విశాల విశ్వంలో నీవు వినిపించని
గీతికలా వున్నావెందుకు
ఆ గీతాన్ని నాకిస్తే శ్రుతి చేసి
మధురంగా పలికించనా
సముద్రంలో చిన్న అలవై
మిగిలిపోయావెందుకు
కెరటంలా ఒడ్డుకు రావా
నన్ను నీలో కలుపుకునేందుకు
వెన్నెల ఆకాశంలో చిన్ననక్షత్రమై వెలుగుతావెందుకు
పున్నమి వెన్నెలవు నీవైతే
పులకరించే కలువను నేను కానా
వాన వెలసిన వేళలో
ఒంటరిగా వున్నావెందుకో
ఇంద్ర ధనుస్సువు నీవైతే
ఆ వింటినారిని నేను కానా
తెలవారిన తర్వాత
ఏటి ఒడ్డున నీటి కోస్తావెందుకు
కొద్దిగా ముందొస్తే సుప్రభాత సంగీతాన్నై
నీ వీనుల విందు చేయనా
చెలీ నా భావాల వీణ లోని
ప్రతి తీగను మీటాను
ఏ రాగం నిన్ను కదిలించినా
ఆ తొలకరి మేఘాని కందించవా
Beauty full ... no words
ReplyDeletethank you.
ReplyDeleteప్రకృతిలో చెలిని చూడగల కవితా హృదయం..బావుంది కవిత.
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteచాలా బాగుంది. అభినందనలు.
ReplyDeleteకానీ చివరి సందేశం మేఘానికెందుకో అర్థముకాలేదు.
చెలికి వెళ్ళాలి కదా?
ధన్యవాదాలండి.చెలి దూరాన వుందండి .ఈయన భావమంతా ఆమెకు అర్థమైతే ఆమె అక్కడనుండి మేఘం ద్వారా తన సందేశం పంపించమని కోరుతున్నాడు.
Delete"ఇంద్ర ధనుస్సువు నీవైతే
ReplyDeleteఆ వింటినారిని నేను కానా"
కవిత చాలా బాగుంది...
ధన్యవాదాలండి రాజి గారు!
DeleteSo sweet! చాలా బాగుంది. వెన్నెల కురిసినట్టే!
ReplyDeleteవెన్నెల అంటే గుర్తొచ్చింది , 5 or 6 తేదీల్లో ఇప్పటికంటే చంద్రుడు 14% పెద్దగా కనిపిస్తాడు.ఆకాశం వైపు చూడండి.ధన్యవాదాలు వెన్నెల గారు !
Deleteతప్పకుండా చూస్తానండి.ధన్యవాదాలు మీకు.
Deletechaalaa baagundandi...
ReplyDeleteమీ ప్రశంసకు థాంక్స్.
Deleteమేఘ సందేశం అనమాట!!!
ReplyDeleteఎవరో ఒకరి సహాయం తీసుకోవాలి కదండీ.
Deleteపలుకు పలుకులో క (ర) వియై
ReplyDeleteచెలి డెందము గెలుచు కొఱకు చెఱకున విరి తూ
పులు సంధించిన "ఒద్దుల "
కలగా మిగిలేను ! చెలులు కఠినులు సుమ్మా!
బ్లాగు సుజన-సృజన
మీకు స్వాగతం మరియు ధన్యవాదాలు.మీ అభిప్రాయం నిజమేనండి .మీ పద్యం బాగుందండి.
Deleteఓ అలాగా!
ReplyDeleteఅయితే తొలకరి మేఘంతో సందేశం పంపించవా అని అర్థమన్నమాట. బాగున్నదండి.
thanks andi.
Delete