ఓ విరిచూపు
తను ఎన్నో ఆశ్చర్య కరమైన
ప్రశ్నలకి
గురి అయ్యానంటోంది
మరెన్నో అవ్యక్తానుభూతులకు లోనై
ఆలోచిస్తున్నానంటోంది
మదిలో చెప్పలేని సందేహాలెన్నో
మొగ్గ తొడిగాయంటోంది
నా పరిస్థితికి నీ ప్రయత్నాలన్నీ
వ్యర్థమే
అంటోంది
నా కోసం ప్రయాణించే నీ రైలు ఓ జీవితకాలం
ఆలస్యం
అంటోంది
నా హృది నీలాకాశంలా విస్తరించినపుడు
నీ వెందుకు
ప్రవేశించలేదు నేస్తమా!
నేనందమైన జాబిల్లినని ఇంకాస్త ముందుగా
ఎందుకు తెలియజేయలేదు మిత్రమా!
అంటూ ఆ అల్లరి కనురెప్పల
కదలికలు పలికిస్తున్నాయి
ఇంకేం మిగిలివుంది సఖుడా! నా దగ్గర
అద్భుతమైన నీ ఆరాధనా భావ
పరంపరలు తప్ప!
మరింకేం చెప్పేది వీధి లైట్ కాంతి
నా మీద పడి నీ భావాల్ని జ్ఞప్తికి తెస్తోంది
ఓడ కళాసీ పాట దూరంగా వినిపిస్తుంది
నీ స్వరధుని నన్ను జీవితమంతా
పులకరింప జేస్తూనే వుంటుంది
అని ఆ కాటుక కనులు జవాబిస్తున్నట్లుంది
అని ఆ కాటుక కనులు జవాబిస్తున్నట్లుంది
ఇంకా ఇలా పలికిస్తుంది ఆ
చూపు
వుంటాను స్నేహితుడా!
నీ పలకరింపులకు దూరంగా
నీ పలకరింపులకు దూరంగా
నీ భావనలకు దగ్గరగా
పలకరింపులకు దూరంగా
ReplyDeleteభావనలకు దగ్గరగా
bhagundi, kada ee expression.
THANK YOU.
ReplyDeleteకవిత బాగుందండీ!
ReplyDeleteహృదయానికి దగ్గరగా...
@శ్రీ
దన్యవాదాలండి.చాలా మంది ప్రేమించి ముందుగా చెప్పలేక ఎప్పుడో తీరిగ్గా చెప్పబోతే ఇలాగే సమాధానాలు వుంటాయి.
Deleteకవిత చాలా సార్లు చదివాను. అసలు విరిచూపు మీద కవిత రాయలన్న అలోచన ఎలా వచ్చిందండి? నాకైతే చాలా నచ్చిందండి. మీకు అభినందనలు.
ReplyDeleteఓ విరిచూపును చూడగానే అలా నాకు అర్థమైన భావాన్నీ కవిత రూపం లో పలికించాను.కవిత లోని భావం చాలా మంది తమ జీవితం లో ఎదుర్కొని ఉంటారు.ధన్యవాదాలండి
Deleteనువ్వే కావాలి (తరుణ్ హీరో) సినిమా చూశారా !చూడక పోతే ఓ సారి చూడండి.దానిలో ఈ కవిత భావం ఉంటుంది.వాస్తవానికి ఆ సినిమా రాకముందే ఆ కథను నేను తయారు చేసుకున్నాను.కాని వారికి అలాంటి ఆలోచనే వచ్చింది.ఈ కవిత కూడా ఆ సినిమా విడుదలకు ముందే వ్రాసుకున్నదే.
Delete