Saturday, 1 September 2012

అంతరంగ యాత్ర

                ఏకాంతంలో మనలో ఏం జరుగుతుంది?మనకు మనం దగ్గరగా ఉంటాము.మన మనసు మన గురించే ఆలోచిస్తుంది.మన లోపలి ప్రతి ఆలోచన,భావం మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి.ఇంకా ఏం చేస్తే బాగుంటుం  ది.ఏకాంతంలోమనం మన అంతరంగాన్నిశోధిస్తూ వెళ్ళాలి ఆ సాధనలోమనకు మనం పూర్తిగా అర్థమవుతుంటాము ఈ ప్రక్రియలో ఎప్పటినుంచో మన మనసులోని సంస్కారాలు,వికారాలు,మన ప్రవర్తన,మన అలవాట్లు,మనం చేసిన పనుల్లోని మంచి చెడ్డలు,మన గుణగణాలు,మన బలాలు,మన బలహీనతలు,మన లోటుపాట్లు వంటి వన్నీ అలా వరుసగా అలలు అలలుగా ఆ యాత్రలో మనకు దర్శన మిస్తాయి.ఎటువంటి విశ్లేషణలు చేయకుండా,ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా వాటిని గమనిస్తూ ఉంటె మనకు మనం మరింత అర్థమవుతుంటాము.
              జీవన ప్రవాహంలో మనం ఎటు వైపు వెడుతున్నామో కూడా మనకు తెలుస్తుంటుంది.ఆ ప్రక్రియలోమనం ఇంతకు ముందు ఎవరిన యినా అనాలోచితంగా అన్న మాటలు,ఎవరినయినా ఇబ్బందులకు గురిచేసే పనులు చేసి ఉన్నాఅన్నీగుర్తొస్తాయి.మన మనసులో పేరుకుపోయిన ఎన్నోసంఘటనలు,అవి కలిగించిన ప్రభావాలు,వాటికి మన  ప్రతిస్పందనలు అన్నీ తెరపై ప్రత్యక్షమయినట్లుగా మనకు కనిపిస్తాయి.వాటిని అలాగే గమనిస్తే అందులోని సంక్లిష్టత లు మెల్లగా తొలగి పోతుంటాయి.మన జీవితంలోని ఎన్నో సమస్యలు,కష్టాలు,కన్నీళ్లు బాధలు,సుఖ సంతోషాలు ఒక టేమిటి?మన ప్రతిస్పందనలన్నీ మనకు పునర్దర్శన మిచ్చి మన అంతరంగం మనకు దృశ్య రూపం లో కన్పిస్తుంది.
             ఈ అంతరంగ యాత్రను ఎవరికి వారు చేయాల్సిందే.ఆ యాత్రను ధైర్యంగా మొదలు పెట్టిన వారికే  అందు లో వచ్చే మార్పేమిటో అర్థమవుతుంది.ఈ యాత్రకు ఎటువంటి సాధనాసంపత్తి అక్కరలేదు.తమ మనసు లోపలి పొరల్లోకి తామే ప్రయాణించటం.ఈ యాత్ర ప్రతిరోజు జరిపితే మన మనసంతా తేలిక పడుతుంది.ఇది చాలా సాధార ణంగా ఏ స్థితిలో కూర్చున్నా ,పడుకున్నాఅటు ఇటు డాబా పైనో, గార్డెన్ లోనో నడుస్తున్నాచేయవచ్చు.ఇది ఎలాగైనా మన ఏకాంతంలోజరగాల్సిన ప్రక్రియ.దీనికి ఏ విధమైన నియమ నిబంధనలు లేవు.ఎటువంటి ఏర్పాట్లు లేవు ఎప్పు డు కుదిరితే అప్పుడు చేయవచ్చు.దీనికి ఎవరి సహాయము అక్కర లేదు.దీనిని మనకు ఎవరు నేర్పవలసిన పని లేదు.
             మానసిక విశ్లేషణ కూడా మన జీవితంలో మార్పుకు ఉపయోగ పడుతుంది.కానీ దాని కంటే ఇది మరింత గా మనకు తోడ్పడుతుంది.ఈ యాత్ర నిత్యం చేస్తుంటే మనం మనకు కొత్తగా,నూతనంగా ఆవిష్కరింపబడతాం.ఆ నూతనమైన,సజీవమయిన మనసుతో కొత్త పరిస్థితులను ఎదుర్కోవటం,కొత్త సంఘటనలకు మన మనసు ప్రతి స్పందనలు విభిన్నంగా ఉంటాయి.ఎదుటి వారికి మనం కొత్తగా కనిపిస్తాము.ఇంటిలో,బయటా మనతోఉండే వారిపై ఈ ప్రభావం పడుతుంది.అందులోనుండే అవగాహనతో కూడిన,స్నేహ పూరిత మైన,ప్రేమతో కూడిన మానవ సంబం ధాలు ఏర్పడతాయి.మనిషి జీవిత మంతా ఇతర వ్యక్తులతో అతని ప్రవర్తన మీదనే అతని వ్యక్తిత్వం అంచనా వేయ బడుతుంది.మనం సంఘ జీవులం కనుక ఈ సంఘంలో అందరితో కలిసి మెలసి మెలగ వలసిందే. ఈ మారిన మన సుతో మన చుట్టూ ఉన్నవాతావరణం మనకు మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది.మన లోని మార్పు ప్రభావం పరిస రాలపై కుడా పడుతుంది.మన మనసులో కలిగే ఆనందం ఇంకొకరికి ప్రసారం అవుతుంది.   

