Monday, 28 March 2022

స్పందనా రాహిత్యం

 ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే హృదయం పరవశిస్తుంది.ప్రకృతి అందాలకు మనసు మురిసిపోతుంది. పైరగాలి పాటకు ప్రాణం లేచి వస్తుంది.బోసినవ్వుల పసిపాపను చూస్తే అప్రయత్నంగా మన పెదవుల పై చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది. ఎవరయినా మనల్ని పలకరిస్తే ముఖం విప్పారుతుంది.ఏదయినా ప్రశ్న వేస్తే జవాబిస్తాం. అడగాలనిపిస్తే ప్రశ్నిస్తాం.హాస్యానికి నవ్వులతో హారతి పడతాం.క్లిష్టమైన సమస్యలకు తర్కాన్ని అన్వయిస్తాం. తోటివారు చూపే ప్రతిభా నైపుణ్యాలను అభినందిస్తాం. ఇలా ఎన్నో విధా లుగా ప్రతిస్పందిస్తుంటాం. ఇది మానవ సహజ లక్షణం. కానీ ప్రస్తుతం ఒక కొత్త తరహా మానసిక స్థితి ఏర్పడుతుంది. దేనికీ స్పందించకపోవటం. Online or offline మనకెందుకు లే అనే భావన. ఇది ప్రత్యక్ష సంభాషణల్లోను పరోక్ష social మీడియాలోనూ గమనించవచ్చు. FB లో చాలా మంది అసలు active గా ఉండరు. Active గా ఉన్నవాళ్లలో ఎక్కువ మంది ఒక paragraph అయినా చదవరు. చదివిన వారు స్పందించరు. ఇక whatsapp లో మరీను.256 మంది ఉన్న group లో ఏ కొద్ది మందో post లు పెడుతుంటారు. ఒక్కరు లేదా కనీసం ఇద్దరు కూడా స్పందించరు.ఇక చాలామంది వారికి ప్రత్యక్షంగా whatsapp కి పంపిన సమాచారానికి కూడా స్పందించరు. పంపేవారు కూడా అవసరం లేనివికూడా ఎక్కువ సందేశాలు పంపుతుంటారు.whatsapp ఓ రకంగా మనం మరిచిపోయిన ఉత్తరాలు వ్రాసుకోవడానికి ఆధునిక రూపం. ఏదయినా మాట్లాడు కుంటేనే మాటలు, స్నేహం కుదురుతుంది. స్పందిస్తుంటేనే మన మనస్తత్వం ఎదుటివారికి అర్ధమవుతుంది. Social media ను మనం ఇంతకుముందు వ్రాసిన ఉత్తరాలకు బదులుగా చక్కగా ఉపయోగించుకోవచ్చు.ఎంత మంచి విషయం post చేసినా కనీసమైన స్పందన ఉండటం లేదు.communication gap భయంకరం గా కనిపిస్తుంది. పరస్పర మానవ సంబంధాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎవరితో వివరంగా ఏదీ చెప్పరు. చెప్పినా దానికి సరిఅయిన సమాధానం ఇవ్వరు.ఇలా కుటుంబంలో,బయట స్పష్టత స్పందన కరువై ఎన్నో సమస్యలు సంక్లిష్టం గా మారుతున్నాయి.మానవ సంబంధాల పటిష్టతకు కనీసం ఒక ఫోన్ కాల్, లేదా ఒకసారి ఆత్మీయులను కలవడం చేయాలి. అవతలి వారి బాధలు వినాలి.సహానుభూతి(empathy )కలిగి ఉండాలి. స్పందించే గుణం కోల్పోతే సగం జీవితం కోల్పోయినట్లే..... ఒద్దుల రవిశేఖర్.

