ఓ స్వరం
ఓ పిలుపు
ఒక విభ్రమం
ఒక సంభ్రమం
ఉఛ్ఛ్వాసం మరచిన
నిశ్వాసం నిలిచిన
ఆ క్షణం సుదీర్ఘ నిరీక్షణం
నిశ్శబ్దాన్ని చేధించిన శబ్ద సౌందర్యం
జ్ఞాపకాల పుటలపై పుప్పొడి పరిమళం
అనంత అంతరం అంతరించిన వేళ
మనసంతా వెన్నెల ప్రసరించినట్లు
ఆశ్చర్యం ఆనందం ఉత్తేజం ఉల్లాసం
చేజారిన అమృత కలశం
చిక్కిన చక్కని భావన
:)) బాగుంది!
ReplyDeleteచక్కని భావం.
ReplyDeletevery nice!!
ReplyDeleteవెన్నెల గారు,పద్మార్పిత గారు,వనజ గార్లకు ధన్యవాదాలు మీ స్పందనలకి .
ReplyDeleteచేజారిన అమృత కలశం ,చిక్కిన చక్కని భావన
ReplyDeletechakkani bhavana endhukovthundi?