22 comments:

  1. Replies
    1. మీకు స్వాగతం సర్.ఈ వ్యాసంలోని విషయం తో ఏకీభవించినందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
  2. శేఖర్ గారూ, మీరన్నది నిజమే మానసిక విశ్లేషణ చేసుకోవాలంటే ముందుగా ఆత్మవిమర్శ కావాలి
    అప్పుడు మాత్రమె మనలో ఉన్న గుణాన్ని మార్చుకోగలం. ఏది ఏమైనా మనం మనల్ని మార్చుకోగలగాలి.
    మంచి పోస్ట్.....మెరాజ్

    ReplyDelete
    Replies
    1. మార్పు వైపు పయనించాలనే ఆకాంక్ష వుంటే మనిషి తన కనువైన ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొంటాడు.మీ విశ్లేషణ బాగుంది.మీకు ధన్యవాదాలు.

      Delete
  3. రవిశేఖర్ గారూ!
    చాలా బాగా వ్రాసారు...
    ఇలాంటి వ్యాసాలూ వ్రాయడంలో మీది అందే వేసిన చేయి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు!

      Delete
  4. రవిశేఖర్ గారూ, కొత్తగా అనీంచింది మీ వ్యాసం.అంతరంగయాత్ర. ఒంటరిగా ఉన్నప్పుడు మనలో జరిగే భావ సంఘర్షన, మనల్ని మన విశ్లెషించుకోవడం, తద్వారా మనలని మనం నూతనం గా ఆవిష్కరించుకోవడం.బాగుందండి ఎప్పటిలాగా మీ వ్యాసం.

    ReplyDelete
    Replies
    1. ఇందుకోసం కొంత సమయం అది ఎంత తక్కువయినా కేటాయించగలిగితే మన భావ సంఘర్షణ తగ్గి మనసు ప్రశాంతమవుతుంది.మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారు

      Delete
  5. రవి శేఖర్ గారు "అంతరంగ యాత్ర" చాలా బాగుంది. ఈ బ్లాగు చూడడం ఇదే మొదటిసారి. అంతరంగలో ప్రయాణించడం వలన తను జీవితంలో ఏ దిశలో ప్రయాణిస్తున్నాడో, ఎలా ప్రయాణిచాలో విశ్లేషణ చేసుకోవచ్చు

    ReplyDelete
    Replies
    1. స్వాగతం నాగేశ్వర రావు సర్!ఎవరికీ వారు ఇలా ఆలోచించగలిగితే చాలా సమస్యలు సులభంగా పరిష్కార మవుతాయి కదా!మీ స్పందనకు ధన్యవాదాలండి .మీ బ్లాగు లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సర్.

      Delete
  6. మీరు చెప్పింది వాస్తవం, ప్రతిఒక్కరూ చేయాల్సిన యాత్ర ఇది. చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. అలా చేయగలిగితే మనసు నిర్మలమై కొత్త ఉత్సాహం పుడుతుంది .మీకు ధన్యవాదాలు.

