Thursday, 3 May 2012

జాతీయ ఆనంద సూచిక

          ఇంతకు ముందు పోస్ట్ లో  మానవ  జీవిత లక్ష్యమేమిటి? అంటే ఆనందం అని తెలుసు కున్నాము. మరి ఒక దేశం దాన్ని తన జాతి జీవన విధానం గా మలిస్తే ఎలా వుంటుంది.భూటాన్ లా వుంటుంది.అన్ని దేశాలు Gross National Product(GDP)  ను లెక్కిస్తుంటే భూటాన్  మాత్రం Gross National Happieness(GNH) ను లెక్కిస్తుంది.అంటే స్థూల జాతీయ ఆనందం .ఎంత బాగుందో కదా!
                        వారిని పర్యావరణ మైత్రి,సంస్కృతి పరిరక్షణ,సుపరిపాలన,ఆర్ధిక వృద్ది  నిత్య సంతోషం గా వుంచుతు న్నవి.వాళ్ళు ప్రకృతిని విపరీతం గా ప్రేమిస్తారు.అక్కడ 72% అడవులు వున్నాయి .జంతువు లను వేటాడరు ,నదుల్లో చేపలను కూడా పట్టరు .బౌద్ధం వారి జీవన విధానం .ప్రకృతి మా ప్రాణం అంటారు వారు.టి.వి. వారి దేశం లో 1999 లో ప్రవేశించింది.తమకు అంగీకారం కాని చానళ్ళకు అడ్డుకట్ట వేసింది.
               ప్లాస్టిక్ మీద అక్కడ పోరాటం జరుగుతోంది.ఇక్కడ  అన్ని రకాల పొగాకు అమ్మకాలు నిషిద్దమే!ఇక్కడ నీరు,గాలి అత్యంత స్వచ్చంగా వుంటాయి.పర్యావరణాన్ని  పారిశ్రామీకరణ  దెబ్బతీస్తుందని ప్రోత్సాహించటం లేదు.పర్యాటకుల వల్ల కూడా పర్యావరణం దెబ్బ తింటుందని  వారిని నియంత్రిస్తారు.
         ఇంతలా పర్యావరణాన్ని ప్రేమిస్తూ ప్రకృతి లో ఆనందం గా బ్రతుకుతున్న దేశాన్ని,ప్రజలను ఎక్కడా చూడలేమేమో!జీవితాన్ని సంతృప్తిగా ,మనః శాంతిగా గడపడానికి అక్కడి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రజలంతా దానికి మద్దతు పలుకుతున్నారు.ఓ సారి ఆ దేశాన్ని చూసొద్దామా!
     (మూలం :ఈనాడు ఆదివారం పుస్తకం .వారికి కృతజ్ఞతలు.)

11 comments:

  1. మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు !

    ReplyDelete
    Replies
    1. స్వాగతం .మానవ జీవన లక్ష్యమేమిటి అన్న పాతపోస్ట్ చదివారా!మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
    2. చాలా ఆనందమయమైన...సమాచారం.మన దగ్గర కూడా ఈ విధమైన ప్రజలు,పాలనా విధానాలు ఉంటే మంచిదే...సుజలాం,సుఫలామ్ అని పాడుకునే దేశం అమలు పరచినట్లు అవుతుంది

      Delete
  2. Out of curiosity , how d they measure "Gross National Happieness(GNH)" ? kind of surprising. Nice post!

    ReplyDelete
  3. Gross National Happieness(GNH)
    మంచి ఆలోచన ...
    మాకు కూడా తెలియచేసినందుకు థాంక్సండీ!

    ReplyDelete
  4. మనిషికి అవసరమైన కనీస అవసరాలు తక్కువ ధరలకు లభ్యంయ్యేలాగా చూడటంవిద్య ,వైద్యం ,అందరికి ఉపాధి,చక్కటి పర్యావరణం ఇలాంటి కొన్ని ప్రమాణాలతో కోలుస్తారేమో !
    అలాగే world happiest countries ని కూడా సెలెక్ట్ చేసారు 2011 లో 1)నార్వే ,2)డెన్మార్క్ 3)finland4)australia5)newzealand6)swedon7)canada8)switzerland9)netharlands10)usa
    ఇది వేరే సర్వే www.forbes.com

    ReplyDelete
  5. వెన్నెలగారికి ,రాజిగారికి పై సమాధానం .ఇద్దరికీ ధన్యవాదాలు .

    ReplyDelete
  6. jaateeya vinoda soochika kante mana desam lo vinodanni cellphone lonu channels dwara chating dwara 24 gantalu anandistune unnaru

    ReplyDelete
  7. you are correct.the think they are getting happieness through it.

    ReplyDelete
  8. ఇటువంటివి మన దేశంలో అమలు చేయాలి అని అనుకోవటం తప్ప ఎవరో అమలు చేసేదాకా ఎందుకు ఆగాలి? మన వంతుగా మనకు చేతనయినంతలో పర్యావరణాన్ని మనమే కాపాడుకోవచ్చును కదా!

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమే!ధన్యవాదాలు.

      Delete