నీలిరంగు పూసిన ఆకాశం కాన్వాసుపై
ధవళ వర్ణపు బొట్టు పెట్టినట్లు
తల్లి చుట్టూ పాలకోసం తిరిగే పిల్లాడిలా
భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ
భువిపై రవి కల్పించిన రాతిరిని
వెలుగును నింపి కావలి కాస్తూ
పని ఒత్తిడిలో అలసి పవళించిన
జనజీవన స్రవంతికి చల్లని కాంతినిస్తూ
చుక్కలన్నీ బిక్కుమంటూ
మినుకుమినుకుమంటూ చూస్తుంటే
వెండి మేఘాలను మరింత మెరిపిస్తూ
పుడమి ఒడి పై పున్నమి చంద్రుడు
పిండార బోసినట్లు వెన్నెలను ప్రసరిస్తుంటే
నా తనువులోని అణువణువూ
పరవశంతో మైమరిచి పోతుంది
పౌర్ణమిలో ధ్యానం చేస్తుంటే
నా శ్వాసలో మలయ పవనపు సందడి
నా మేను వెన్నెల్లో జలకమాడిన అనుభూతి
నా వీనుల్లో మురళీరవపు మంద్రనాదాలు
మెల్ల మెల్లగా మనసంతా ఆలోచనారహిత స్థితి
శూన్యం మదినిండా ఆవరించిన అలౌకిక స్థితి
అంతఃశ్చేతనలోని చైతన్యం
పురి విప్పిన మయూరపు నాట్యమై
వెన్నుపూసనుండి జరజరా పైకి ప్రాకి
మెదడంతా ఆక్రమించిన విద్యుత్తేజమై
శిరసునిండా విశ్వమంతా పరచుకున్నట్లు
ఓ సంపూర్ణ సహజానందం
దేహమంతా వ్యాపించింది
గురు పూర్ణిమ రోజున చంద్రుని చూసి మైమరిచి మిమ్మల్ని మీరే మరచిపోయి సంపూర్ణ సహజానందం అనుభవించారన మాట!
ReplyDeleteఅద్భుతం గా అనిపించింది నాకు మీ వర్ణన , కవిత!
ఎంత తన్మయం చెందకపోతే ఇలాంటి కవిత రాయగలరు?
చాలా బాగుంది రవి శేఖర్ గారు.
ఆర్ట్ అఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారి స్వరం తో కూడి వేణు నాదం తో కలిసిన క్యాసెట్ వినిపిస్తుంటే గురుపౌర్ణమి రోజున ధ్యానం లో కలిగిన అనుభూతికి కవితారూపమిది.ఆ రోజు వెన్నెల ఎంత అద్భుతంగా అనిపిం చిందో!మీరు సరిగ్గా కవితలోని సందర్భాన్ని కవి అంతరంగాన్ని చాలా బాగా పసిగట్టగలరు.మీకు ధన్యవాదాలు వెన్నెల గారూ!
Deleteచాలా బాగా వర్ణించారు అండీ.. సూపర్...
ReplyDeleteధన్యవాదాలు సాయి గారు మీకు అంత బాగా నచ్చినందుకు
Deleteచాలా బాగుంది రవి శేఖర్ గారు.....:)
ReplyDeleteధన్యవాదాలు సీత గారు మీకు అంతలా నచ్చినందుకు.
Deletechaalaa goppaga undi sekhar, varnana, keep writing.
ReplyDeleteధన్యవాదాలు మీ ప్రశంసకి మీకు నచ్చినందుకు .
Deleteపున్నమి వెన్నెల వర్ణణ చాలా బాగుందండీ..
ReplyDeleteధన్యవాదాలు మీకు.
Deleteవర్ణన చాలాబాగుందండి!
ReplyDeleteధన్యవాదాలండి
Deleteనా శ్వాసలో మలయ పవనపు సందడి
ReplyDeleteనా మేను వెన్నెల్లో జలకమాడిన అనుభూతి
...............................
ఓ సంపూర్ణ సహజానందం
దేహమంతా వ్యాపించింది...
చాలా బాగుంది రవి శేఖర్ గారూ!
@శ్రీ
ధన్యవాదాలండి శ్రీ గారు మీ అభినందనకి.
Deleteరవి శేఖర్ గారూ , వర్ణన బాగుంది ముఖ్యంగా చంద్రుని గూర్చిన వర్ణన, కవిత చక్కగా ఉంది.
ReplyDeleteధన్యవాదాలండి మీకు.
Delete