నింగిని నేనై విశ్వమంతా పరచుకున్నా
నీ జాడను నే కనుగొన లేకున్నా
కవితను నేనై నీ కన్నుల్లో వికసించినాకలనైనా కనిపించకున్నావు
కమ్మని పాటలో నిన్నునే వర్ణించినా
తియ్యని పిలుపైనా నీనుండి రాలేదు
ఊహవు నీవై మదిని నిండి
ఊయల లూగావు
అనుభూతివి నీవై హృదిని నింపి
ఎక్కడో వున్నావు
ఆశను పెంచి
వేదన నింపి
కవితకు అందక
కలలకు చిక్కక
కన్నీటిని తెప్పించి
కనుమరుగయిన అనురాగమయి
తుది దాకా నీ గానమే!
చివరి వరకు నీ ధ్యానమే!
కవితకు అందక
ReplyDeleteకలలకు చిక్కక
chinn chnna padaallallo chaalaa bhagundi,
THANKS FOR YOUR APPRECIATION.
Deleteచాలా బాగుంది. :)
ReplyDeleteధన్యవాదాలండి మీకు స్వాగతం .
Deleteచాలా బాగుంది... అండి... సూపర్
ReplyDeleteసాయి గారూ .ధన్యవాదాలండి మీ ప్రశంసకు .
Delete"ఆశను పెంచి
ReplyDeleteవేదన నింపి
కవితకు అందక
కలలకు చిక్కక...."
భావం కవిత లో చక్కగా రాశారు.
ధన్యవాదాలండి మీ స్పందనకు ,ప్రశంసకు
Deleteరవి శేఖర్ గారు, కవిత ఎంత బాగుందో! lovely!
ReplyDeleteమీకు అభినందనలు
వెన్నెల గారు!మీరు కవితలలోని భావాన్ని చక్కగా అర్థం చేసుకొని మనస్పూర్తిగా అభినందిస్తారు.మీలాంటివారిప్రశంసలతో కవులు తమ కలాలకి మరింత పదును పెడతారు.మీకున్న ఈ లక్షణానికి ముందుగా మీకు అభినందనలు,మరియు ధన్యవాదాలు.
Deleteచాలా బావుంది. హృదయాన్ని పరిచారు. ఆర్తిగా అడుగుతున్నారు.చేరవలసిన చోటు కి చేరి.. అందవలసిన సందేశం అంది స్పందిస్తారని కోరుకుంటున్నాను.గానాన్ని ,ధ్యానం ని ఆపకండి.
ReplyDeleteకవిత లోతులను మీరు స్పృశించారు.ధన్యవాదాలు.
Delete"కవితకు అందక
ReplyDeleteకలలకు చిక్కక...."
ఇలాంటి భావాలు మా చేతికి చిక్కవెందుకో?
చాలా బాగుంది. @శ్రీ
మీరు ఇంతకంటే చక్కని భావాలను చిక్కించుకొని కవితలు చెక్కుతున్నారు.మీరు ప్రేమ కవితలు చాలా బాగా వ్రాస్తారు.
Deleteచాలా బాగుంది అండీ...అర్భుతం గా రాసారు.
ReplyDeleteథాంక్స్ అండి.మీ స్పందనకు,అభినందనకు.
Deleteఎవరీ అనురాగమయి !
ReplyDeleteకవితకు అందక కలలకు చిక్కక
ఈ గానం ధ్యానం ఎన్నాళ్ళో
రవి కానని దేదైనా ఉంటుందా అనుకున్నాను
దొరికావు ఇన్నాళ్ళకు
ఎక్కడివి ఈ రాగాలు ...చిక్కని అరుణ రాగాలు
ఆనందం ..... ఇలా ముందుకెళ్ళాలని కోరుకొంటూ
అభినందిస్తున్నాను
ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒక దశలో ఇలాంటి అనుభవం ఎదురవుతుంది.వారి ఆవేదన ఇలాగే వుంటుంది కదా !నాలోని కవి అలా స్పందించాడు.చాలా మందికి ఇది వర్తిస్తుందేమో!మీ పలకరింపుకు పులకరించాను.మీకు ధన్యవాదాలు.
Delete