Saturday, 26 May 2012

ఇదే కదా మరణం ఇచ్చే సందేశం!


                                         
సర్వ బంధాలనుండి విముక్తి
సమస్త బాధలనుండి స్వేచ్చ
కలగన్నవి, పెంచుకున్నవి, పంచుకున్నవి
అన్నింటిని తుంచివేసే సంపూర్ణ స్వేచ్చ
మృత్యువు జీవితానికి చివరి అంచు కాదు
ప్రతి క్షణం మరణ స్ప్రుహ  తో జీవించడం
మనిషి పోగుచేసుకున్నవన్నీ విసర్జించడం
అదే కదా మృత్యువు యొక్క ఆంతర్యం
జీవించడమంటే మరణించడమే 
ప్రతిరోజు పెంచుకున్న బంధాల్ని
ఒక్కొక్కటిగా తుంచుకోవడమే
జీవించి ఉండగానే బంధాలన్నీ వదలగలిగితే
మృత్యువు తర్వాత అదే కదా జరిగేది
జీవిస్తూనే మృత్యువును అనుభూతించడం
అదే సిసలైన ధ్యానం
మరణించడమంటే ప్రేమతో జీవించడం
ప్రేమించగలిగే హృదయం కలిగి ఉండటం
ప్రతి క్షణం మనతో ఉండే నేస్తం మృత్యువు
ప్రతి క్షణం మరణించాలి  మన జ్ఞాపకాలకు
మరు క్షణం జననం ప్రేమిం చటానికి
 క్షణక్షణం జనన మరణ స్పృహ
ఇదే జీవనం సజీవ జీవనం
ఇదే కదా మరణం ఇచ్చే సందేశం         
(జిడ్డు కృష్ణమూర్తి తత్వ సారం మరియు మరణాన్ని దగ్గరగా చూసిన అనుభవం తో ) 

17 comments:

  1. chaala bagundi, sekher,
    blog lo inka bagundi.

    ReplyDelete
  2. చాలా చక్కగా చెప్పారండి.. మరణం ఇచ్చే సందేశాన్ని..
    ధన్యవాదాలు

    ReplyDelete
  3. మృత్యువు గురించి మృదువుగా చెప్పారు:-)

    ReplyDelete
    Replies
    1. కృష్ణ మూర్తి గారి భావాన్ని కవితలో పొందుపరచాను . thank you.

      Delete
  4. "మృత్యుదేవత నా ఇంటి తలుపు తడితే
    నా జీవిత పూర్ణ పాత్రని
    అతని ముందుంచుతాను.
    రిక్త హస్తాలతో అతనిని ఎన్నడూ పంపను"
    అంటారు రవీంద్ర నాథ్ టాగోర్..
    మృత్యువు గురించి చక్కగా వ్రాసారు రవి శేఖర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. చక్కటి టాగూరు సందేశం గుర్తు చేసారు.ధన్యవాదాలు శ్రీ గారు .

      Delete
  5. CHALAA............BAGUNDI-RAVISEKHAR
    YOUR BLOG IS ALSO GOOD

    ReplyDelete
    Replies
    1. hellow sir welcome.how are you.thank you.
      blog loki vasthu vundandi.

      Delete
  6. మరణం మీద కవితా? ఎందుకండి దాని మీద కవిత? ఒకలా అయిపోతుంది మనసు.
    మీ కవితలు సాధారణంగా ఒకటికి రెండు సార్లు చదువుతాను. ఊహు! దీన్ని చదవలేదు అన్నిసార్లు.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారు !ఈ కవిత వ్రాయటానికి రెండు కారణాలున్నాయి.1)ఇద్దరు అత్యంత ఆప్తుల మరణం సన్నిహితంగా చూడడం ,వారి బాధను దగ్గరనుండి చూడడం,2)జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ చదివిన తరువాత మరణం పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఏర్పడడం
      ఇక పోతే దీన్ని మీరు రెండు రకాలుగా తీసు కోవాలి.1)ప్రస్తుతం మనిషి చేసే అన్ని చర్యలను ఆపేది మరణం.ఆ విషయం తెలియక మనిషి ఎన్నో తప్పులు చేస్తున్నాడు.దాన్ని అర్థం చేసుకుంటే జీవితం అద్భుతంగా తయారవుతుంది.2)ప్రతి జ్ఞాపకాన్ని క్షణం క్షణం మరిచిపోవటమంటే ఆ జ్ఞాపకానికి మరణించటం అని అర్థం .ఇక్కడ మరణాన్ని అలాంటి అర్థం లో తీసుకోవాలి.
      దయచేసి మీరు కవితను బాగా చదవండి .ఒకటికి రెండు సార్లు .
      మీకు మెల్లగా అర్థమవుతుంది.ఆనందకరమైన జీవితానికి ఇది ఎంతో అవసరం.
      ప్రతి క్షణం అంతకు ముందలి క్షణం లో కలిగిన ఆలోచనకు మరణించడం అంటే మనసును శూన్యం చేయడం.అప్పుడు ఓ అద్బుతమైన ఆనందం ఉద్బవిస్తుంది.అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతున్నాను.
      వివరణ ఎక్కువయింది కదా!మరో వ్యాసం లో దీనిని వివరిస్తాను.

      Delete
    2. మీ వివరణ బాగుంది. కవిత చదివాను. "ముందలి క్షణం లో కలిగిన ఆలోచనకు మరణించడం అంటే మనసును శూన్యం చేయడం.అప్పుడు ఓ అద్బుతమైన ఆనందం ఉద్బవిస్తుంది." చాలా కష్టమేమో! కాని may be true!

      Delete