మాతృభాషా దినోత్సవం
మన జీవితమంతా మన ఎదుగుదలకు,మన వికాసానికి ఉపయోగపడేది మన మాతృభాష.అమ్మ మనకు గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించే భాష .దాన్ని జీవితమంతా కాపాడుకోవాలి.మన పిల్లలకు ఆ భాష లోని మాధుర్యాన్ని గ్రోలేటట్లు చెయ్యాలి.మాధ్యమాల చర్చ ప్రక్కనపెడితే ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు తమ భాషను మర్చిపోకుండా బాధ్యత తీసుకోవాలి.అమ్మ,నాన్న అని పిలిచే పలుకులలోని తియ్యదనం మమ్మీ డాడీ లలో ఎక్కడ వస్తుంది.తాతయ్య,అమ్మమ్మ పిలుపుల్లోని కమ్మదనం గ్రాండ్ పా,గ్రాండ్ మా లో వస్తుందా.!విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు మన మాతృ భాషా పరిరక్షణకు ఎంతగానో తపిస్తుంటే ఇక్కడ ఉన్న మనకు నిర్లక్ష్యంగా వుంది.
ఒక చేదయిన వాస్తవమేమంటే ఆంగ్ల మాధ్యమం లో చదివే పిల్లలకు ఆంగ్లం రావటం లేదు ,తెలుగు రావటం లేదు .విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు వున్నాయి.విదేశాలలో వున్నవారు ఏదోఒక విధం గా మీ బిడ్డలకి మాతృభాషలోని మధురిమలు పంచండి.క్రొత్త భాష రావాలంటే ఎంతో కష్ట పడతాము.మరి తల్లి భాషను దూరం చేసుకుంటే ఎలా?

No comments:
Post a Comment