రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎట్టకేలకు admissions పూర్తి చేసుకుని తరగతులు ప్రారం భిస్తున్నాయి విద్యార్థులు EAMCET వ్రాసిన 4 నెలలనుండి ర్యాంకుల కొరకు,ప్రవేశాలలోఏర్పడిన ప్రతి ష్టంబనలోని స్పష్టత కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి తాము కోరుకున్న కళాశాలల్లో చేరటంతో విద్యా సం:ప్రారంభమయ్యింది.inter లోఅనుభవించిన ఒత్తిడి తగ్గిపోయి స్వేచ్చా వాతావరణంలోకి సీతాకోక చిలుకల్లా అడుగు పెట్టారు.తల్లిదండ్రులు తమ ఆశలను,ఆకాంక్షలను వారిలో నింపి వారిని కళాశాలలకు పంపారు.ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు విద్యార్థులు యాజమాన్యాలు గుర్తించాల్సిన అంశం గురించి చర్చిద్దాం.
కళాశాలల్లో అడుగిడగానే అంతకు ముందే చదువుతున్న విద్యార్థులు(వీరిని seniors అంటారు) కొత్త గా చేరిన వారిని (వీరిని juniors అంటారు)పరిచయం చేసుకుంటారు.ఈ పరిచయం స్నేహం పెంపొందటానికి,విద్యార్జనలో సహ కరించుకోవటానికి,కొత్త వారిలో బెరుకు పోగొట్టి స్నేహితులుగా మార్చుకోవడంలో సీనియర్ విద్యార్థులు చొరవచూపి జూనియర్ విద్యార్థులకు మార్గ దర్శకత్వం వహించటం వరకు అర్థం చేసుకోదగినదే!
ఇలా ప్రారంభమయిన ఈ కార్యక్రమం ఎన్నివికృత పోకడలు పోయిందో!ఎన్ని జీవితాలు బలి అయ్యాయో మనం ఏటా చూస్తున్నాం.జూనియర్స్ ను సీనియర్స్ ఆట పట్టిస్తూ సాగే ఈ తంతును ర్యాగింగ్ అని పిలుస్తుంటారు.ఇంటర్ నుండే ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్లో చేరిన విద్యార్థుల్లో బిడియస్తులు మొహమా టస్తులు,సిగ్గుపడే తత్వం,బెరుకు మనస్తత్వం,ఇతరులతో కలవలేనివారు,సున్నిత మయిన మనస్కులు ఇలా ఎంతో మంది ఉంటారు.వాస్తవానికి కాల క్రమేణ వీరంతా పరిస్థితులకు తగ్గట్లు మారి అందరిలో కలిసి పోతారు.కానీ వెళ్ళగానే ర్యాగింగ్ పేరుతో వీరి చేత చేయరాని పనులు చేయిస్తూ సీనియర్స్ పొందే పైశాచిక ఆనందానికి ఎన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసాయో!ఎంత మంది చదువులు మానేసారో!
ఈ విష సంస్కృతికి కారణ మేమిటి?ఎందుకు తోటి మనుషుల పట్ల ఇటువంటి అనాగరిక ప్రవర్తను కనబరుస్తా రు? తమ అన్నలు,అక్కలు,చెల్లెళ్ళు,తమ్ముళ్ళు కూడా ఇతర కాలేజీల్లో ఇదేవిధంగా ఇబ్బంది పడి ఉంటారు కదా !స్వయంగా తామే ఆ ఇబ్బందులకు గురయి బాధలు పడి కూడా ఇలా ఇంకొకరిని ఎలా బాధించ గలగుతున్నారని కొంత మంది విద్యార్థులను అడిగితే వారిచ్చిన సమాధానం వింటే తల తిరిగినంత పనయ్యింది.తాము ఇంతకు ముం దు పొందిన బాధకు ప్రతీకారంగా ఇంకొకరిని ఆ విధంగా బాధిస్తే వారికి ఆనందం కలుగుతుందట.దీనిని ఒక రకం గా sadism అంటారు.ఈ మనస్తత్వం పిల్లలకు కాలేజీలకు వెళ్లాకే ఏర్పడుతుందా!