Sunday, 20 March 2022

Heal Paradise(అనాధ పిల్లల పాఠశాల ) village సందర్శన

 

ఎప్పటినుండో అనుకుంటూ వెళ్లలేకపోయిన ప్రదేశం ఇది. ఓ సారి CA PRASAD గారి పిలుపు మేరకు నయీ తాలీమ్, మానవతా మిత్రమండలి సమావేశానికి 2018 లో వెళ్లలేకపోయిన ప్రాంతం. కరోనా కష్టాలు తొలగి పోయిన తరువాత ఇక వెళ్లకుండా ఉండలేక పో యాను. ప్రసాద్ గారు అందులో పనిచేసే కరుణ బాబు, మణికుమారి ఫోన్ numbers ఇవ్వడం తో వారి తో సంప్రదించగా రమ్మన్నారు.మణికుమారి గారయితే అమెరికా నుండి ఫోన్ చేసి campus incharge ప్రసాద్ గారి నెంబర్ ఇచ్చారు.vijayawada city bus stand నుండి 308 అగిరపల్లి bus ఎక్కి గంట ప్రయాణం తరువాత దిగాను. నూజివీడు రూట్ లో 30 కి. మీ ఉంటుంది. ముందుగానే నాకోసం wait చేస్తున్న Blind school incharge అబ్రహాం గారు నన్ను అక్కడనుండి 5km దూరంలోనున్న పాఠశాలకు తీసుకెళ్లి సంజన madam గారికి పరిచయం చేశారు. ఆమె ఈ మధ్యనే అక్కడ చేరారట.B.Tech పూర్తి చేసి వాలంటీర్ గా అక్కడ చేరారు. ఆమె campus అంతా చూపిస్తూ వివరంగా చెప్పారు. పాఠశాలలో సుమారు 700 మంది అనాధ, పేద పిల్లలకు 1 నుండి 12 తరగతి వరకు CBSE విధానం లో ఉచిత విద్య నందిస్తున్నారు.మొదట ఆర్గానిక్ ఫార్మింగ్ చూసాము. దానికి వెనుకగా పెద్ద సరసు.ప్రకృతి అంతా పిండారబోసినట్లు. తరువాత blind school చూసాము incharge అబ్రాహాం గారు. ఎవరయినా పిల్లలు ఉంటే refer చెయ్యమన్నారు. తరువాత జైపూర్ పాదం తరహాలో ఇక్కడ కూడా 18ఏండ్ల లోపల వయసు గలవారికి చెయ్యి కాలు రెండూ అమర్చుతారు. Great service. అక్కడ నుండి సోలార్ పవర్ తో నడిచే కిచెన్ చూపించారు.శక్తి వనరులు ఆదా చేయడం ఎలాగో ప్రత్యక్షంగా చూడొచ్చు. భవనం పై ఏర్పాటు చేసిన సౌరఫలకల తోనే మొత్తం campus అంతా కరెంటు అవసరాలు తీరుతున్నాయి. మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్ముతారు. మంచి రుచికరమైన పోషకాహారం పిల్లలకు అందిస్తున్నారు. తరువాత ప్రిన్సిపాల్ శ్రీదేవి గారితో, campus incharge ప్రసాద్ గారితే మాట్లాడి HEAL SCHOOL గురించి వివరంగా తెలుసుకున్నాను. వారు తమ సమయాన్ని నాకు కేటాయించి ఎంతో ఆదరంతో మాట్లాడారు. ఏదయినా విద్యార్థులకు నా వంతు సహాయం చేయగలనని తెలిపాను.science labs అద్భుతంగా తీర్చి దిద్దారు. ఆధునిక మైన డిజిటల్ classrooms, computer lab ఉన్నాయి. పిల్లలకు అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆటస్థలం ఉంది.ఎవరికయినా సహాయం చేయాలనుకుంటే అత్యంత అర్హులు అనాధ పిల్లలే. ఇంత గొప్ప సేవకు అంకురార్పణ చేసి అనాధపిల్లల కు భువిపై స్వర్గాన్ని సృష్టించిన పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ సత్యప్రసాద్ కోనేరు గారు వారి మిత్రులు ఎంతయినా అభినందనీయులు. మనం ధనం,కాలం, జ్ఞానం, ప్రేమ ల్లో ఏదయినా ఆ అనాధపిల్లలకు అందించ వచ్చు. ఒకసారి మీరు చూసి నిర్ణయం తీసుకోండి... ఒద్దుల రవిశేఖర్