      Delete

  7. అంతరంగ తరంగాలు పోస్ట్ చాలా బాగుంది సర్. మీ విశ్లేషణ లో ఒక్క క్షణం నా గతం కళ్ళ ముందే కదిలింది. ఆ ముద్రలు అంత బలమైనవి. నిద్రాణమైన నా ఆలోచనల తరంగాలకు మేలుకొలుపు పాడారు. చాల కృతజ్ఞతలు.

    శ్రీనివాసరావు తంగా

    ReplyDelete
    Replies
    1. స్వాగతం సర్!మీ స్పందన నాకు నూతనోత్సాహాన్నిచ్చింది.మీరు అంతలా అంతరంగ యాత్ర చేసినందుకు మీకు ధన్యవాదాలు.మీ బ్లాగులో మీరు ఎంతో మంది ఉపాధ్యాయులకు ఎంతో మంచి సమాచార మిస్తూ మీ కాలాన్ని వెచ్చించి ఎంతో సేవ చేస్తున్నారు.మీ స్పందనకు ధన్యవాదాలు .

      Delete
  8. "మనిషి జీవిత మంతా ఇతర వ్యక్తులతో అతని ప్రవర్తన మీదనే
    అతని వ్యక్తిత్వం అంచనా వేయ బడుతుంది."

    నిజమేనండీ మంచి విషయాలుచెప్పారు..

    ReplyDelete
  9. రవి శేఖర్ గారు! మీ వ్యాసం నూతనంగా, మనసును హత్తుకునెలా వుంది.

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారు! స్వాగతమండి.మీ మనసుకు హత్తుకున్నందుకు నా మనసుకు చాలా ఆనందంగా వుంది సర్.మీకు ధన్యవాదాలు.

      Delete
  10. Replies
    1. మీకు స్వాగతమండి.ధన్యవాదాలు మీరు మెచ్చినందుకు.

      Delete
  11. ముందుగా "అంతరంగయాత్ర" ని మాకందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఇంచుమించుగా "ధ్యాన ప్రక్రియకు" సమంతరామేమో అని అనిపిస్తుంది. అంతరంగయాత్ర - ఆత్మశోధన. ధ్యానంలో ఆలోచనా సరళిని త్రుంచివేస్తూ అంతరంగంలో జరిగే ప్రక్రియలను గమనిస్తూ ఉంటాము. అప్పుడు కూడా గతానుభవాలు, మీరు చెప్పిన
    "" సంస్కారాలు,వికారాలు మొ|| వన్నీ మనకు దర్శన మిస్తాయి. అంతరంగ యాత్రలోనూ, ధ్యానంలోనూ కూడా వాటికి ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా వాటిని గమనిస్తూ ఉంటె మనకు మనం మరింత అర్థమవుతుంటాము. ఇది చాలా సత్యం. దీనికి తోడు ధ్యానంలో ఒకానొక స్థితిలో ఆలోచనా సరళి ఆగిపోయి... విశ్వశక్తి మనలోకి అశేషంగా ప్రవహించడం వలన మనం ఆరోగ్యవంతులం కూడా అవుతాము. (సారీ... నా అంతరంగాన్ని శోధిస్తూ మీ అంతరంగయాత్ర గురించి ఏదేదో రాసినట్టున్నాను.) నిజానికి మీ విశ్లేషణ చాలా బాగుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మీకు స్వాగతమండి.ధ్యానానుభావాలు నాకు ఉన్నాయండి.కానీ ధ్యానం కంటే దీన్ని ముందు స్టేజి గా చెప్పుకోవచ్చు .ఎందుకంటే దీనికి కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు,స్థిరమైన ఆసనస్థితి అవసరం లేదు,ఆలోచనాలను ఆపివేయాల్సిన పని లేదు .అలాగే ఎవరయినా చేయవచ్చుఅంటే పద్ధతి లేదు కాబట్టి.మీ అనుభవాలు ఇంకా అద్భుత మైనవి.కాకపోతే కొన్ని ఫలితాలు అందులోవి ఇక్కడ కూడా సాధ్యపడతాయి.ధ్యానం గురించి మరోపోస్ట్ లో వివరిస్తాను.మీ అభిమానానికి,విశ్లేషణకు,మీ ప్రతిస్పందనకు నెనర్లు.

      Delete