కుసుమ కోమల హృదయిని నీకు నీరాజనం
పారాణి పూసిన నీ పాదాలు కవితామయం
నీ మెడ లో జాలువారిన ముత్యాలసరం
సచ్చీలత సంగమించిన సునంద కావ్యం
షట్సూత్రాల సారం మదించిన విరించి
కాలూనిన భూమిలో పలుకును విపంచి
గాలిలో ప్లవిస్తూ సాగిన నీ గాత్రం
నా వీనులను చేరినది ఆ స్తోత్రం
ప్రభాతాన అరవిరిసిన మందారం
నీ జడలోనే దానికి సింగారం
చిద్విలాసం నీ దరహాసం
ఆల్చిప్పలు నీ నేత్రద్వయం
కవితకు అందని నీ ఆకృతి
మైమరచింది ఈ ప్రకృతి
కవితను స్త్రీ తో సరిపోల్చారు.
ReplyDeleteబాగుంది.
Awesome!!!!
ReplyDeleteకవిత అందంగా ఉంది!
ReplyDeleteజాహ్నవి గారికి స్వాగతం.వనజ,వెన్నెల,జాహ్నవి గార్లకు మీ స్పందనలకు ధన్యవాదాలు.
ReplyDeleteరవీ ,
ReplyDeleteకవిత బాగుంది
ఎన్నాళ్ళకు నీ కలం రస హృదయ సీమల వైపుగా సాగింది
కుసుమ కోమలాలు కలకూజితాలు మందార మకరందాలు వెదజల్లింది
కవితకు అందనిది ఏదీ లేదు.. కళా హృదయం ఉంటే ఏదీ అసాధ్యం కాదు
అభినందనలు
స్వాగతం సర్!మీరెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను.!నా బ్లాగు అడ్రస్ గమనించలేదేమో అనుకున్నాను.మీ పరిశీలన ,విశ్లేషణ చాలా బాగుంటాయి.మీ కవితా సౌరభాలు ప్రపంచమంతా వెదజల్లుతుంటే హృదయపూర్వకం గా ఆహ్వానించాను.మీరు నా "కవితారవి" చూసి స్పందిస్తారనుకున్నాను.చూడలేదేమో అనుకున్నాను.ఒకసారి చూసి మీ స్పందన తెలియ చెయ్యండి.అలాగే జీవితం లోని విభిన్న విషయాల ఫై వ్యాసాలు వ్రాస్తున్నాను.మీలాంటి కవి హృదయం మాత్రమే వాటిని గమనించగలదు.మరొక్కసారి మీకు ధన్యవాదాలు.
ReplyDeletechaalaa baagundi dear mee yee kavita dear Oddularavisekhar...."కవితకు అందని నీ ఆకృతి మైమరచింది ఈ ప్రకృతి"...Nutakki Raghavendra Rao.
ReplyDeleteధన్యవాదాలు .
ReplyDelete