అహంకారం ఎరుగని సరిహద్దులకు
నా మనసు విస్తరించనీ
అలంకరణలకు విలువివ్వని
అభిమానాన్ని సంతరించు కోనీ
ఆప్యాయతానురాగాల భావాల
సమున్నత్వాన్ని పెంపోందించుకోనీ
ఈ విశాల విశ్వాంతరాళంలో
నా మానసిక సౌందర్యం విస్తరించి ప్రకాశించనీ
నా హృదయ సీమ లోని ప్రతి కణం ఈ ప్రకృతి పై
అవ్యాజ్య అభిమానాన్ని నిలుపుకోనీ
నా మనోగగనాన స్నేహ మధురిమల పరిమళాలు
నా శ్వాస నాళాల్లో ప్రాణవాయువు
ప్లవించే వరకు గుబాళించనీయనీ
అని నా హృద్యంతరం లోని శక్తిని కోరుతున్నా
చాలా బాగుంది రవి శేఖర్ గారు!
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteమంచి భావాల చక్కనిమాలలా వుంది, శేఖర్.
ReplyDeletekeep writing.
మీకు ధన్యవాదాలు నచ్చి మెచ్చినందుకు.
Deletenice sir :)
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteమీ హృదయాంతర శక్తి మీరు కోరుకునే శక్తినిస్తుంది రవి శేఖర్ గారూ!
ReplyDeleteచక్కని భావం...
@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు .
Deleteమహోన్నతమైన భావాలు మీవి. చాలా బాగుంది కవిత. మీకు అభినందనలు.
ReplyDeleteప్రతి భావం మనసు నుండే ఉద్భవిస్తుంది.అందులోని మంచి వాటిని అభివృద్ది చేసుకోవటమే కదా మానవ జీవిత పరమార్థం.మీ సహృదయతకు నెనర్లు.
Deleteఆ స్థితిని సాధించగలిగితే...జీవితం సఫలమౌతుంది. కవిత బావుంది రవిశేఖర్ గారూ..
ReplyDeleteజీవితం ప్రతిక్షణం ఓ తపస్సు లాంటిది.దాన్ని ఆనందం గా జీవించాలంటే మనసును మంచి భావాలతో నింపుతూ ఆచరిస్తూ నడవటమే కదా మనిషి కర్తవ్యం. మీ స్పందనకు నెనర్లు.
Deleteచాలా చక్కగా రాసారండి.
ReplyDeleteమీకు ధన్యవాదాలండి.
Delete