దీనికి బాల్యం నుండి వారి కేదురైన అనుభవాలు,వారు శిక్షింపబడిన జ్ఞాపకాలు వారిలో ఆ విధ మైన కసి ప్రతీ కారం కలగటానికి ఆస్కారం కలిగించి ఉంటాయి.మరియు పాటశాలలు,కళాశాలలు వారికి ఎటువంటి నైతిక విద్యను అందించకపోవటం ఒక కారణం.అయినా తల్లిదండ్రులు తమ పిల్లకు కాలేజీలకు వెళ్ళేటప్పు డు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు.అయినా ఇలా జరుగుతూనే ఉంది.ప్రస్తుత మైతే ర్యాగింగ్ కు వ్యతిరే కంగా కటినమైన చట్టాలు ఉన్నాయి ఇలాంటి ప్రవర్తన కలిగిన విద్యార్థులను మరల ఎక్కడా చదవకుండా నిషేదించవచ్చు.అలా యాజ మాన్యాలు ధృవీక రణ పత్రాలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ ఇంకా చాలా కాలేజీల్లో ఈ సంస్కృతి ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
యాజమాన్యాలు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేయాలి.మొదటి సం:విద్యార్థులు చేరగానే వారే college లోని అందరు విద్యార్థులను సమావేశ పరిచి counsilling psychologist లసహాయంతో శిక్షణ ఇప్పించాలి.చట్టంలోని కఠిన నిబంధనలు తెలియజేయాలి.అప్పుడు ఇటువంటి ఆలోచనలు మనసులో నుండి వైదొలుగుతాయి.అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల్లో స్నేహభావన ,పరస్పరం సహకరించుకునే తత్వం,నాయకత్వ లక్షణాల్లాంటి అంశాలను వారి కి ఆ శిక్షణలో నేర్పిస్తే ఈ సంస్కృతి తగ్గిపోతుంది విద్యా ర్థులు కూడా అలా ప్రవర్తించే ముందు తమ తల్లిదండ్రు లను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటే అటువంటి విష సంస్కృతి నుండి బయట పడగలుగుతారు.చక్కటి స్నేహ పూర్వ క వాతావరణంలో ,మంచి విద్యనూ నేర్చుకొని ఉపాధి సంపాదించుకొని తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా ఇంజి నీరింగ్ విద్యను పూర్తి చేసుకోగలరు.
Thank you for the post sir. Ragging of Jr's should be stopped either by Mgmt. or by Govt. The wish of public sense and their safety in this post is appreciable.
ReplyDeleteధన్యవాదాలు శ్రీనివాస్ సర్!మీ బ్లాగ్ లో దీనికి ప్రాధాన్యత ఇచ్చిషేర్ చేసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు.
Deleteసర్, మంచి విషయం చెప్పారు.
ReplyDeleteఏదైనా ఇతరులను ఇబ్బంది పెట్టె విష సంస్కృతి ని నిషేదించాలి.
విద్యార్థుల జీవితాలు ఎంతో విలువైనవి.అది వారు గుర్తించాలని వ్రాసాను.మీకు ధన్యవాదాలండి.
Deleteఇది ముందంత ధారుణంగా ఇప్పుడు జరగడంలేదని నా అభిప్రాయమండి.
ReplyDeleteమీరు చెప్పిందిం నిజమే!కానీ ఎక్కడయినా ఉన్న ఆ కొద్దిగా కూడా నిషేదింపబడాలని,వారిలో చైతన్యం రావాలని వ్రాసాను.మీ స్పందనకు ధన్యవాదాలండి.
DeleteOld students are once upon new only:)
ReplyDeleteనిజమే అనికేత్ గారు!వారు పడ్డ బాధ మరొకరికి రాకూడదని ఆలోచించాలి కానీ దానికి విరుద్దంగా జరుగుతుంది ఈ విషయం లో !మీకు ధన్యవాదాలు.
Deleteమేనేజ్మెంట్ సరైన చర్యలు తీసుకుంటే...
ReplyDeleteఈ ర్యాగింగ్ అనేది సమూలంగా పెకలించబడుతుంది...
మంచి పోస్ట్ రవి శేఖర్ గారూ!
అభినందనలు.
@శ్రీ
చాలా వరకు ప్రస్తుతం managements జాగ్రత్త గానే ఉంటున్నాయి .కానీ పూర్తిగా నైతే పోలేదు.ధన్యవాదాలు శ్రీనివాస్ గారు!
Delete