పోటీలగురించి వినగానే ముందు పేరే చిత్రంగా అనిపించింది. క్రియ అంటే చేయడం,verb. పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. ఖమ్మం బాలోత్సవ్ చూడటం ఎప్పుడూ కుదర్లేదు. ఇదయినా చూద్దాం అని బలంగా అనుకొని facebook మిత్రుడు రాంబాబు తోట గారికి ఫోన్ చేస్తే సాదరంగా ఆహ్వానించారు. ఒక్కరన్నా తోడు వస్తారా అని friends ని అడిగితే ఎవ్వరూ సుముఖత చూపలేదు. "Ignite young minds "సంస్థ మార్కాపురం MLA శ్రీ K. నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలోఇటువంటి పోటీలనే గత ఏడాది నుండి నిర్వహిస్తుంది. Sir కు ఈ విషయం చెప్పగానే పిల్లలను కూడా పంపిద్దాం తీసుకు వెళ్ళండి అని తన స్వంత ఖర్చులతో 77 మంది విద్యార్థులను, ఉపాధ్యాయుల ను కాకినాడ "క్రియ " పోటీల్లో పాల్గొనడానికి పంపారు. వారికి ధన్యవాదములు.కాకినాడ లో క్రియ నిర్వాహకులు రామ కృష్ణ రాజు, దీపక్, రాజు చక్కని వసతి కల్పించారు. మిత్రులు మాచి రాజు గారు ఆత్మీయ స్వాగతం పలికారు.ఉదయాన్నే JNTU ప్రాంగణం చేరుకోగానే స్వాగత ద్వారాల్లోనే వారి సృజనాత్మకత ఎలా ఉంటుందో అర్ధం అయింది. ముందుగానే Online registration చేసుకోవడం వలన ఉదయం 9 గంటలకే పోటీలు మొదలయ్యాయి. విభిన్న వేదికల మీద ఒకే సారి పోటీలు మొదలయ్యాయి. Quiz, drawing, songs విభాగాల్లో మా పాఠశాల విద్యార్థులు (ZPHS చెన్నారెడ్డి పల్లి )పాల్గొన్నారు. అన్ని పోటీలు తిరుగుతూ వారి నిర్వహణ విధానం పరిశీలిస్తూ పిల్లల ప్రతిభ కు ఆశ్చర్య పోతూ ఫోటోలు తీసుకుంటుంటే కాలం తెలియ లేదు.దాదాపు 10,000 పిల్లలు వందల మంది ఉపాధ్యాయులు తల్లి దండ్రులు ఒక చోట చేరడం పండుగ కాక మరేమిటి. చక్కని ప్రణాళికతో, బృంద స్ఫూర్తి తో నిర్వహించడం ఆశ్చర్యం గొలిపింది. ఇక పిల్లల ఆనందానికి అవధుల్లేవు. బాల్యం ఒక వరం అది ఆనందాలకు నిలయం.బాలల సంపూర్ణ మూర్తిమత్వం వికసించడానికి విద్యలో ఎన్నో అంశాలు ప్రవేశపెట్టారు మేధావులు, విద్యావేత్తలు,తత్వవేత్తలు, మనో వైజ్ఞానిక నిపుణులు. వాటి ఆధారంగా NCERT, SCERT లు ప్రణాళికా బద్దంగా పాఠ్య, సహపాఠ్య, అదనపు కృత్యాలు,ఆటలు ఇలా విభిన్న అంశాలతో విద్యా Calendars తయారు చేసి అమలు చేయాలి అని ఆదేశిస్తుంటారు. కాని IIT, NEET, Ranks, marks ల పేరుతో విద్యార్థులకు అవేవి అందించకుండా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఊదరగొట్టేదే నిజమైన విద్య అని నమ్మే సమాజం తయారయ్యింది. విషాదం ఏంటంటే విద్యారంగం లో ఉండే వారే వాటిని నమ్మడం. వీటన్నిటికి సమాధానం చెబుతున్నట్లు "క్రియ "సంస్థ వారు విభిన్న అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఇలా విద్యార్థుల్లోని ఆసక్తులను, అభిరుచులను, ప్రతిభ ను వెలికి తీయడం అపూర్వమైన విషయం. కొన్ని విషయాలు చర్చించుకుందాం.1)వ్యాస రచన : civils,groups లకు అద్భుతంగా పనికి వచ్చే అంశం.విద్యార్థి సృజనాత్మకంగా తన ఆలోచనలను వ్యక్తీకరించడానికి అనువైన అంశం.