ప్రేమికుల రోజు
ప్రేమ వుందని గుర్తు చేసుకోవటానికా!లేక ప్రేమ ను ప్రదర్శించటానికి ఒకరోజు కావాలా !ప్రస్తుత ప్రేమలను విశ్లేషిస్తే ఒకింత భాదేస్తుంది.సినిమాలు,సెల్ పోన్ సందేశాలు,సరదాగా తిరగటం ,తరువాత ఎక్కువ శాతం విడిపోవటం .అసలు ప్రేమ అంటే ఏమిటి ?ఆకర్షణా ,లేక ఇష్టమా,తను లేకపోతే జీవించ లేనంత అనురాగమా !కబుర్లు చెప్పుకోవటానికి షికార్లు చేయటానికి ఒక అమ్మాయి కావాలా !అసలు యువత దేనికోసం ఇలా తపిస్తుందో !
తమ కర్తవ్యాలను విస్మరించి కలాశాలలంటే ప్రేమించుకోవటానికే అన్నట్లు,చదువును నిర్లక్ష్యం చేస్తూ కన్న తల్లితండ్రులలను కడుపు కోతకు గురిచేస్తూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలాప్రవర్తిస్తుంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్దలు విలవిల్లాడి పోతున్నారు .
ప్రేమకు నేనేదో పూర్తి వ్యతిరేకమనుకునేరు .ఒకవేళ ప్రేమించుకుంటే ,ఎంత హుందాగా ఆప్రేమను చదువయ్యేవర కు కొనసాగించాలి.ఎక్కడా హద్దులు దాటని ప్రేమ ని గుండెల్లో నింపుకుని తమ చదువులను ప్రేమ కోసం మరింత పట్టుదలగా తీసుకొని జీవితం లో స్థిరపడ్డ తరువాత ఆ ప్రేమను పెద్దలకు చెప్పి ఒక్కటయితే ఎంత బాగుంటుంది .అలా చేయకుండా సరదాల పేరుతో తిరిగి చదువులు పాడుచేసుకునే ప్రతి విద్యార్థి తల్లి తండ్రులకు ద్రోహం చేస్తున్నట్లే !
మనం ఏపని చేసినా మన అభ్యున్నతికి అది పనికి వచ్చేట్లుగా వుండాలి.మనతల్లితండ్రులు గర్వంగా చెప్పుకునేట్లు వుండాలి.జీవితం లో ఒక మంచి స్థానానికి చేరుకోవాలి.ఆ దిశలో యువత ప్రయత్నాలు వుండాలి.
ఇందుకు కుటుంబ విలువలు ,మన సంప్రదాయాలు ,నైతికత,వ్యక్తిత్వ వికాసం దోహదం చేస్తాయి .
యువత కో సలహా !ముందు మంచి స్నేహితుల్లా వుండండి .అభిప్రాయాలను పంచుకోండి.అన్నిసరిపడితే చదువయ్యేంత వరకు ఆగి అప్పటికి అవతలి వ్యక్తి తో నేను జీవితాంతం గడపాలి అన్నంత ఇష్టముంటే మీ ప్రేమను ప్రకటించండి.లేదంటే స్నేహంగా విడి పొండి.అంతేగాని తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి.జీవితం చాలా విలువయినది .ప్రేమ అవతలి మనిషి ఉన్నతిని కోరాలి.ఫలించకపోతే చంపటం, చనిపోవటం కన్నవారికి తీరని వేదనే .
ఒకమనిషిని మనం ఇష్టపడుతున్నామంటే వారికి ఇష్టముండాలని లేదుగా!మన ఇష్టం వారికి కష్టం కలిగించ కూడదుకదా!
ప్రేమించిన హృదయం ప్రేమను పంచాలే కాని విషం చిమ్మకూడదు .నిజమైన ప్రేమలో అవతలి వ్యక్తి అభిప్రాయాలను గౌరవించటం,దయ,అనురాగం ఆత్మీయత,మిళితమై ఉంటాయి .ప్రేమించటం ,ప్రేమించ బడలేకపోవటం
లాంటి విషయాలను తీవ్రంగా తీసుకోకండి .ప్రేమించి పెళ్ళిచేసుకున్న వాళ్ళకంటే పెద్దలు కుదిర్చిన సంబంధాలే ఎక్కువశాతం విజయం సాదిస్తున్నాయి .పెళ్లి అయిన తరువాత జీవితాంతం ప్రేమించుకోవచ్చు .
యువతీ యువకులు ఈ దిశగా ఆలోచించండి
చాలా బాగా చెప్పారండీ.. మీరు చెప్పింది అక్షరాలా నిజం......
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు.మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను.
ReplyDelete