Friday, 6 April 2012

బాలల బాంధవి

ఓ స్వరం
మూగగా రోదిస్తున్న కోట్లాది చిన్నారుల గొంతయింది
బాదల్ని భరిస్తున్న బాల కార్మికుల హృదయ స్పందనయింది
                తొలి అడుగు వేసేటపుడు ఎన్నో అడ్డంకులు
                 మలి అడుగులో ఎన్నో కళ్ళల్లో మెరుపులు
కాయలు కట్టిన చేతులు
బరువులతో వంగిన భుజాలు
పని అలసటలో దైన్యం  నిండిన  కళ్ళు
విప్పారి చూసిన  క్షణం
            తమ నేస్తాన్ని చూసుకొని
             వారి మనసు ఆకాశ మంత య్యింది
వెట్టిలోనుంచి,నిర్భందాలనుంచి
గనుల్లోనుంచి ,పరిశ్రమలనుంచి
పొలాల్లోంచి,అన్ని బంధనాల్లోంచి
పరుగు పరుగున పలకా బలపం
పట్టుకున్న క్షణాలు వారికో అద్భుతం
                స్వేచ్చ లోని  మాధుర్యమేమిటో
                ఆత్మీయత అంటే ఏమిటో
                అక్షరాల్లో వున్న ఆకర్షణ ఏమిటో
                చదువు లోని ఆనంద మేమిటో
                అమ్మ ప్రేమ లోని కమ్మదన మేమిటో
                చవి చూపించిన శాంతమ్మ
ఒడుల్లాంటి బడులలో బంగారు భవిష్యత్తు
కోసం  కలలు  కంటున్న  లక్షల మంది  చిన్నారుల
 కనురెప్పల వెనుక కమ్మని కల అయ్యింది
                బడి బయట వున్న   ప్రతి పిల్లాడు బాలకార్మికుడని  
                పిల్లలు వుండాల్సింది బడులలోనే , పనుల్లో కాదని
బాల కార్మికత్వానికి కారణం పేదరికం కాదని
సమాజ అంగీకారమే లేత చేతులకు సంకెళ్ళని
 ప్రభుత్వ విధానాలను సమూలంగా మార్చిన సిద్ధాంతం
రామన్ మెగసెసే అవార్డ్ అయింది ఆమె సొంతం
 అందుకే అయింది ఆమె బాలల బాంధవి
                                           ప్రధమ బాలల హక్కుల చైర్ పర్సన్ గా రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత dr.శాంతా సిన్హా నియమించ  బడిన సందర్భముగా వ్రాసి సమర్పించ బడ్డ కవిత  . 

4 comments:

  1. ప్రస్తుతం కూడా ఆమె రెండవసారి బాలల హక్కుల జాతీయ చైర్మన్ గా వున్నారు.ప్రాధమిక విద్యా హక్కు బిల్ తయారీ లో కీలక పాత్ర వహించారు.ఆమె hyderabaad లోని central university proffessor.ఆమె ఆధ్వర్యం లో మేము బాల కార్మికుల ఫై కొంత work చేశాము.ఆమెకు స్వయంగా ఈ కవితను అందించాను.మీ స్పందనకు thanks.

    ReplyDelete
  2. very nice. konda mundu addamlaa chaalaa chinnadi. aame sevalaku mee kavitaa praNaamamulu baagunnayi.

    ReplyDelete
  3. ఆమె లక్ష మంది బాల కార్మికులను బడులలొ చేర్చగలిగింది.దానికి వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వచ్చందంగా పనిచేసారు.అందుకు ఆమెకు రామన్ మెగసెసె అవార్ద్ వచ్చింది.అటువంటి వారితో ముఖాముఖిగా సమావేశాల్లో పాల్గొని పని చేసినందుకు మాకు ఆనందం . ధన్యవాదాలు.మీ సైట్ లో వ్యాఖ్యలు తీసివేయటం వలన మీకు మా అభిప్రాయాలు చెప్పలేకపోతున్నాము.

    ReplyDelete