కొన్ని వందలమంది ఒక్క చోట చేరి వ్రాస్తూ ఉండడం చూట్టానికి ఎంతో బాగుంది.2) వక్తృత్వం :ఏ అంశం పై నైనా అందరి ముందు తన అభిప్రాయాలను చెప్పే ధైర్యం, వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉండడం భవిష్యత్ ఉద్యోగం సాధనకు పనికి వచ్చే విలువైన అంశం." క్రియ" లో ఈ అంశం చక్కగా నిర్వహించారు.3) క్విజ్ :GK, Current affairs, general science ల సమాహారం. కౌన్ బనేగా కరోడ్ పతి time లో tv లకు అతుక్కుపోయి చూసారు జనాలు. విద్యార్థుల జీవితాలను జ్ఞాన సుసంపన్నం చేసే ప్రక్రియ ఇది. ముందుగా ఇద్దరేసి జట్లకు వ్రాత పరీక్ష నిర్వహించి, తరువాత Top 4 జట్లకు పెద్ద ఆడిటోరియం లో computerbased quiz నిర్వహించారు. ఉత్కంట భరితంగా జరిగింది.4) Debate : ముగ్గురేసి విద్యార్థులు జట్లుగా నిర్వహించే ఈ కార్యక్రమం విద్యార్థిలోని సంభాషణా నైపుణ్యాలను వెలికి తీస్తుంది. ఉద్యోగాలు ఇవ్వడానికి సంస్థలు ఈ ప్రక్రియనే ఎన్నుకొంటాయి. ఈ అంశాన్ని మరింత సమన్వయం తో జరిపారు.5) science fair 6) poster presentation విద్యార్థుల్లోని విజ్ఞాన తృష్ణ ను వెలికితీస్తాయి.7) పాటలు 8) నృత్యం 9) వాద్య సంగీతం విద్యార్థులకు ఎంతో మానసిక,శారీరక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు. వీటి నిర్వహణ అమోఘం. ముఖ్యంగా classical, folk dance లకు వందకు పైగా group ల విద్యార్థులు చేసే నృత్యాలను చూస్తుంటే రెండు కళ్ళు చాల్లేదు. అలాగే విభిన్న వాద్య పరికరాలను వాయించే చిన్నారులను చూడటం ఒక ఆహ్లాదం కలిగించే అంశం. ఇక 10) mono action, 11)drawing 12) skits 13) మేజిక్ పిల్లల్లోని ప్రతిభ ను వెలికి తీసే అంశాలు.14) మట్టి తో బొమ్మలు చేయడం మరో అపూర్వ అంశం. కొన్ని వందల మంది తదేక దీక్షతో వాటిని తయారు చేయడం ముచ్చటేసింది.15) కథలు వ్రాయడం 16) కథలు చెప్పడం 17) కథలు విశ్లేషించడం ఇవి ఇప్పుడు చదువులో భాగమే కదా.18) spelling 18) map pointing 19) project work ఇవన్నీ curriculam లో భాగం.20) క్రాఫ్ట్ 21) fancy dress,22) మిమిక్రి ఇలా పిల్లలు ఆనందించే ఇన్ని అంశాలు అద్భుతమైన సమన్వ యం, ప్రణాళికతో నిర్వహించిన" క్రియ " team కు అభినందనలు. మళ్ళీ ఈ సారి ఈ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం.ఈ కార్యక్రమం లో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ గారితో మాట్లాడటం ఒక గొప్ప అవకాశం. అలాగే సినిమా మాటల రచయిత పింగళి చైతన్య గారిని కలిసి మాట్లాడటం మరో మంచి జ్ఞాపకం.తోటి ఫిజిక్స్ ఉపాధ్యాయులు రవికుమార్, బ్రహ్మానందరెడ్డి, ఏకాంబ రేశ్వరరావు, సుబ్బనాయుడు, వినీల్, సుబ్రహ్మణ్యం గార్లను లను కలవడం ఆనందం కలిగించిన విషయం.ఇంకా నాతో పాటు CH. సుబ్రహ్మణ్యం HM,ఉపాధ్యాయులు రామాంజనేయులు, వేణు గోపాల్, రవిచంద్ర, రంగనాధ్,music teacher ఖాసీం,ఝాన్సీ పాల్, పద్మజ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు, తోడ్పాటు ను అందించిన చంద్రశేఖర్ రెడ్డి HM సార్ కు ధన్యవాదములు.కొసమెరుపు :మాతో పాటు వచ్చిన మార్కాపురం బాలికోన్నత పాఠశాల విద్యార్థులు జానపద నృత్య విభాగం లో ద్వితీయ బహుమతి సాధించడం.... ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment