మా చిన్నప్పుడు పుట్టిన రోజు చేసుకున్న జ్ఞాపకాలే లేవు.గుర్తు ఉంచుకుందామనుకుంటూ ఉంటాము. తీరా ఆ రోజుకి మర్చి పోవటం ,18 వ ఏట అనుకుంటా ఓ ఫ్రెండ్ గుర్తుచేసేదాకా ఇలా మరిచిపోవటమే జరిగింది మరి ప్పుడో పిల్లల పుట్టిన రోజులు ఎంతో వైభవంగా జరపటం చూస్తున్నాము.ఘనంగా ఆడంబరంగా జరుపుతున్నారు. ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.చిన్నప్పుడు ఓ 5 లేదా 6 ఏండ్ల వరకు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరు పుకుంటే బాగుంటుందేమో!
ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు .ఇది అంతా మామూలే! ఇక చెప్పేదేమిటంటే ఈ మధ్య మా అమ్మాయి పుట్టిన రోజు ఏదైనా విభిన్నంగాచేద్దామనుకున్నాను. గుర్తు ఉండిపోయేలా!అప్పుడు ఓ ఆలోచన వచ్చింది.ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది అని. కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి. వాటిని పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే పాటశాల సరయిన చోటు అని నిర్ణయించుకున్నాక దగ్గరిలో ఉన్న నర్సరీ నుండి 8 కానుగ మొక్కలు తెప్పించి బడి పిల్లలు మరియు మావ్యాయామ ఉపాధ్యాయుడు రామానాయక్ సహకారంతో నాటించాను.ఆయన అప్పటికే చాలా మొక్కలను పెంచాడు.8,9 తరగతుల పిల్లలకు వాటి బాధ్యత అప్పగించాము.ఒక్కొక్కరికి ఒక మొక్క కేటాయించి వాటి సంరక్షణ చూడమని ప్రోత్సాహించాము.అలాగే పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము .
ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా 7 వ వంతు జనాభా ప్రతి ఒక్కరు ఇలా ఒక మొక్క నాటినా ఏటా 100 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!
మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !
idea bane undi mundu place undi kada :(
ReplyDeleteమనసుంటే మార్గం ఉంటుంది. మనం చిన్నప్పుడు చదివిన స్కూల్స్ లో కానీ,లేదా మనకు దగ్గరగా ఉన్న స్కూల్ వారితో మాట్లాడి వారికి ఒక మొక్క అందించి వారి సహకారంతో అక్కడ నాట వచ్చు. మీ స్పందనకు ధన్యవాదాలు .
ReplyDeleteసూపర్ అయిడియా....ఇంక లోకమంతా సస్యశామలమే
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలండి .
Deleteమంచిపని చేశారు .అభినందనలు.
ReplyDeleteTyped with Panini Keypad
మీకు స్వాగతం,ధన్యవాదాలు .
Deleteచక్కటి విషయాలను తెలియజేసారు.
Deleteఆచరణలో చేసి చూపిస్తున్నందుకు మీకు అభినందనలండి.
thank you.
Deletethank you.
Deletethank you.
DeleteThis comment has been removed by the author.
Delete