గత భాగం తరువాయి
అహంకారం యొక్క లక్షణాలను ఒకసారి గమనిద్దాము.
1)ఇతరుల కంటే తాను అధికము అనే భావన మనిషిలో వుంటే అతని ప్రవర్తన లో అది ప్రతి సందర్భం లో కనిపిస్తూ ఉంటుంది.అతని మాట తీరులో అది వ్యక్త మవుతూ ఉంటుంది.ఇది అందం,డబ్బు,పదవి,,జ్ఞానం వలన కలుగుతుం టుంది.వీటిని ప్రదర్శిస్తూ మిగతా వారికి ఇవి లేవు అంతా నాకే తెలుసుఅన్న భావం లో ఉంటాడు. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయటం,అవమాన పరచటం ,అసహ్యించుకోవడం,ద్వేషించడం చేస్తుంటాడు.
2))వీరి ఆలోచనా విధానం పరిమితమైన చట్రం లో బంధించబడి ఉంటుంది.వీరు ప్రపంచం గురించి గాని సమాజ శ్రేయస్సు గురించి కాని ఆలోచించరు.ఎవరు ఏమైనా ఫరవాలేదు.అన్న ధోరణిలో ఉంటారు.
3))పక్షపాతం తో వ్యవహరిస్తారు.నా కులం ,నా మతం ,నా వర్గం,నా పార్టీ గొప్ప అని భావిస్తూ తను చెప్పిన విషయాన్నే అందరు అంగీకరించాలని భావిస్తుంటారు.ఇది సత్యాన్ని అంగీకరింప నీయదు.
4))ప్రపంచాన్ని తన కోణం లోనే చూస్తాడు.తన కనుకూల మైన దానిని మాత్రమే ఇష్ట పడతాడు.
5)నిరంతరం గుర్తింపు కోరుకుంటూ ఉంటాడు.తను చేసిన ప్రతిపనిని అందరు మెచ్చు కోవాలని భావిస్తుంటాడు .ఆస్తి,అంతస్తు,నటన,పదవి,జ్ఞానం,వీటి ద్వారా నిరంతరం గౌరవాన్ని కోరుకుంటూ ఉంటాడు.తమ కంటే వేరొకరికి గుర్తింపు వస్తుందన్నా భరించలేరు.
6)వీరు ఏ పదవిలో వున్నా తమ క్రింది సిబ్బందిని తమ ప్రవర్తన ద్వారా ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
7)నేను చాలా ప్రత్యేకం ,నేను చాలా ముఖ్య మైన వ్యక్తిని అనుకుంటూ నిరంతరం ప్రాముఖ్యతను కోరుకుంటూ ఉంటాడు.
8)వీరు కొన్ని నిర్దిష్ట మయిన పద్ధతులు పాటిస్తూ ఉంటారు.వాటికి వ్యతిరేకం గా ఏమి జరిగినా తట్టుకోలేరు.రాజీ పడరు.వీరికి నచ్చజెప్పడం చాలా కష్టం.
9)వీరు నిరంతరం కీడును శంకిస్తూ,ఇతరుల లో నిరంతరం లోపాలను ఎంచుతూ ఉంటారు.వీరికి మంచి కన్నా చెడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
10)వీరు జీవితాన్ని అశాంతి,అసంతృప్తి,ఘర్షణలతో గడుపుతారు.
11) ఎప్పుడు భౌతిక వాదం లో మునిగి తేలుతూ తన అంతరంగ స్థితిని గురించిన ఆలోచన ఎప్పుడు చేయరు.
అహంకారం కలిగిన వ్యక్తులు తమకు తాము నష్టం కలిగించుకోవడమే కాక సమాజాన్ని ఎన్నో కష్ట,నష్టాలకు గురిచేస్తుంటారు.
మరి ఈ అహంకారాన్ని ఏర్పడకుండా చూసు కోవడం ఎలా?ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడం ఎలా?
తరువాయి భాగంలో వివరిస్తాను.
చాలా మంచి పోస్టు అండీ...
ReplyDeleteతరువాతి పోస్టు కోసం ఎదురుచూస్తున్నాను..
ధ్యాంక్యూ..
ధన్యవాదాలండి .ఇటువంటి వ్యాసాలు చదివి ప్రోత్సాహిస్తున్నందుకు.
Deleteమంచి పోస్ట్ అండీ...
ReplyDeleteఇలాంటివి రాస్తూ ఉండండి.
:)
ధన్యవాదాలండి .మీ వంటి వారి ప్రోత్సాహం తో వ్రాస్తూ ఉంటాను.
Deleteమీరు పరిశీలించి వ్రాసిన వాటిలో చాలా నిజాలున్నాయి...
ReplyDeleteమంచి విశ్లేషణ...
@శ్రీ
ధన్యవాదాలండి .ప్రతి ఒక్కరి జీవితం లో ఇటువంటి లక్షణాలున్న వారు తారసపడుతుంటారు.వాటి నన్నిటిని ఒక చోట కూర్చాను.
Deleteభలే రాశావు శేఖర్, , అభినందనలు, అర్జెంటుగా నన్ను నేను చెక్ చేసుకోవాలి, చాలా వున్నట్టున్నాయ్ , నాకు కూడా.
ReplyDeleteభాస్కర్ గారు, హా హా హా మీకు ఉన్నాయా ఈ లక్షణాలు..మనలో మన మాట..
Deleteనాకెప్పుడో తెలుసు..:))నిజమనుకునేరు, ఊరికే అన్నాను లెండి.
మీకు ధన్యవాదాలు .
Deletewell said..Sir
ReplyDeletechakkani parisheelana chesi telipaaru. Thank you very much!!
మీకు ధన్యవాదాలు.మన చుట్టూ జరిగే జీవితం మనకు ఎన్నో నేర్పుతుందండి.వాటి సమాహారమే ఈ వ్యాసాలూ.
Deleteఈ టపా చూసాక, మీరు ఎంత మంచి టీచరో అర్ధమయ్యింది.చక్కగా చెప్పారు..
ReplyDeleteఎవరికయినా జీవితం ఎన్నో నేర్పుతుందండి.మీరు ఇంతకంటే బాగా చెప్పగలరు.మీ అభిమానానికి ధన్యవాదాలు.
Delete"భౌతికవాదంలో మునిగితేలుతూ" అనేది అర్ధం కాలేదు రవి గారు.
ReplyDeleteఅది తప్పు కదా? భౌతికవాదం అనేది మీరు ఏ అర్ధం లో వాడారు?
అది తప్ప మిగతా అహంకారుల లక్షణాలు అనుభవంతో పరిశీలించి వ్రాసినట్లున్నారు.
వీరు భౌతిక ప్రపంచం గురించిన ఆలోచనలు చేస్తూ అంతరంగం గురించి ఆలోచించరు. అన్న కోణం లో వాడాను.పై లక్షణాలన్నీ భౌతిక ప్రపంచం లోనివే కదా!అందుకే అలావాడాను.కాని భౌతిక వాదుల్లో కూడా అహంకారం లేనివారు ఉండవచ్చు.ఆ కోణం లో మీరు కరెక్ట్ కావచ్చు. మీ సలహాలు,సూచనలు నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటున్నాయి.మీ నుండి సదా ఇలాంటివే ఆశిస్తున్నాను.మీకు ధన్యవాదాలు.
ReplyDelete