని చక్కగా అర్థం చేసుకొని మనస్పూర్తిగా అభినందిస్తారు.మీలాంటివారిప్రశంసలతో కవులు తమ కలాలకి మరింత పదును పెడతారు.మీకున్న ఈ లక్షణానికి ముందుగా మీకు అభినందనలు,మరియు ధన్యవాదాలు.

      Delete
  6. చాలా బావుంది. హృదయాన్ని పరిచారు. ఆర్తిగా అడుగుతున్నారు.చేరవలసిన చోటు కి చేరి.. అందవలసిన సందేశం అంది స్పందిస్తారని కోరుకుంటున్నాను.గానాన్ని ,ధ్యానం ని ఆపకండి.

    ReplyDelete
    Replies
    1. కవిత లోతులను మీరు స్పృశించారు.ధన్యవాదాలు.

      Delete
  7. "కవితకు అందక
    కలలకు చిక్కక...."

    ఇలాంటి భావాలు మా చేతికి చిక్కవెందుకో?
    చాలా బాగుంది. @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీరు ఇంతకంటే చక్కని భావాలను చిక్కించుకొని కవితలు చెక్కుతున్నారు.మీరు ప్రేమ కవితలు చాలా బాగా వ్రాస్తారు.

      Delete
  8. చాలా బాగుంది అండీ...అర్భుతం గా రాసారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ అండి.మీ స్పందనకు,అభినందనకు.

      Delete
  9. ఎవరీ అనురాగమయి !
    కవితకు అందక కలలకు చిక్కక
    ఈ గానం ధ్యానం ఎన్నాళ్ళో
    రవి కానని దేదైనా ఉంటుందా అనుకున్నాను
    దొరికావు ఇన్నాళ్ళకు
    ఎక్కడివి ఈ రాగాలు ...చిక్కని అరుణ రాగాలు
    ఆనందం ..... ఇలా ముందుకెళ్ళాలని కోరుకొంటూ
    అభినందిస్తున్నాను

    ReplyDelete
    Replies
    1. ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒక దశలో ఇలాంటి అనుభవం ఎదురవుతుంది.వారి ఆవేదన ఇలాగే వుంటుంది కదా !నాలోని కవి అలా స్పందించాడు.చాలా మందికి ఇది వర్తిస్తుందేమో!మీ పలకరింపుకు పులకరించాను.మీకు ధన్యవాదాలు.

      Delete