Thursday, 27 February 2014

Billgates చెప్పిన జీవిత సూత్రాలు


1) ప్రపంచం అందమైనదేమీ కాదు.దానికి అలవాటు పడండి.
2) మీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం పట్టించుకోదు.మీరు  సాధించబోయే దాని మీదే దాని దృష్టంతా !
3)  చిన్న ఉద్యోగాలను అవమానం  భావించ వద్దు.మీ తాతల కాలంలో వాళ్ళు అలాంటి ఉద్యోగాలనే ఎదగటానికి అవకాశాలుగా మలచుకున్నారు .
4)మీ తప్పుల గురించి చింతించే బదులు వాటినుంచి నేర్చుకోండి.
5)మీరు సరయిన సమాధానాలు వ్రాసి   pass అయ్యే  వరకు స్కూల్స్ మీకు బోలెడన్ని అవకాశాలిస్తుంటాయి . కాని నిజ జీవితం  ఇందుకు విరుద్ధంగా ఉంటుంది .
6) బడికి వేసవి సెలవులుంటాయి. కానీ ఉద్యోగాల్లో ఇలాంటి  సరదాల  కోసం సెలవులను మీరే సృష్టించుకోవాలి.
7) T.V నిజ జీవితం కాదు.నిజ జీవితం లో ప్రజలు ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్ళాల్సి ఉంటుంది .
8) గొప్పలు చెప్పుకునే మేధావులతో మర్యాదగా వ్యవహరించండి. అలాంటి వారి కిందే మీరు పని చేయాల్సి రావచ్చు .     


     
 

Monday, 17 February 2014

జిడ్డు కృష్ణమూర్తి అంతిమ సందేశం

          ఈ రోజు జిడ్డు  కృష్ణ మూర్తి వర్ధంతి.ఆయన 1895 మే 11 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లి లో జన్మించారు. 1986 february 17 న అమెరికాలో మరణించారు.మరణించే ముందు ఆయన తన సన్నిహితులతో ఈ విధంగా చెప్పారు. ఆయన మాటల్లో
                                                                                                                
"70 సంవత్సరాలుగా ఒక దివ్య శక్తి ,ఒక మహా ప్రజ్ఞ ఈ శరీరం లో పనిచేస్తున్నది.ఆ శక్తిని జనం గుర్తించలేదు,
గ్రహించనూ లేదు అది 12 సిలిండర్ల శక్తి గల ఇంజన్.70 సంవత్సరాలు తక్కువేమీ కాదు.ఇప్పుడు ఈ శరీరం అంత శక్తిని భరించ లేకుండా ఉంది.నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు.ఎవరూ నటించ వద్దు.మనలో పబ్లిక్ లో ఎవరూ నాలో ఏమి జరిగింది తెలుసుకోలేరు .
         70 సంవత్సరాల తర్వాత ఆ శక్తి చివరి అంచుకు చేరింది.ఆ మహా శక్తి,ఆ మహా ప్రజ్ఞ,ఆ మహా చైతన్యం రాత్రి సమయాలలో బయటకు వస్తుంది.భారతీయులకు ఇలాంటి విషయాలలో చాలా నమ్మకం.ఆత్మశాశ్వత మని శరీరం అశాశ్వతమని అంటారు.నాన్సెన్స్ నా శరీరం వంటి శరీరం పరమాత్మకు మరొకటి దొరకదు.వందల సంవత్సరాలు నిరీక్షించాలి,నా శరీరం లాంటి శరీరం కోసం.ఆత్మ పోగానే అంతా నశిం చినట్లే.చైతన్యం మిగలదు.ప్రజ్ఞ మిగలదు ఆత్మల్ని అనుభూతిస్తామంటారు అది ఊహ.నా రచనల్లో నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటే మంచిది ఎవరూ అర్థం చేసుకున్న వారు లేరు ఇంతవరకు ."                     
(   ఈ వ్యాసం శ్రీ శార్వరి  రచించిన "కొత్తకోణంలో కృష్ణమూర్తి" నుండి   గ్రహించ బడింది .  వారికి ధన్యవాదాలు )    
  ఈ దిగువ website లో ఆయన గురించి తెలుసుకోగలరు .
www.jkrishnamurti.org                                                           

Sunday, 9 February 2014

నీకు తెలుసు... ఒక్క రాత్రిలో ప్రేమ పుట్టదని.... ఒక్కరాత్రిలో నక్షత్రం పుట్టదని ......

              ప్రేమ గురించి ఇంత బాగా ఎవరు చెప్పి ఉంటారు. ఊహించగలరా!"నా దేశం .. నా ప్రజలు " రచనకు నోబెల్ సాహిత్య బహుమతికి నామినేట్ కాబడిన శేషేంద్ర శర్మ.ఆయన భార్య రాజకుమారి ఇందిరా దేవికి రాసిన ప్రేమలేఖ లలోని కవిత్వం ఆయన మాటల్లోనే ....... 
            నా సృజనాత్మక లోకాలని నా ప్రేయసి మేల్కొలిపింది 
            ఆ మేలుకున్న అంతర్లోకాలు పూస్తున్న పరిమళాలే
            ఈ నాటి గాలుల్లో కలిసి వ్యాపిస్తున్నాయి 
            నా ప్రేమ రాజకుమారి ... !నీ ఉత్తరాలు విప్పాను ... పేజీల్లోంచి
            వెన్నెల రాలింది ... 
            నీవు స్త్రీవి కావు అందాల తుఫానువి. 
           అందరి భాషా కంఠం నుంచి వస్తే నీ భాషకన్నుల్లోంచి వస్తుంది  
           నీవు హృదయాన్ని అక్షరాల్లో పెట్టిన పక్షివి . 
           ఒక్క ముద్దు ఇస్తే అది నీ గుండెలో 
           తుఫానుగా మారుతుందనుకోలేదు 
           నా హృదయం లోకి ఉషస్సులు 
           మోసుకొస్తున్న ని న్నెవ్వడాపగలడు
           నీ కనులు ఇంద్ర నీలాల గనులు 
           ఏ అవ్యక్త భౌతిక ద్రవ్యాలతో కాచిన పీయూషమో నీ ప్రేమ !
           అందులో తమ స్వప్నాలు కరిగించుకుని తాగి 
           ఎందరో మానవ మాత్రులు దేవతలై రెక్కల మీద ఎగిరిపోయారు 
           ఒక్క బొట్టు చప్పరిస్తే చాలు దేహంలో కండరాలు 
           మొహంలో మునిగిపోతాయి 
           ఒక్కటే చాలు నాకు ఎక్కడ నా కలలన్నీ నిజమో 
           ఆ మధుర నిశ్శబ్దం లాంటి ప్రవాసం నీ దరహాసం 
           నీ కన్నుల్లో సముద్రాలే కదుల్తాయి పసిపిల్లల్లా 
           నీ ఒక్క మాటలోనే ఒదిగి పడుంటాయి 
           మనిషి నిర్మించిన ప్రేమ గాధల లైబ్రరీలన్నీ ... 
            నీ ఊహల్లో కిరీటాలు ధరించిన రాజులు కూడా 
           తల వంచి నడిచి పోతారు తమ పరిపాలన సాగని వీధుల్లో నడుస్తున్నట్లు .... 
నిన్ను ఒక్క దాన్నే ప్రేమిస్తా. చిన్నప్పుడు కాశీ మజిలీ కథల్లో నుంచీ అరేబియన్ నైట్స్ కథల్లో నుంచీ నా చైతన్య సీమల్లొకి దిగిన రాజకుమార్తె లందరూ నీ వొక్కతెవె   అయినట్లు ప్రేమిస్తా ...  
                                                                    నీ శేషేంద్ర                                       
       తేనెలో కలాన్ని ముంచి వ్రాసినట్లు ఎంత కమ్మని కవిత్వం.    ఆస్వాదించండి మరొక్క సారి